
Rakasa Teaser Unveiled
The teaser of Rakasa has been officially unveiled, offering a striking glimpse into a spectacle-driven mythic universe that merges folklore horror, ancient ritualistic traditions and high-stakes supernatural adventure, while retaining a lively streak of entertaining comedy. The teaser establishes a distinct tonal space, positioning the film as a rooted yet large-scale theatrical entertainer.
Opening with an ominous prophecy – “నరకం నుంచి సందేశం వస్తుంది, ఇంక సమయం లేదు, మన ఊరి శాపం ఇది, మన ఊరి తలరాత ఇది” the teaser immediately situates the narrative within the framework of a generational curse haunting an entire village. The visuals depict a long-standing ritualistic practice tied to a sealed fortress wall, suggesting an ancient system of appeasement that has shaped the village’s fate. Without revealing plot specifics, the opening builds tension through atmosphere and cultural rootedness.
The tonal shift that follows introduces a vibrant social setting as *Sangeeth Shobhan* arrives in the village on a marriage bus, bringing youthful energy and situational humor into an otherwise ominous landscape. This contrast becomes central to the teaser’s design. Once the imposing fortress gates open and close behind him, the narrative transitions into a contained supernatural adventure. Fiery manifestations, a towering demonic presence and intense confrontations unfold within the walled world, indicating both scale and mythic depth. The teaser blends dread, spectacle and accessible entertainment while maintaining narrative intrigue.
The teaser’s visual grammar reflects narrative intention rather than surface styling. The interplay between cold blue frames and blazing amber tones is not merely aesthetic; it signals the collision between an inherited curse and erupting chaos at the heart of the story. The fortress interiors, torch-lit assemblies and ritual-heavy staging suggest a lived-in mythic system, indicating that the film operates within a structured folklore universe rather than a generic horror setting. This level of visual coherence points to technical precision across cinematography, production design and VFX integration. The scale of staging, controlled lighting contrasts and textured world-building collectively indicate that *Rākāsā* is mounted as a grand theatrical experience – crafted for immersion, impact and large-screen engagement rather than functioning as a routine genre outing.
*Rākāsā* stars *Sangeeth Shobhan*, returning after the success of *MAD* and *MAD Square*, expanding into a performance space that combines humor with myth-driven intensity. He is paired with *Nayan Sarika*, while the ensemble cast includes *Vennela Kishore, Brahmaji, Tanikella Bharani, Ashish Vidyarthi,* and *Getup Srinu*, reinforcing the film’s tonal versatility. Written and directed by *Manasa Sharma*, who previously served as writer and creator for *Oka Chinna Family Story* (ZEE5) and directed *Bench Life* (Sony LIV), the film marks her feature directorial debut under *Pink Elephant Pictures*. Presented by *Z Studios* and produced by *Niharika Konidela* and *Umesh Kumar Bansal*, the film is backed by a strong production framework. The technical team includes music by *Anudeep Dev*, cinematography by *Raju Edurolu*, and editing by *Anwar Ali*, shaping the film’s visual and tonal identity.
Prior to the teaser launch, the film’s glimpse had already generated strong traction, crossing *1.9 million views* across digital platforms. The consistent online engagement reflects growing audience curiosity around the film’s genre blend and world-building approach. Strengthening its international footprint, *Rākāsā* has secured a wide overseas rollout through *Atharvana Bhadrakali Pictures*, which will release the film across more than *350 theatres* in key markets including the USA, the United Kingdom, Europe, Canada and Australia. This strategic global positioning underscores the film’s scale and theatrical ambition.
With its expansive mythic setting, deliberate world-building and balanced genre treatment, *Rākāsā* advances toward its worldwide theatrical release on *April 3, 2026*, carrying sustained momentum across domestic and overseas markets.
సంగీత్ శోభన్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ మీద నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన చిత్రం ‘రాకాస’..
నవ్విస్తూ, భయపెడుతూ అంచనాలు పెంచేసిన టీజర్
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సాధించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న నిహారిక ప్రస్తుతం మరో డిఫరెంట్ స్టోరీతో ఓ సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకు రానున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ క్రమంలో రిలీజ్ చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ తరువాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘నరకం నుండి సందేశం వస్తుంది.. ఇక సమయం లేదు.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’ అంటూ ఊరిని, ఊరి జనాల్ని పరిచయం చేస్తూ వదిలిన టీజర్ అద్భుతంగా ఉంది. ‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. ఈ రెండు లైన్సే వస్తున్నాయేంటి?’ అంటూ భయపడుతూ, నవ్విస్తూ హీరో పాత్రని పరిచయం చేశారు.
హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చిన తరువాత టీజర్ పూర్తిగా కామెడీ జానర్లోకి మారిపోయింది. ఇదే ఆఖరి హెచ్చరిక అంటూ మళ్లీ మరో కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఆ తరువాత చూపించిన యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ఇక చివర్లో హీరో భయపడుతూ.. ‘స్త్రీ.. రేపు రా’ అనే డైలాగ్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే కంప్లీట్ పవర్ ఫ్యాక్డ్ సినిమాలా కనిపిస్తోంది. నవ్వించడం, భయపెట్టడంతో పాటు ఏదో ఓ కొత్త కాన్సెప్ట్‌ను ‘రాకాస’లో పరిచయం చేయబోతోన్నట్టుగానే కనిపిస్తోంది.
టీజర్‌తో ఒక్కసారిగా అంచనాల్ని అమాంతం పెంచేసినట్టు అయింది. ఇక ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (బజర్దస్త్), రోహన్ (నైంటీస్) తదితరులు
సాంకేతిక వర్గం: బ్యానర్స్: జీ స్టూడియోస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ l నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్ l కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మానస శర్మ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్ l ఆడిషన్ స్క్రీన్ ప్లే: మహేష్ ఉప్పాల l సంగీతం: అనుదీప్ దేవ్ l సినిమాటోగ్రాఫర్: రాజు ఎదురోలు l యాక్షన్ కొరియోగ్రాఫర్: విజయ్ l ఎడిటర్: అన్వర్ అలీ l ప్రొడక్షన్ డిజైనర్: రామాంజనేయులు l ఆర్ట్ డైరెక్టర్: పుల్ల విష్ణు వర్ధన్ l కాస్ట్యూమ్ డిజైనర్: సంధ్య సబ్బవరపు l పి.ఆర్.ఒ: ఎస్.కె.నాయుడు-ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్నర్: యు వి మీడియా l మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
