
Mrithyunjay 1st Single Ee Zindagi unveiled
The King of Entertainment Sree Vishnu, is currently bringing an investigative thriller titled “Mrithyunjay” directed by Hussain Sha Kiran. The film is produced by Sandeep Gunnam and Vinay Chilakapati under the banners of Lightbox Media and Picture Perfect Entertainment. The blockbuster Samajavaragamana duo is all set to share the screen once again. Reba Monica John is playing the female lead in Mrithyunjay.
After the thrilling teaser, expectations for the film skyrocketed. Today, the makers began the musical promotions for the film. The first single, “Ee Zindagi,” is out now. Energetic star Ram Pothineni launched the song online and shared his best wishes with the entire team.
The song, composed by Kaala Bhairava, is a solid beat that puts you in a trance. It begins with a Bhagavad Gita shloka, reminding listeners of the kind of song it is.
Abhinava Kavi’s rap version works really well. The lyrics by Abhinava Kavi and Krishna Kanth, which talk about life and its challenges, lift spirits at many moments. Sree Vishnu, along with his gang, is seen taking life as it comes, despite being surrounded by deaths. The friendship moments and the trippy vibe of the song make it even more interesting. Aditya Iyengar has sung the song brilliantly.
Mrithyunjay is hitting the big screens on March 6th, 2026. With proper promotions and exciting content, Mrithyunjay is all set to impress the audience. This Sree Vishnu-styled thriller promises another intriguing entertainer. The cinematography is managed by Vidhya Sagar, Kaala Bhairava is composing the music, Sreekar Prasad is in charge of editing, and Manisha A. Dutt oversees production design.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ రిలీజ్.. మార్చి 6న చిత్రం భారీ ఎత్తున విడుదల
ది కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని మార్చి 6న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్ అందరినీలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేయించారు. ఈ పాటను ఆన్లైన్లో రిలీజ్ చేసిన రామ్.. టీంకి బెస్ట్ విషెస్‌ను అందించారు. భగవద్గీత శ్లోకంతో ప్రారంభమైన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కాళ భైరవ అందించిన బాణీ, అభినవ కవి ర్యాప్ వెర్షన్ అద్భుతంగా ఉంది. ఇక అభినవ కవి, కృష్ణకాంత్ రాసిన సాహిత్యం అయితే జీవితం, అందులో ఎదురయ్యే సవాళ్ల గురించి ఎంతో గొప్పగా చాటి చెబుతోంది.
శ్రీ విష్ణు తన గ్యాంగ్‌తో కలిసి చేసే పనులు, వాళ్లకి ఎదురైన సవాళ్లు, వారి స్నేహ బంధం ఇలా అన్నీ రకాల ఎమోషన్స్‌ను చూపించేలా ఈ పాట సాగింది. ఇక ఆదిత్య అయ్యంగార్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ‘మృత్యుంజయ్’ మూవీని మార్చి 6, 2026న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ విష్ణు శైలిలో రూపొందిన ఈ థ్రిల్లర్ మరో ఆసక్తికరమైన ఎంటర్టైనర్గా నిలుస్తుందని టీం హామీ ఇస్తోంది. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా విద్యా సాగర్, ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మనీషా ఎ. దత్ పని చేశారు.
