
I wish Blockbuster success to Napoleon Returns Team -Vassishta
At a grand event held on Sunday, the title and glimpses of the fourth production venture from Acharya Creations, directed by Anand Ravi and produced by Bhogendra Gupta, were officially unveiled. Starring Anand Ravi and Divi in the lead roles, the film has been titled Napoleon Returns. The launch event was attended by directors Vassishta, Sai Rajesh, and Anil Vishwanath and Vamsi Nandipati as special guests.
Vassishta said, “I came here especially for Ravi anna. He made Napoleon with the concept of ‘shadow’ disappearance, and now I realize that even a story can be written with the animal ghost. I know the story of this movie – it’s going to be wonderful. I wish Napoleon Returns great success.”
Sai Rajesh said, “I’m here for Anand Ravi. Vasshishta, Anand Ravi, and I are good friends. The title Napoleon Returns is fantastic. I hope this movie brings Anand Ravi a big success. All the best to the entire team.”
Anil Vishwanath said, “I worked on Anand Ravi’s first film. He’s like a mentor to me. I really like his writing style – his hook points are always very strong. I also know this film’s story; it’s very engaging. The Polimera concept came to life because of Gupta garu. My best wishes to everyone.”
Producer Bhogendra Gupta said, “Many thanks to Sai Rajesh, Vassishta, and Anil for being here. Anand worked very hard on this story, spending almost a year and a half just on pre-production. We’re coming forward with a strong and unique subject.”
Hero and director Anand Ravi said, “I thank Vassishta, Sai Rajesh, and Anil for joining us. Throughout this journey, Gupta garu has supported me immensely. I’ve directed Parents, Pratinidhi, Napoleon, and Korameenu. People know me, but I haven’t yet received the success and recognition I’ve been looking for. I’m confident Napoleon Returns will bring me both. The film is an out-and-out entertainer. The story revolves around a unique concept – a nine-month-old baby’s soul. No one has explored such a theme before. I’ll share more details about the film soon.”
Actress Divi said, “I met Anand Ravi after Napoleon. I’m thankful to him for giving me such a good role. I loved the story when he narrated it to me. Everyone will soon come to know more about this movie.”
Cast: Anand Ravi, Divi, Auto Ram Prasad, Raghu Babu, Surya Ping Pong, Shravan Raghavendra, Anchor Ravi, Ravi Varma, Narasimha, Bezawada Bobby Akka, Meesala Lakshman, Ramana Bhargav, Kedar Shankar, and others.
Technical Crew:
Writer & Director: Anand Ravi
Producer: Bhogendra Gupta
Co-Producer: Jai Goswami
Production Designers: R&M Design
Music: Siddharth Sadasivuni
Editor: Vijay Vardhan Kavuri
Line Producer: Polaki Suresh
Stylist: Mudassar Mohammad
Publicity Designer: Sudhir
PROs: Naidu Surendra Kumar & Phani Kandukuri (Beyond Media)
తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకు ఎక్కడా సినిమా రాలేదు : హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు లాంఛ్ చేశారు. ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌కు వశిష్ట, సాయి రాజేష్, వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత్ వంటి వారు గెస్టులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
వశిష్ట మాట్లాడుతూ .. ‘నేను రవన్న కోసమే వచ్చాను. నీడ పోయిందని ‘నెపోలియన్’ తీశాడు. జంతువుల ఆత్మతోనూ కథను రాసుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ మూవీ కథ నాకు తెలుసు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ‘నెపోలియన్ రిటర్న్స్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘నేను ఇక్కడకు ఆనంద్ రవి కోసం వచ్చాను. నేను, వశిష్ట, ఆనంద్ రవి మంచి స్నేహితులం. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ చాలా బాగుంది. ఈ మూవీతో ఆనంద్ రవికి పెద్ద విజయం దక్కాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
అనిల్ విశ్వంత్ మాట్లాడుతూ .. ‘ఆనంద్ రవి గారి మొదటి సినిమాకి నేను పని చేశాను. ఆయన నాకు గురువు వంటి వారు. ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన తీసుకునే హుక్ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ మూవీ కథ కూడా నాకు తెలుసు. స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. గుప్తా గారి వల్లే ‘పొలిమేర’ కాన్సెప్ట్ పుట్టింది. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన సాయి రాజేష్, వశిష్ట, అనిల్ గార్లకు థాంక్స్. ఆనంద్ గారు ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఏడాదిన్నర పాటుగా ప్రీ ప్రొడక్షన్ కోసమే పని చేశారు. మంచి సబ్జెక్ట్‌తో అందరి ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.
హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన వశిష్ట, సాయి రాజేష్, అనిల్ గార్లకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు గుప్తా గారెంతో సహకరించారు. ‘పేరెంట్స్’, ‘ప్రతినిధి’, ‘నెపోలియన్’, ‘కొరమీను’ చిత్రాలు తీశాను. నేను అందరికీ తెలుసు. కానీ సరైన సక్సెస్, గుర్తింపు రాలేదు. కానీ ‘నెపోలియన్ రిటర్న్స్’తో నాకు సక్సెస్, మంచి గుర్తింపు వస్తుంది. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకు ఎక్కడా సినిమా రాలేదు. మున్ముందు ఈ మూవీ గురించి మరింతగా తెలియజేస్తాను’ అని అన్నారు.
దివి మాట్లాడుతూ ..‘‘నెపోలియన్’ తరువాత ఆనంద్ రవి గారిని కలిశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఆనంద్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ మూవీ గురించి మున్ముందు అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.
తారాగణం : ఆనంద్ రవి, దివి, ఆటో రామ్ ప్రసాద్, రఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్రవణ్ రాఘవేంద్ర, యాంకర్ రవి, రవివర్మ, నరసింహ, బెజయవాడ బాబీ అక్క, మీసాల లక్ష్మణ్, రమణ భార్గవ్, కేదార్ శంకర్ తదితరులు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: ఆనంద్ రవి
నిర్మాత: భోగేంద్ర గుప్తా
సహ నిర్మాత: జై గోస్వామి
ప్రొడక్షన్ డిజైనర్: R&M డిజైన్
సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి
లైన్ ప్రొడ్యూసర్: పోలాకి సురేష్
స్టైలిస్ట్: ముదస్సర్ మొహమ్మద్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
PRO : నాయుడు – ఫణి (బియాండ్ మీడియా)
