
We made an honest, clean film without any vulgarity – Hero Rakshit Atluri
‘Sasivadane’ is a romantic drama starring Rakshit Atluri and Komalee Prasad in the lead roles. Presented by Gauri Naidu, the film is produced by Ahiteja Bellamkonda and Abhilash Reddy Godala under AG Film Company and SVS Studios banners. Directed by Sai Mohan Ubbana, the film is scheduled for release on October 10. Ahead of its release, the makers held a press meet on Friday.
Speaking at the event, hero Rakshit Atluri said, “Three years ago, Teja garu narrated this story to me. Initially, I didn’t quite understand the story when Sai narrated it – I couldn’t grasp what he was trying to say. But I liked the individual scenes. I also watched his short films. The emotional scenes between the father and son, as he wrote them, are unlike anything we’ve seen in Telugu cinema so far. Sriman garu’s role will stay in everyone’s memory. The film has come out very well. Sai Kumar’s visuals showcasing the Godavari region are stunning, and everyone will talk about them. Gauri’s costumes, Sharva’s music, Anudeep’s background score, everything came together beautifully. Komalee is a fantastic actress. I hope Teja garu and Abhilash garu get a big success, and Sai earns a good name as a director. Cinematographer Sai garu is already receiving praise. We made a sincere, clean film with no vulgarity. When people walk out of the theatre, they’ll leave with joy. I can confidently say the film won’t disappoint anyone. ‘Sasivadane’ is releasing on October 10. Please watch and support it.”
Director Sai Mohan Ubbana shared, “My father’s dream was to see me in the film industry. I thank Teja garu and Gauri garu for trusting and giving me this opportunity. After about ten days of shooting, Rakshit garu started believing in me strongly. ‘Sasivadane’ is now being brought before the media. Sai Kumar gave me brilliant visuals – he turned the story I wrote into a beautiful painting. Sharvanan and Anudeep gave us excellent music and background score. Komalee performed beyond what I imagined while writing the character. Sriman garu accepted the role immediately after hearing the story. His single-shot scene will be talked about a lot. Gary’s editing will be appreciated by all. Our film is releasing on October 10. We hope everyone watches and supports it.”
Producer Ahiteja Bellamkonda said, “For ‘Sasivadane’, we worked hard with the goal of giving the audience a meaningful experience. The media has supported us right from the beginning. This film will not disappoint anyone. Due to my inexperience, there was a delay in the release. However, we all have strong faith in the content. Even before the film was completed, all rights were sold. I thank all the distributors who trusted me. Our trailer received a great response. As far as I know, Telugu cinema hasn’t seen a climax like the one in ‘Sasivadane’. I am grateful to SKN garu, our Ceded distributor Anish, director Yogi anna, the media, and our PR team for their support.”
Heroine Komalee Prasad said, “‘Sasivadane’ is a very special film for me. The character I played is quite unique. Many in our team are newcomers, but everyone worked with great dedication. Our film is releasing on October 10, and I’m sure it will pleasantly surprise everyone in the theatre.”
Cinematographer Shree Sai Kumar Dara added, “My film ‘Beauty’ was released last month, but technically, this is my first film. We all worked on ‘Sasivadane’ like it was a war. Ahiteja garu placed great trust in me. Rakshit garu supported all of us immensely – even when he was injured, he continued shooting, which was commendable. Komalee performed brilliantly. Gauri’s costumes and the color palette are being appreciated by many. Sai Mohan worked extremely hard for this movie. It’s only after people saw the visuals of ‘Sasivadane’ that I started getting more opportunities.”
Executive Producer Sripal said, “The team of ‘Sasivadane’ worked incredibly hard to make this film. Gauri garu and Ahiteja garu produced it with great passion. The trailer has reached many people. I hope the film brings recognition to the director, Rakshit, Komalee, and the whole team.”
Actress Ambika said, “We all put in a lot of effort for ‘Sasivadane’. We hope to see the results of that hard work on October 10. I sincerely wish the audience supports us.”
Cast:
Rakshit Atluri, Komalee Prasad, Sriman, Deepak Prince, Jabardasth Bobby, and others.
