
గుర్తుకొస్తున్నాయి మంచి ఫన్ రైడ్.. అందరికీ కనెక్ట్ అవుతుంది – విరాజ్ అశ్విన్
యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ లో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శరత్ కి గుడ్ లక్. కచ్చితంగా ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. విరాజ్ కి హ్యాపీ బర్త్డే. గ్లింప్స్ చాలా బాగుంది. డైరెక్టర్ వినోద్ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ. ఈటీవీ విన్ గత రెండు సంవత్సరాలుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మేము సంవత్సరానికి ఒక హిట్ తీయడానికి కష్టపడుతుంటే సంవత్సరానికి మూడు నాలుగు ఇట్లు కొడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. లిటిల్ హార్డ్స్, రాజు వెడ్స్ రాంబాయి.. ఇలా అన్ని చిత్రాలు గొప్ప విజయాలు సాధించాయి. ఈ విజయాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నితిన్ గారు సాయి గారు గ్రేట్ వర్క్ చేస్తున్నారు. చిన్నప్పుడు నుంచి ఈటీవీ అంటే అభిమానం. శ్రీవారికి ప్రేమలేఖ మయూరి పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్విని ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆ సంస్థ నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి విజయవంతమైన చిత్రాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం 16 సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. మంచి ప్రతిభ ఉన్న వారికి ఈటీవీ విన్ గొప్ప వేదికగా నిలుస్తోంది. ‘గుర్తుకొస్తున్నాయి’ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నాకు చాలా స్పెషల్ డే. నా బర్త్ డే రోజున గుర్తుకొస్తున్నాయి గ్లింప్స్ ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మన జీవితంలో మనం చాలా జ్ఞాపకాలు క్రియేట్ చేసుకున్నాం. అవి భవిష్యత్తులో మనకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మొహం మీద నవ్వు వస్తుంది. అది ఎప్పుడు అలాగే ఉండాలి. గుర్తుకొస్తున్నాం కూడా జ్ఞాపకాల సమాహారం. ఇది సొంతోష్ అండ్ అతని ఫ్రెండ్స్ ఫన్ రైడ్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ కంటెంట్ ని ఆడియన్స్ కి చెప్పడానికి సాయి గారు నితిన్ గారు రావడం ఒక పెద్ద సక్సెస్ గా భావిస్తున్నాం. శరత్ గారిలో చాలా మంచి రైటర్ కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఆయన దగ్గరే స్టార్ట్ అయింది. ఇది సిరిస్ నా? సినిమానా? అందరికీ ఈ కన్ఫ్యూజన్ ఉంది. యూనివర్స్ సపోర్ట్ చేస్తే ఇది మీ అందరికీ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అలాగే ప్రతి ఇంట్లో దూరి ఒక మంచి సీరియస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. దానికి మీతో పాటు నేను ఎదురు చూస్తున్నాను. ఏదేమైనా ఇది ఖచ్చితంగా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమా. చూస్తున్నప్పుడు అందరికీ చాలా మంచి జ్ఞాపకాల గుర్తొస్తాయి.
ఈటీవి విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. #90 సిరీస్ రిలీజ్ అయినప్పుడు ప్రోమోట్ ఇన్స్టా పేజ్ చూస్తున్నప్పుడు ‘రేలంగి మామయ్య’ కరెక్ట్ అనిపించింది. అది శరత్ చంద్ర క్రియేట్ చేసిన పేజీ. ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు ఆ కంటెంట్ తో ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచించాము. ఈ అలాంటి అద్భుతమైన పేజీలో కంటెంట్ చేస్తున్నందుకు శరత్ కి థాంక్యూ. ఈటీవీ నుంచి వచ్చే ప్రతి సినిమా డిఫరెంట్ జానర్ లో ఉంటాయి. ఫస్ట్ టైం నోస్టాల్జియ జానర్ లో వస్తున్నాం. ఇది చూసినప్పుడు మీకు కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. అవి ఆనంద భాష్పాలు అవుతాయని కోరుకుంటున్నాను . సమ్మర్ లో ఈ సిరీస్ ని చూడండి. మీ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఈటీవీ విన్ ప్రామిస్. ఒక బలగం ఒక #90.. ఒక గుర్తుకొస్తున్నాయి.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మనం ఎవరినైతే మర్చిపోయామో వాళ్ళందర్నీ గుర్తు చేసుకోవడానికి వచ్చిన అవకాశం గుర్తుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉండే కన్ఫ్యూజన్ అంత విరాట్ చేసిన సంతోష్ క్యారెక్టర్ లో ఉంటుంది. అక్కడ లేని నవ్వులన్నీ చూస్తున్న ఆడియన్స్ లో వుంటాయి. అది గ్యారెంటీ. అమ్మమ్మని ఇష్టపడని మనుషులంటూ ఉండరు. అమ్మమ్మని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆ అమ్మమ్మకి ఇచ్చే చిరుకానుక గుర్తుకొస్తున్నాయి. రేలంగి మామయ్య ఇంస్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసిన శరత్ చంద్ర గారికి కంగ్రాట్యులేషన్స్. ఇది ఈటీవి విన్ ఒరిజినల్ ప్రీమియం సిరిస్. సమ్మర్ లో అందరినీ అలరిస్తుంది.
