
Actress Kasthuri Appreciates Baby Movie team for Winning 2 National Awards
రెండు జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను అభినందించిన నటి కస్తూరి
71వ జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న “బేబి” సినిమా టీమ్ ను అభినందించింది నటి కస్తూరి. ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేశ్, ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ ఎస్ రోహిత్ నేషనల్ అవార్డ్స్ స్వీకరించారు. ఈ సందర్భంగా బేబి టీమ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది నటి కస్తూరి. ఆమె స్పందిస్తూ – బేబి సినిమా ఒక గేమ్ ఛేంజర్. నేను నా టీనేజ్ అబ్బాయి, అమ్మాయితో కలిసి ఈ సినిమా చూశాను. అప్పటి నుంచి కొన్ని వారాలపాటు మా మధ్య బేబి సినిమా గురించి చర్చ జరిగింది. అని ట్వీట్ చేసింది.