A Heartfelt Promise – Chiranjeevi Prepares To Introduce Free Education

A Heartfelt Promise – Chiranjeevi Prepares To Introduce Free Education Project
Megastar Chiranjeevi, known for balancing a packed cinema career with meaningful humanitarian service, continues to prove why he remains a hero both on and off the screen. For decades, his long-standing institutions- the Chiranjeevi Charitable Trust, the Blood Bank, and the Eye Bank, have played a vital role in public welfare, often becoming lifelines in times of crisis. Whether it’s a natural disaster or an unexpected emergency, he is consistently among the first to step forward and offer help.
Chiranjeevi, during Ugadi special program, unveiled the outline of a significant new mission. “When I understood the importance of blood and how many lives are lost due to its shortage, I felt the need to motivate all my fans to participate in blood donation. That thought came to me 25 years ago.
I don’t want to stop with that. I am now thinking about how to provide education to poor people in the future. Actor Suriya started the Agaram Foundation, taking inspiration from me. In turn, I want to draw inspiration from him and begin offering free education. Not just in the Telugu states, wherever there is a need, I will work towards providing free education.”
He further assured that comprehensive details about this upcoming educational program will be revealed soon, marking another chapter in his enduring commitment to social good.
ఉచిత విద్యా ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి
వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సంక్షోభ సమయాల్లో ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని అత్యవసర పరిస్థితి అయినా, సహాయం అందించడానికి ముందుకు వచ్చే వారిలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు.
ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఒక ముఖ్యమైన కొత్త కార్యక్రమం గురించి చెప్పారు. “రక్తం యొక్క ప్రాముఖ్యతను, రక్త కొరత కారణంగా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో నేను అర్థం చేసుకున్నప్పుడు, నా అభిమానులందరినీ రక్తదానంలో పాల్గొనేలా స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. ఆ ఆలోచన నాకు 25 ఏళ్ల క్రితమే కలిగింది”
”నేను కేవలం అక్కడితోనే ఆగిపోదలచుకోలేదు. భవిష్యత్తులో పేద ప్రజలకు విద్యను ఎలా అందించాలనే దానిపై ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నన్ను స్ఫూర్తిగా తీసుకుని నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించారు. ఇప్పుడు, నేను ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఉచిత విద్యా బోధనను ప్రారంభించాలనుకుంటున్నాను. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైతే అవసరం ఉంటుందో, అక్కడ ఉచిత విద్యను అందించే దిశగా కృషి చేస్తాను”
ఈ కొత్త విద్యా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. సమాజానికి ఉపయోగపడే మరో గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.
