
Anukundhokati Le Ayyindhokati Le Lyrical video Released from Santhana prapthirasthu
Star comedian Vennela Kishore has turned singer for the youthful family entertainer Santhana prapthirasthu. He has lent his voice to the song Anukundhokati Le Ayyindhokati Le,marking a unique moment in the film. In this movie, Vennela Kishore plays the role of Dr. Bhramaram, who runs the Garbhagudi Wellness Center, delivering laughter and fun through his character. The song appears in a scene where Dr. Bhramaram encourages the protagonist who visits him for treatment, making it a humorous and memorable moment.
The song carries a playful and entertaining tone with interesting lines. The music is composed by Sunil Kashyap with lyrics penned by Balavardhan. Vennela Kishore impresses with his singing, delivering the song with the confidence of a professional playback singer.
The film Santhana prapthirasthu stars Vikranth and Chandini Chowdary in the lead roles and is being produced under the banners of Madhura Entertainment and Nirvi Art Creations by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy. Directed by Sanjeev Reddy, the film’s screenplay is written by Shaik Dawood G. The movie is gearing up for a grand theatrical release soon.
Cast
Vikranth, Chandini Chowdary, Vennela Kishore, Tharun Bhascker, Abhinav Gomatam, Muralidhar Goud, Harshavardhan, Bindu Chandramouli, Jeevan Kumar, Satya Krishna, Abhay Bethiganti, Kireeti, Anil Geela, Saddam, and others.
Technical Crew
Director: Sanjeev Reddy
Producers: Madhura Sreedhar Reddy, Nirvi Hariprasad Reddy
Story & Screenplay: Sanjeev Reddy, Shaik Dawood G
Music Director: Sunil Kashyap
Background Score: Ajay Arasada
Executive Producer: A. Madhusudhan Reddy
Cinematography: Mahi Reddy Pandugula
Dialogues: Kalyan Raghav
Choreographer: Lakshman Kalahasti
Costume Designers: Ashwath Bhairi, K. Pratibha Reddy
Production Designer: Shivakumar Macha
Digital Partner: Housefull Digital
Marketing & Promotions Consultant: Vishnu Komalla
Lyrical Composition: Right Click Studio
PRO: GSK Media (Suresh – Sreenivas)
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” మూవీ నుంచి స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ పాడిన ‘అనుకుందొకటిలే..’ లిరికల్ సాంగ్ రిలీజ్
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” మూవీతో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఈ చిత్రంలో ఆయన ‘అనుకుందొకటిలే..’ పాటను పాడటం విశేషం. “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా ‘అనుకుందొకటిలే..’ పాటను ఆకట్టుకునేలా రూపొందించారు.
‘అనుకుందొకటిలే..’ పాట ఎలా ఉందో చూస్తే – అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే, భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేయగా, బాలవర్థన్ లిరిక్స్ అందించారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నారు.
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు
టెక్నికల్ టీమ్
డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – అజయ్ అరసాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ – రైట్ క్లిక్ స్టూడియో
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)