
Heroine Samyuktha performs high-intensity action sequences for The Black Gold movie
The talented actress Samyuktha, known for her beauty and strong performances, has now shifted into full action mode. For her female-centric film The Black Gold, she is performing high-intensity action sequences without the use of a body double. Ignoring the injuries and bruises she has sustained during these stunts, Samyuktha continues shooting with complete dedication.
The action sequences she performs in the film are expected to be one of its major highlights, making The Black Gold a special and significant project in her career. Designed as a pan-Indian action drama, The Black Gold is directed by Yogesh KMC and produced by Rajesh Danda under the Hasya Movies banner in association with Maganti Pictures.
The film is gearing up for a summer release. Actors Murali Sharma, Rao Ramesh, Nasser, and Manish Wadhwa will be seen in key roles. The makers are planning to release the film in Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada languages.
‘ది బ్లాక్ గోల్డ్’ సినిమా కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్న హీరోయిన్ సంయుక్త
తన అందం, నటనతో ఆకట్టుకునే స్టార్ హీరోయిన్ సంయుక్త ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి మారిపోయింది. ఆమె తన ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్నారు. ఈ స్టంట్స్ లో అవుతున్న గాయాలను పట్టించుకోకుండా షూటింగ్ చేస్తున్నారు సంయుక్త. ఈ మూవీలో సంయుక్త చేస్తున్న యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలవనున్నాయి. సంయుక్త కెరీర్ లో ‘ది బ్లాక్ గోల్డ్’ ఒక స్పెషల్ మూవీగా నిలవనుంది.
పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా ‘ది బ్లాక్ గోల్డ్’ చిత్రాన్ని యోగేష్ కెఎంసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ‘ది బ్లాక్ గోల్డ్’ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
