VD birthday poster unveiled from prestigious film under the Vyra

Kosindi Koyagura Song Released From Garividi Lakshmi
గరివిడి లక్ష్మి నుంచి అదిరిపోయే జానపదం కోసింది కొయగూర సాంగ్ రిలీజ్
భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అద్భుతమైన జానపదం కోసింది కొయగూర సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
చరణ్ అర్జున్ ఈ జానపదాన్ని రాఎనర్జీ వుండే డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేశారు. అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము వోకల్స్ మరింత వైబ్ ని యాడ్ చేశాయి.
ఉత్తరాంధ్ర జనపదం మూలం నుంచి స్వరపరిచిన ఈ పాటకు గంటేడ గౌరు నాయుడు, గౌరీ నాయుడు జమ్ము రాసిన అదనపు సాహిత్యం మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.
ఈ సాంగ్ లో ఆనంది పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. రాగ్ మయూర్ ప్రజెన్స్ డ్యాన్స్ మూమెంట్స్ మరింత జోష్ ని తీసుకొచ్చింది.
ఈ పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో నరేష్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గరివిడి లక్ష్మి మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా.
తారాగణం: నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: T.G. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
సినిమాటోగ్రాఫర్ (DOP): J. ఆదిత్య
సంగీతం: చరణ్ అర్జున్
చీఫ్ కోఆర్డినేటర్: మేఘా శ్యామ్ పాతాడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ చౌదరి కొల్లి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సుకుమార్ కిన్నెర,
asst. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: దుర్గా ప్రసాద్, క్రాంతి కుమార్ దత్తి
ప్రొడక్షన్ కంట్రోలర్: విశ్వేష్ అంపోలు, దాసరి రాజు బాల కృష్ణ
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
