Watch our film Thimmarajupalli TV to experience technical brilliance, strong

Sarkar Bai Movie Launch Ceremony Held Grandly at Secunderabad Ganesh Temple
The upcoming film Sarkar Bai, set against a Telangana social backdrop, was formally launched with a grand pooja ceremony at the Ganesh Temple in Secunderabad. The film stars Sriram Nimmala and Sai Keerthana in the lead roles and is being directed by Lara.
As part of the muhurtham ceremony, producer Tummala Praful Ram Reddy switched on the camera, while director Lara directed the first shot. The muhurtham clap was given by Telangana Income Tax Officer Dasaram. On the occasion, guests conveyed their best wishes to the film unit.
Speaking at the event, director Lara said that the film is based on real-life water-related incidents and caste discrimination issues that took place in 1985. She expressed confidence that the film, which reflects people’s struggles and social realities, will receive strong support from audiences in both Telugu states. She also appealed to viewers to encourage meaningful cinema with socially relevant themes.
The film features Sriram Sriram Nimmala as the hero and Sai Keerthana as the heroine. The supporting cast includes Baahubali Prabhakar, Naga Mahesh, Dil Ramesh, Chalaki Chanti, Chittibabu, Shivani Reddy, Nupur Mukherjee, Atidhi, and others in important roles.
The remaining cast members will be finalized soon, and the shooting of the film is expected to commence later this month, the makers announced. The launch event at the Ganesh Temple was attended by the film team in a festive atmosphere.
Producer: Tummala Praful Ram Reddy
Director: Lara
Music Director: K, Siva
Costume Designer: Madhavi
Cast: Sriram Nimmala (Hero), Sai Keerthana (Heroine), Bahubali Prabhakar, Naga Mahesh, Dil Ramesh, Chalaki Chanti, Chitti Babu, Shivani Reddy, Nupur Mukherjee, Atithi, etc.
PRO: Ashok Dayyala.
సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో ఘనంగా సర్కార్ బాయి మూవీ పూజా కార్యక్రమం
తెలంగాణ సామాజిక నేపథ్యంతో రాబోతున్న చిత్రం ‘సర్కార్ బాయి’. శ్రీరామ్ నిమ్మల , సాయి కీర్తన హీరోహీరోయిన్లుగా, లారా దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కార్ బాయి’ చిత్రానికి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ముహూర్తం కార్యక్రమంలో భాగంగా నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు లారా సీన్ డైరెక్షన్ చేశారు. ముహూర్తం షాట్‌ను తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు లారా మాట్లాడుతూ..1985 సంవత్సరంలో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.
ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని మూవీ యూనిట్ వ్యక్తం చేసింది. ప్రేక్షకులు ఈ సామాజిక కథాంశంతో వచ్చే చిత్రాన్ని ఆదరించాలని డైరెక్టర్ కోరారు
మూవీ ముహూర్తం కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శకులు ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో భాగంగా వచ్చే సినిమాలను ఆదరించాలని ఆయన కోరారు
ఈ చిత్రంలో హీరోగా శ్రీరామ్ నిమ్మల , హీరోయిన్గా సాయి కీర్తన నటిస్తున్నారు. ప్రధాన తారాగణంలో బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్ ముఖర్జీ, అతిధి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ కార్యక్రమంలో మోహన్ బైరాగి, రవి, చార్వాక , మేనేజర్ మధు, తదితరులు పాల్గొన్నారు
ఇంకా మిగిలిన నటీనటులను త్వరలో ఖరారు చేసి, ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. గణేష్ టెంపుల్లో నిర్వహించిన ముహూర్తం కార్యక్రమంలో మూవీ టీం సందడి చేయడం ఆకట్టుకుంది.
నిర్మాత : తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి
దర్శకత్వం: లారా
మ్యూజిక్ డైరెక్టర్ కె, శివా
కాస్టమ్ డిజైనర్ మాధవి
నటీనటులు: శ్రీరామ్ నిమ్మల (హీరో), సాయి కీర్తన (హీరోయిన్), బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్ ముఖర్జీ, అతిధి, తదితరులు.
పీఆర్ఓ: అశోక్ దయ్యాల.