Technical Crew:
Banners: AG Film Company, SVS Studios
Presented by: Gauri Naidu
Producers: Ahiteja Bellamkonda, Abhilash Reddy Godala
Director: Sai Mohan Ubbana
Music Director: Sharavan Vasudevan
Background Score: Anudeep Dev
Cinematographer: Shree Sai Kumar Dara
Editor: Garry BH
Costume Designer: Gauri Naidu
PROs: Naidu Surendra Kumar, Phani Kandukuri (Beyond Media)
Marketing: Vishnu Thej Putta (Cross Clicks Marketing)
శశివదనే ఏ ఒక్కరిని కూడా నిరాశ పర్చదు – అహితేజ బెల్లంకొండ
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్లో
హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ .. ‘నాకు మూడేళ్ల క్రితం తేజ గారు ఈ కథ గురించి చెప్పారు. సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఇందులో ఆయన రాసుకున్నట్టుగా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదు. శ్రీమాన్ గారు చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గోదావరి జిల్లాల్ని అద్భుతంగా చూపించిన సాయి కుమార్ పనితనం గురించి అందరూ చెప్పుకుంటారు. గౌరీ గారి క్యాస్టూమ్స్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. కోమలి గారు అద్భుతమైన నటి. తేజ గారికి, అభిలాష్ గారికి మంచి సక్సెస్ రావాలి. సాయికి డైరెక్టర్‌గా మంచి పేరు రావాలి. కెమెరామెన్ సాయి గారికి ఆల్రెడీ ప్రశంసలు వస్తున్నాయి. అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆనందంతో బయటకు వస్తారు. ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు అని మాత్రం చెప్పగలను. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ సాయి మోహన్ మాట్లాడుతూ .. ‘నేను ఇండస్ట్రీలోకి రావాలన్నది మా నాన్న కల, కోరిక. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజ గారికి, గౌరీ గారికి థాంక్స్. రక్షిత్ గారు ఓ పది రోజుల షూటింగ్ తరువాత నన్ను చాలా గట్టిగా నమ్మారు. ‘శశివదనే’ సినిమాను మీడియా ముందుకు తీసుకు వెళ్తోంది. సాయి కుమార్ నాకు మంచి విజువల్స్ ఇచ్చారు. నేను రాసుకున్న కథను అందమైన పెయింటింగ్‌లా మార్చాడు. శర్వా, అనుదీప్ నాకు మంచి మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. నేను ఎంత అందంగా రాసుకున్నానో.. అంతకు మించి అనేలా కోమలి గారు నటించారు. కథ చెప్పిన వెంటనే శ్రీమాన్ గారు ఓకే చేశారు. ఆయన చేసిన సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ చెప్పుకుంటారు. గ్యారీ గారి ఎడిటింగ్ అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత అహితేజ మాట్లాడుతూ .. ‘‘శశి వదనే’ కోసం మేం ఎంత కష్టపడ్డా కూడా ఆడియెన్స్‌కి మంచి అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మాకు ముందు నుంచీ కూడా మీడియా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీ ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చదు. నాకు అంతగా అనుభవం లేకపోవడంతోనే రిలీజ్లో జాప్యం కలిగింది. కంటెంట్ మీద మా అందరికీ నమ్మకం ఉంది. సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయి. నన్ను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లందరికీ ధన్యవాదాలు. మా మూవీ ట్రైలర్ అందరికీ నచ్చింది. ‘శశివదనే’ లాంటి క్లైమాక్స్‌ను నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇంత వరకు చూడలేదు. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఎస్కేఎన్ గారికి, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అనీష్, డైరెక్టర్ యోగి అన్నకి, అండగా ఉన్న మీడియాకి, మా పీఆర్ టీంకి థాంక్స్’ అని అన్నారు.
హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘శశివదనే’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను ఇందులో పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ టీంలోని చాలా మంది కొత్త వారే. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్లో అందరినీ మా సినిమా కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.
కెమెరామెన్ సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘గత నెలలో నా ‘బ్యూటీ’ చిత్రం వచ్చింది. కానీ నాకు టెక్నికల్‌గా ఇదే మొదటి చిత్రం. ఈ మూవీలో రాసినట్టుగా ఈ చిత్రం కోసం మేమంతా ఓ యుద్ధం చేశాం. నన్ను మా అహితేజ గారు చాలా నమ్మారు. రక్షిత్ గారు మా అందరికీ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. రక్షిత్‌కి గాయాలైనా కూడా షూటింగ్ కంటిన్యూ చేయడం గ్రేట్. కోమలి గారు అద్భుతంగా నటించారు. గౌరీ గారి క్యాస్టూమ్స్, కలర్ ప్యాలెట్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. సాయి మోహన్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ‘శశి వదనే’ విజువల్స్ చూసిన తరువాతే నాకు అందరూ అవకాశాన్ని ఇచ్చారు’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ మాట్లాడుతూ .. ‘‘శశివదనే’ టీం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించింది. గౌరీ గారు, అహితేజ గారు ఎంతో ప్యాషనేట్‌గా ఈ మూవీని నిర్మించారు. ట్రైలర్ అందరికీ రీచ్ అయింది. దర్శకుడు, రక్షిత్, కోమలి, టీం ఇలా అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి’ అని అన్నారు.
నటి అంబికా మాట్లాడుతూ .. ‘‘శశి వదనే’ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అక్టోబర్ 10న వస్తుందని ఆశిస్తున్నాను. మా అందరికీ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ లభించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు :
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్, సమర్పణ :గౌరీ నాయుడు, నిర్మాతలు :అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల, దర్శకుడు :సాయి మోహన్ ఉబ్బన, సంగీత దర్శకుడు : శరవణ వాసుదేవన్, నేపథ్య సంగీతం :అనుదీప్ దేవ్, కెమెరామెన్ :శ్రీ సాయి కుమార్ దారా, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్ :గౌరీ నాయుడు, పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), మార్కెటింగ్ : విష్ణు తేజ పుట్టా (క్రాస్ క్లిక్ మార్కెటింగ్)