డైరెక్టర్ వినోద్ గాలి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈటీవీ విన్ నాకు హోమ్ గ్రౌండ్ లాంటిది. ఇది నాకు ఆ సంస్థలో రెండో ప్రాజెక్టు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్యూ. చాలా కష్టపడ్డారు. నితిన్ గారికి సాయి గారికి థాంక్యూ. ఇది చాలా మంచి సోల్ ఫుల్ కంటెంట్. మర్చిపోయినవని గుర్తు చేసే సినిమా. ఈ ప్రాజెక్టు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఇన్సిడెంట్ కారణంగా హీరో గతాన్ని మర్చిపోతాడు. కానీ మనం నార్మల్ గానే అందరిని మర్చిపోతున్నాం. రోజుకు ఒక ఐదు నిమిషాలు అయినా మనకు నచ్చిన మనుషులతో మాట్లాడితే చాలు. ఈ ప్రాజెక్టుతో అదే చెప్పాలనుకుంటున్నాం. మేము 10% రాస్తే విరాజ్ 100% తీసుకెళ్లారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే దానికి కారణం విరాజ్. చాలా అద్భుతమైన నటీనటులు, అలాగే యంగ్ టాలెంట్ ఈ సినిమాలో ఉంది. అందరికీ థాంక్యూ సో మచ్.
ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. గుర్తుకొస్తున్నాయి బ్యూటిఫుల్ ప్రాజెక్టు. మన జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ వుంటుంది. ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు ఏది మిస్ అవుతున్నాము అది మీకు గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో హీరో ఓ ఇన్సిడెంట్ కారణంగా గతాన్ని మర్చిపోతాడు. నిజానికి మన జీవితంలో మనం బిజీ అయిపోయి నార్మల్ గానే మర్చిపోతున్నాము. అవన్నీ గుర్తు చేస్తూ బ్యూటిఫుల్ గా జరిగే కథ ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి గారికి నితిన్ గారికి థాంక్యూ. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నా టీం ఎంతగానో సపోర్ట్ చేశారు. రాజశేఖర్ ఈ కథని అద్భుతంగా రాశాడు. డైరెక్టర్ వినోద్ చాలా పాషన్ తో తీశారు. విరాజ్ యాక్టింగ్ చూసి మీరందరూ షాక్ అవుతారు. ప్రాజెక్టుకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం:
విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్, గోపరాజు రమణ, వైవా రాఘవ, పవన్ సిద్దు, గోదావరి గోపి, అనీష్ కురువిల్లా, మేఘన సునీల్, గఫూర్
సిబ్బంది:
దర్శకత్వం: వినోద్ గాలి
నిర్మాత: శరత్ చంద్ర నాయుడు
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రమదేష్ వి
రచయిత: రాజశేఖర్ రెడ్డి బద్దం
DOP: రెహాన్ షేక్
సంగీతం: అజయ్ అర్సాదా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనీష్ పల్లె
ఎడిటర్: వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: శివ కుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్: రక్షిత మణివన్నన్
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
పబ్లిసిటీ డిజైనర్: మన్నం సాయి తేజ
పీఆర్వో: వంశీ శేఖర్
