Our film Rakasa can Watch Whole Family together and enjoy a hearty laugh

Amba’s Revenge – First AI-Based Telugu Feature Film Announced
Marking a technological milestone in the Telugu film industry, “Amba’s Revenge” is set to become the first full-length Telugu feature film created with the support of Artificial Intelligence (AI). The title poster of the film was unveiled on the occasion of
Hanuman Vijayotsavam .
Produced by Srikanth Reddy Kunduru and co-produced by Rani Madison, the film is being developed under the creative direction of Jayavardhan Madi. The project draws inspiration from the powerful character Amba from the Mahabharata and presents her story through a fresh and innovative mythological narrative using advanced AI technology. The film is being jointly produced by Sri Lalitakala Chitralu and Nakka Thoka Films.
Speaking on the occasion, producer Srikanth Reddy Kunduru and creative director Jayavardhan Madi said that the project marks the beginning of a new experimental phase in Telugu cinema. They explained that cutting-edge AI tools are being used in visual design, character creation, and narrative development to present the story in a unique cinematic style. The title poster release on
Hanuman Vijayotsavam is the first step in introducing the project to audiences, and more details will be announced soon.
The film is being seen as a significant step toward AI-driven storytelling in Telugu cinema. By blending mythology with modern technology, “Amba’s Revenge” has already generated curiosity and interest among movie lovers and industry observers alike.
Producer: Srikanth Reddy Kunduru
Co-Producer: Rani Madison
Creative Director: Jayavardhan Madi
PRO: Ashok Dayyala
తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్
చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తూ, సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ పౌరాణిక చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు, క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాము. “అంబ’s రివెంజ్” ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగిస్తూ విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం ” అని తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. పౌరాణిక కథను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రొడ్యూసర్ : శ్రీకాంత్ రెడ్డి కుందూరు
కో-ప్రొడ్యూసర్ : రాణి మాడిసన్
క్రియేటివ్ డైరెక్టర్ : జయవర్ధన్ మాడి
పీఆర్ఓ: అశోక్ దయ్యాల
