బూకి యూత్ తో పాటు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా – రామాంజనేయులు

ఆడియెన్స్ ఇచ్చే టైం, పెట్టే మనీకి న్యాయం చేసేలా మా సినిమా ఉంటుంది – శివ కందుకూరి
శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ .. ‘మా ‘నవాబ్ కేఫ్’ పట్ల టీం అంతా కూడా వంద శాతం సంతృప్తి చెందిది. ఈ మూవీతో ఓ సెన్సిబుల్ డైరెక్టర్ ప్రదీప్ రూపంలో టాలీవుడ్‌కు పరిచయం కాబోతోన్నారు. ప్రదీప్‌కు చాలా ఓపిక, సహనం ఉంటుంది. నిర్మాత వెంకట్ గారు మా కోసం ఈ సినిమాకి బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఈ మూవీ కోసం మా టెక్నికల్ టీం ప్రాణం పెట్టి పని చేసింది. నా కోసం అని కాకుండా వాళ్ల కోసమైనా సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. ప్రశాంత్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సురేష్ గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. రాజీవ్ కనకాల గారితో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. కసిరెడ్డితో పని చేయడం ఆనందంగా ఉంది. తేజుతో ఇది వరకే నేను సినిమాని చేయాలి. కానీ అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు ఇలా ఈ మూవీతో వస్తుండటం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌తో వచ్చే చిత్రాలెప్పుడూ ఫెయిల్ కావు అని నమ్ముతుంటాను. ఈ మూవీ చూసిన తరువాత ఫాదర్‌కి ఫోన్ చేసి మాట్లాడతారు. ఈ సినిమాలోని ఎమోషన్ కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆడియెన్స్ మాకు ఇచ్చే టైం, పెట్టే మనీకి న్యాయం చేసేలా మా సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 20న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘నవాబ్ కేఫ్’ అనేది ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌తో ఉంటుంది. ప్రతీ కొడుకు ఈ మూవీకి కనెక్ట్ అవుతుంది. సినిమా చూసే ప్రతీ ఫాదర్‌కి సన్, సన్‌కి ఫాదర్ గుర్తుకు వస్తారు. మంచి ఎమోషన్‌తో సినిమాని తీస్తే కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. అలాంటి ఎమోషన్‌తోనే ప్రమోద్ ఈ మూవీని తీశారు. ‘నవాబ్ కేఫ్’కి మినిమం గ్యారెంటీ టాక్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. వెంకట్ గారికి సబ్జెక్ట్ మీద చాలా నమ్మకం ఉంది. ఈ మూవీతో శివ యాక్టర్‌గా మరింత ఎలివేట్ అయ్యాడు. తేజుకి మంచి టాలెంట్ ఉంది. రాజీవ్ కనకాల గారి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. ప్రశాంత్ గారి మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా బాగుంటే కచ్చితంగా సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
హీరోయిన్ తేజు అశ్విని మాట్లాడుతూ .. ‘మా ‘నవాబ్ కేఫ్’ రేపు (ఫిబ్రవరి 20) రిలీజ్ కాబోతోంది. మేం ఇప్పటి వరకు మా సినిమాని, ప్రమోషన్స్‌ని వంద శాతం కష్టపడి చేశాం. సఖి లాంటి మంచి పాత్రను నాకు ఇచ్చిన ప్రమోద్ గారికి థాంక్స్. మాకు సపోర్ట్‌గా నిలిచిన వెంకట్ గారికి థాంక్స్. శివ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా మూవీని అందరూ చూడండి. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ ..‘‘నవాబ్ కేఫ్’కి సపోర్ట్ చేసిన టెక్నికల్ టీంకు థాంక్స్. నా డీఓపీ క్రాంతి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఎంతో సహనంతో సపోర్ట్ ఇచ్చారు. సురేష్ గారు అన్ని పాటలకు మంచి లిరిక్స్ ఇచ్చారు. మా ప్రొడక్షన్ డిజైనర్ సుప్రియ, నా రైటర్ ఇమ్రాన్, నిర్మాత వెంకట్ గార్లకు థాంక్స్. నేను నా వరకు వంద శాతం కష్టపడి పని చేశాను. పవన్ ఈ మూవీని చక్కగా కట్ చేశాడు. మా హీరో శివకి ఎంతో ఓర్పు ఉంది. రాజీవ్ గారు ఈ సినిమాకి సోల్. కసిరెడ్డి గారు మంచిగా నవ్విస్తారు. తేజ చక్కగా నటించారు. రేపు (ఫిబ్రవరి 20) రిలీజ్ కాబోతోన్న మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత వెంకట్ ఆర్ పపుడిప్పు మాట్లాడుతూ .. ‘‘నవాబ్ కేఫ్’ ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతోంది. మా సినిమాలో క్రింజ్ కామెడీ, సిల్లీ కామెడీ ఉండదు. ఇందులో ఓ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. మా చిత్రంలో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. మంచి మ్యూజిక్ ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్‌లో ఎమోషన్ కనిపిస్తుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. మా మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ .. ‘‘నవాబ్ కేఫ్’కి మ్యూజిక్ చేయడం ఆనందంగా ఉంది. మా పాటలు అందరూ వినండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి. నేను రాజ్ కందుకూరితో కలిసి ‘మెంటల్ మదిలో’కి పని చేశాను. శివ ఎప్పుడూ మంచి సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ ఉంటారు. తేజు ఈ మూవీతో తెలుగులోకి వస్తున్నారు. నిర్మాత గారు మా ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్ చేశారు. మంచి చిత్రాల్ని ఆడియెన్స్ ఎంకరేజ్ చేయాలి. ‘నవాబ్ కేఫ్’ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గొప్పగా చూపించారు’ అని అన్నారు.
లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి మాట్లాడుతూ .. ‘‘నవాబ్ కేఫ్’లో అన్ని పాటలు నేనే రాశాను. ఫాదర్ మీద వచ్చే సాంగ్ అద్భుతంగా ఉంటుంది. ప్రమోద్ గారు ఈ మూవీని ఎంతో కష్టపడి తీశారు. ఇలాంటి ఎమోషనల్ సినిమాకి ప్రశాంత్ గారు మంచి సంగీతాన్ని అందించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
తారాగణం: శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్ : హర్షిక ప్రొడక్షన్స్
రచయిత & దర్శకుడు: ప్రమోద్ హర్ష
నిర్మాత : రాధా వి పపుడిప్పు
సహ నిర్మాత: వెంకట్ ఆర్ పాపడిప్పు
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
DOP: క్రాంతి వర్ల
ప్రొడక్షన్ డిజైనర్: సుప్రియ బట్టెపాటి
ఎడిటర్: పవన్ నరవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శశి కె నారాయణ
పీఆర్వో : వంశీ కాకా
