Mass Jathara Trailer – Packs with high-voltage action and punchy dialogues

కృష్ణ లీల మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను – నిర్మాత సురేష్ బాబు
యంగ్ ట్యాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ ‘కృష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్ కి కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాజీ సిబిఐ జే.డి. లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయమని చెబుతుంటాను. అలాంటి పాషన్ తో వర్క్ చేస్తున్న దేవన్ ని చూసిన తర్వాత ఎలాగైనా ఈ అబ్బాయిని సపోర్ట్ చేయాలనిపించింది. రామానాయుడు గారు తెలుగు సినిమాకి చేసిన సేవలు అమోఘం ఆయన మూవీ మొఘల్. చదువుకున్న రోజుల నుంచి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. సురేష్ బాబు గారు ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రైటర్ కిరణ్ కుమార్ గారు మాకు మంచి ఫ్రెండ్. ఆయన ఆలోచనలు చాలా బాగుంటాయి. ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అనిల్ గారు చాలా అద్భుతంగా ఈ స్టోరీ ని రాశారు. చాలా పాజిటివ్ గా ఉంది. నిర్మాత జోష్ణ గారికి బెస్ట్ విషెస్. దేవన్ హీరో గా డైరెక్టర్ గా వస్తున్నారు, చాలా పాషన్ తో తీశారు. తప్పకుండా సినిమాకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఈవెంట్ కి వచ్చి జెడి గారికి థాంక్యూ. సినిమాకి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
హీరో దేవన్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సురేష్ బాబు గారికి లక్ష్మినారాయణ గారికి కృతజ్ఞతలు. సురేష్ బాబు గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఇండస్ట్రీలో చాలామంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. హానెస్ట్ గా సినిమా తీస్తే అందరూ సపోర్ట్ చేస్తారని మా కృష్ణ లీల సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. కృష్ణ లీల ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రేమంటే ఒక త్యాగం ప్రేమంటే ఒక యుద్ధం. మనం ప్రేమించిన వారి కోసం మనం ఎంత దూరం వెళ్తాం ఏ స్థాయి వరకు వెళ్తామనేది అసలైన ప్రేమ. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా యుద్ధాలు అయినా చేస్తూనే ఉండాలి చివరిగా ప్రేమను గెలిపించడమే నిజమైన ప్రేమ. ఆ ప్రేమని కృష్ణ లీలలో చాలా వండర్ఫుల్ గా థ్రిల్లింగ్ గా చూపించాం. ఈ సినిమాకి రండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యు.
హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. సురేష్ బాబు గారికి, జెడి లక్ష్మినారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా సిన్సియర్ గా తీసిన సినిమా ఇది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు. దేవన్ చాలా హార్డ్ వర్క్ తో ఈ ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
నిర్మాత జోష్నా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది టీం వర్క్. మా నటీనటులు టెక్నికల్ టీం చాలా అద్భుతంగా వర్క్ చేశారు. దేవన్ గారు చాలా అద్భుతంగా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ధన్య చాలా చక్కగా నటించారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది.
రైటర్ అనిల్ కిరణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రేమనేది ఒక త్యాగం. ఒకరపట్ల మంచి భావం. ఇలాంటి గొప్ప లక్షణాల్లో ఎవరు కలిగి ఉంటారో వాళ్ళే ఈ ప్రేమ అనే ఫీలింగ్ ని మరొకరికి ఇవ్వగలరు. ఇందులో ప్రేమ కథ రెగ్యులర్ ఫార్మేట్ లో కాకుండా చాలా కొత్తగా ఉంటుంది .కచ్చితంగా ఈ జనరేషన్ పై ఈ ప్రేమ కథ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దేవన్ అద్భుతంగా నటించారు .చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
నటీనటులు: దేవన్, ధన్య బాలకృష్ణన్, వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే, తులసి, 7ఆర్ట్ సరయు, ఆనంద్ భరత్
సిబ్బంది:
దర్శకత్వం – దేవన్
నిర్మాత – జ్యోత్స్న జి
బ్యానర్: మహాసేన్ విజువల్స్
కథ & సంభాషణలు- అనిల్ కిరణ్ కుమార్ జి
డీవోపీ – సతీష్ ముత్యాల
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్ – KSR
కొరియోగ్రఫీ -రఘు మాస్టర్
ఫైట్స్ – నందు మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్ – రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్
