
RK Deeksha Trailer Launched
Produced and directed by Dr. Prathani Ramakrishna Goud, RK Deeksha is coming under the banners RK Films and Sigdha Creations, presented by D.S. Reddy. The film features Kiran as the lead, with Aksa Khan and Alekhya Reddy playing the heroines. Tulasi, Anusha, Keerthana, Pravallika, and Rohit Sharma appear in key roles. Music is composed by Raju Kiran, and editing is by Meghana Srinu.
As the film inches closer to release, the trailer was officially launched by senior actor Suman in a special event attended by producer C. Kalyan, Telugu Film Chamber President Bharat Bhushan, and Film Producers Council Secretary Tammareddy Prasanna Kumar, along with several guests from the industry.
Director–Producer Dr. Prathani Ramakrishna Goud said:
“Greetings to everyone. My heartfelt thanks to all who attended our trailer launch. Actor Suman garu came straight from his shooting schedule to support us, which means a lot. Our team worked passionately for one year, completing five songs and three fight sequences.
We have dedicated a special song in this film to Murali Nayak, who sacrificed his life for the nation. My father served as a Zubedar Officer and participated in the 1961 China War, for which he was honored and gifted land by the then Prime Minister Jawaharlal Nehru. Inspired by him, we included a tribute to soldiers in our film.
I sincerely hope audiences bless our film with success.”
Hero Kiran said:
“Thank you to everyone who attended. RK Deeksha portrays how dedication and determination shape a person’s journey. A unique single-shot Sanskrit dialogue will stand out. Our entire team worked hard, and we hope the audience supports us wholeheartedly.”
Heroine Aksa Khan said:
“My respects to Suman garu, the guests, and the media. I feel proud to work alongside such a talented team. I truly wish this film becomes a turning point for everyone involved. Thank you to the media for your constant support.”
Actress Mounika Reddy said:
“My greetings to the media for supporting us. I watched the trailer and loved the songs and visuals. I wish the team grand success.”
General Secretary Snigdha Reddy said:
“Thank you to everyone who attended. The title RK Deeksha signifies determination, and that same determination reflects in the making of this film. The songs, especially those praising the bravery of soldiers and the Nandi song, are very impactful. Please bless our film.”
Vice Chairman Guru Raj said:
“Congratulations to Dr. Ramakrishna Goud garu for his commitment. The songs—particularly the tribute to soldiers—are very impressive. I wish hero Kiran a strong breakthrough and the film a great success.”
D.S. Reddy said:
“My heartfelt respects to all who attended. The song showcasing the life of Indian soldiers is truly commendable. As someone who served in the Air Force, the song touched me deeply. I wish the team all success.”
Film Producers Council Secretary Tummala Prasanna Kumar said:
“It is delightful to see a film titled after NTR garu’s Deeksha. His blessings will surely guide this film. The song on soldiers is outstanding—they protect our peace every day. I appreciate Suman garu, Bharat Bhushan garu, and Kalyan garu for supporting this event. I wish Ramakrishna Goud garu and the entire team a bright future.”
Film Chamber President Bharat Bhushan said:
“I wholeheartedly wish great success to Ramakrishna garu and the film RK Deeksha.”
Producer C. Kalyan said:
“Ramakrishna garu poured his dedication and struggles into RK Deeksha. I wish the film attains big success and brings recognition to everyone involved. Suman garu’s support is commendable. My best wishes to the entire team.”
Hero Suman said:
“My respects to everyone present. My association with Ramakrishna Goud garu goes back many years, and I’ve seen his hard work closely. The film carries a beautiful tribute to our brave soldiers.
Filmmakers have the power to spread meaningful messages, and I appreciate that this film honors the strength of Indian jawans. My best wishes to hero Kiran, heroine Aksa Khan, and all the artists and technicians. I hope audiences bless RK Deeksha with grand success.”
Cast:
Kiran, Aksa Khan, Alekhya Reddy, Tulasi, Anusha, Keerthana, Pravallika, Rohit Sharma & others.
Technical Crew:
Director–Producer: Dr. Prathani Ramakrishna Goud
Presenter: D.S. Reddy
Banners: RK Films, Sigdha Creations
Music: Raju Kiran
Editor: Meghana Srinu
Fights: Ravi
Choreography: Anand
PRO: Madhu VR
డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా RK దీక్ష చిత్ర ట్రైలర్ లాంచ్
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RK దీక్ష. తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్ గా పనిచేశారు. విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా హీరో సుమన్ గారి చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సి కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
చిత్ర దర్శక నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈరోజు మా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ట్రైలర్ లాంచ్ చేయాలి అని పిలిచిన వెంటనే హీరో సుమన్ గారు షూటింగ్ నుండి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అతిథికి, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా సుమారు ఒక సంవత్సరంలో పూర్తి చేశాము. 5 పాటలు, 3 ఫైట్స్ తో, మరి కొంత మంది ఆర్టిస్టులతో సినిమా చాలా బాగా వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కు ఒక పాట ఈ సినిమా ద్వారా అంకితం చేశాము. మా నాన్న గారు జూబేధార్ ఆఫీసర్ గా ఉండగా 1961లో చైనా వార్ లో పాల్గొన్న కారణంగా నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు మా నాన్న గారిని సన్మానించి స్థలం బహుకరించడం జరిగింది. వారి ప్రేరణతోనే జవాన్ లకు మనం ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి అని ఈ పాటను సినిమాలో చేయడం జరిగింది. ప్రేక్షకులు అంతా కలిసి మా సినిమాను ఆశీర్వదించి గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక వ్యక్తి దీక్షతో, పట్టుదలతో ఎలా ఎదుగుతారో చూడబోతున్నాం. ఈ సినిమాలో సింగిల్ షాట్ లో సంస్కృత డైలాగ్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. సినిమా కోసం అంతా చాల కష్టపడి పని చేశాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ అక్స ఖాన్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన సుమన్ గారికి, అతిధులకు, మీడియా వారికి నా నమస్కారం. ఈ సినిమా కోసం నాతో పాటు ఎంతోమంది టాలెంట్ ఉన్న వారు పని చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ మంచి మలుపు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీరందరి మధ్య ఇలా ఉండడం నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మరొకసారి మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
నటి మౌనిక రెడ్డి మాట్లాడుతూ… “మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి నా నమస్కారం. ఈ చిత్ర ట్రైలర్ చూశాను. పాటలు ఇంకా విజువల్స్ చాలా బాగా నచ్చాయి. ఈ చిత్రం బంధానికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
జనరల్ సెక్రటరీ స్నిగ్ధ రెడ్డి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం పేరు RK దీక్ష అంటే అర్థం ఒక పట్టుదలతో ముందుకు వెళ్లడం. ఈ చిత్రం కూడా అలాగే ఎంతో పట్టుదలతో చేశారు. సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. నంది అవార్డు, జవాన్ ల గొప్పదనాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలో పాటలు ఎంతో ఆకర్షిస్తాయి. అందరూ ఈ సినిమాను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.
వైస్ చైర్మన్ గురు రాజ్ మాట్లాడుతూ… “చిత్ర దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎన్నో దీక్షలు చేసి ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఈ సినిమాలోని పాటలు చూశాను. జవాన్లకు సంబంధించిన పాట నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. నంది పాట బాగా ఆకర్షిస్తుంది. హీరో కిరణ్ కు మంచి బ్రేక్ రావాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
డి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రామకృష్ణ గౌడ్ గారు ఈ సినిమాలోని ఒక పాటలో దేశ జవాన్లను చూపించడం హర్షించదగిన విషయం. నేను కూడా గతంలో దేశం కోసం ఎయిర్ ఫోర్సులో పనిచేశాను. కాబట్టి నాకు ఆ పాట బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ నిర్మాత మండల సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ… “ఎన్టీ రామారావు గారి దీక్ష సినిమా పేరు మీద మనకు సినిమా రావడం హర్షించదగిన విషయం. రామారావు గారి ఆశీస్సులు సినిమాకు కచ్చితంగా ఉంటాయి. ఈ సినిమాలో జవాన్లకు సంబంధించి ఒక పాట అద్భుతంగా వచ్చింది. వారి వలనే మనం దేశంలో ప్రశాంతంగా ఉంటున్నాము. హీరో సుమన్ గారు ఈ సినిమా కోసం వచ్చి సపోర్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నో సినిమాలకు అండగా నిలబడి ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే భరత భూషణ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఒక సామాన్య స్థాయి నుండి ఇంత పెద్ద పెరిగిన కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ చిత్రం సంస్థ ఎప్పటికీ ఫిలిం ఛాంబర్ తో అనుకూలంగా ఉంటుంది అంటుంటారు. అందరూ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ… “అందరికీ బంధువైన రామకృష్ణ గారి ఈ చిత్రం మంచి విజయం సాధించవలసిందిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఎన్నో దీక్షలు చేసి ఇంత కష్టపడి తీసిన ఈ RK దీక్ష చిత్రం మంచి విజయం సాధించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలి. నటినటులకు మంచి ప్రశంసలు అందుకోవాలి. సుమన్ గారు ఈ సినిమాకి సపోర్ట్ చేయడం సంతోషాన్ని ఇస్తుంది. చిత్ర బంధం అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ ఆఫ్ తెలుపుకుంటున్నాను” అన్నారు.
హీరో సుమన్ గారు మాట్లాడుతూ… “ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం తెలుపుకుంటున్నాను. రామకృష్ణ గౌడ్ గారు నాకు ఎన్నో సంవత్సరాలు నుండి పరిచయం ఉన్నారు. మా అనుబంధం సంవత్సరాల నాటిది. ఎంతో కష్టపడి ఈ సినిమాను రామకృష్ణ గారు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ గారు రామారావు గారి గొప్పదనం చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అంతటి గొప్ప రామారావు గారి ఆశీర్వాదాలు ఈ సినిమాకి ఉంటాయని ఆయన అన్నారు. దేశం కోసం దేనికైనా సిద్ధమైన జవాన్లను తలుచుకుంటూ ఈ సినిమాలో దేశ సైనికుడు గురించి ఒక పాట పెట్టారు. మనం ఇంత సేఫ్ గా ఉన్నామంటే దానికి కారణం దేశ జవాన్లు. నిర్మాతలు అందరూ తమ సినిమాలలో జవాన్లకు సంబంధించి బాధ్యతగా తీసుకొని ప్రతి సినిమాలో వారిని సపోర్ట్ చేస్తూ చూపించవలసిందిగా కోరుకుంటున్నాను. సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు. ఈ సినిమాలో జవాన్ల గురించి అలాగే చెప్పారు. ఈ సినిమాను సమర్పించిన డిఎస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. హీరో కిరణ్, హీరోయిన్ అక్స ఖాన్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు. అలాగే ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక మీద ఉన్న ప్రతి వ్యక్తి సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సినిమాకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన వీరు ముందు ఉండి ఆ సమస్యను తీర్చి ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.
నటీనటులు : కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.
సాంకేతిక బృందం :
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డిఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజు కిరణ్
ఎడిటర్ : మేఘన శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : మధు విఆర్
