Sree Vishnu Vishnu Vinyasam Teaser Offers Laughter-packed Experience

Summer Holidays gearing for Grand Release on May 1st, 2026
The successful producer Dheeraj Mogilineni, known for bringing content-rich films like Ambajipeta Marriage Band and The Girlfriend, recently scored blockbuster success with Couple Friendly, a delightful entertainer. Under the banner of Dheeraj Mogilineni Entertainments, the producer is ready to surprise everyone with his next film.
The film will be made on a theme centered around children. The film’s title and exciting details were revealed today. Titled “Summer Holidays,” it features Master Rohan Roy, known for the 90’s Middle Class Biopic series, Bhartha Mahasayulaku Wignyapthi, and several other blockbusters. The film also features child artist Arun, recognized for his brilliant performance in 35-Chinna Katha Kaadu.
Debutant director Srikar is helming this interesting entertainer. The music is composed by Sinjith Yerramilli, known for Little Hearts, and cinematography is handled by DOP Sai Prakash, known for his exceptional work in Tillu and Tillu Square. This entertainer, which evokes all the nostalgic emotions, is gearing up for grand release on May 1st.
Summer Holidays brings together a passionate team that promises to tell a beautiful story. Dheeraj Mogilineni, impressed with the content, is bankrolling the film.
మే 1న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ నెక్ట్స్ మూవీ సమ్మర్ హాలిడేస్
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన రీసెంట్ గా పంపిణీ చేసిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ఆదరణతో సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” పేరుతో కొత్త సినిమాను అందించేందుకు ధీరజ్ మొగిలినేని సిద్ధమవుతున్నారు.
చిల్డ్రన్ మూవీగా నిర్మించిన “సమ్మర్ హాలిడేస్” సినిమా టైటిల్ ను ఈ రోజు అనౌన్స్ చేశారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ కీలక పాత్రల్లో నటించారు. రోహన్ రాయ్ 90’s మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి హిట్ చిత్రాల్లో నటించి బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్టర్ అరుణ్ 35 చిన్న కథ కాదు సినిమాతో ఫేమ్ అయ్యారు. వీళ్లిద్దరికీ “సమ్మర్ హాలిడేస్” మూవీ మరింత పేరు తీసుకురానుంది. మే 1 “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోనుంది.
నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్
