
TV Video Song from Thimmarajupalli TV Unveiled
Encouraging new talent, hero Kiran Abbavaram is producing the film “Thimmarajupalli TV” under his banner KA Productions, in association with Sumaira Studios. Teja Velpucharla is serving as the co-producer. With this film, Sai Tej and Veda Jalandhar are being introduced as the lead actors, while V. Muniraju is making his debut as a director.
Set against a village backdrop, “Thimmarajupalli TV” is being made as a periodic drama and is gearing up for a grand theatrical release soon.
Today, the makers released the second single, “TV Video Song,” from the film. The song beautifully captures the excitement and curiosity of village life when television and dish connections first arrived in rural households. The arrival of a TV was not just a celebration for one family but for the entire village, as people gathered at the house that owned a television to watch serials and movies together. The song reflects this nostalgic celebration of community viewing culture.
The lyrics are written by Sanare, music is composed by Vamsikanth Rekhana, and the song is sung by Swaraj Keerthan. The track is engaging and nostalgic, bringing alive the joy and wonder television once created in village life.
Cast:
Sai Tej, Veda Jalandhar, Pradeep Kotte, Swathi Karimirreddy, Amma Ramesh, Satyanarayana, Lathish, and others.
Technical Team:
Costume Designer – Vishalya
Art Director – Sudheer Macharla
Business Head & Marketing – Chauhan
Creative Producer – Rithikesh Gorak
Executive Producer – KL Madan
DOP – Akshay Ram Podishetti
Music – Vamsikanth Rekhana
CEO – Rahasya Kiran
PRO – GSK Media (Suresh – Sreenivas)
Co-Producer – Teja Velpucharla
Producer – Kiran Abbavaram
Story, Editing & Direction – V. Muniraju
హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ సెకండ్ సింగిల్ ‘టీవీ వీడియో సాంగ్’ రిలీజ్
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘టీవీ వీడియో సాంగ్’ రిలీజ్ చేశారు. టీవీ, డిష్ వచ్చిన కొత్తలో పల్లెటూరి ప్రజలు ఎంత ఆసక్తిగా ఆ ప్రసారాలు చూశారో ఈ పాటలో చిత్రీకరించారు. టీవీ ఇంటికి వచ్చిన రోజు ఆ ఇంటివారికే కాదు ఆ ఊరిలో టీవీ లేని వారందరికీ పండుగ రోజే. ఊరిలో మొదట టీవీ కొనడం మామూలు గొప్పకాదు, టీవీ ఉన్న ఇంటికి వెళ్లి మిగతా వారంతా సీరియల్స్, సినిమాలు చూసేవారు. ఈ సందడిని పాటలో తెలియజేస్తూ సనరే సాహిత్యాన్ని అందించారు. వంశీకాంత్ రేఖన సంగీతాన్ని అందించగా, స్వరాజ్ కీర్తన్ పాడారు. ‘టీవీ వీడియో సాంగ్’ ఎలా ఉందో చూస్తే – ‘సూడు సూడు సిత్తరాలు, నట్టింట్లోకొచ్చె సినిమా హాలు, సూడు సూడు సీరియళ్లు, మరి చాలవంట రెండు కళ్లూ, ఎవడంటా మొట్టమొదట టీవీ తెచ్చింది, ఊరంతా మోతమోగాలా, తెరమీద చిందులకు మతిపోయిందంటూ, పడనోళ్ల గుండె పగిలి గుక్కె పట్టి ఏడ్చేయాల….’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.
నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
టెక్నికల్ టీమ్
————-
కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు
