
Team David Reddy Congratulates Rocking Star Manchu Manoj for his Success with Mirai
The recent Tollywood blockbuster “Mirai” is achieving record-breaking collections at the box office. Starring Manchu Manoj, Teja Sajja and directed by Karthik Ghattamneni under the banner of People Media Factory, the film has now officially entered the ₹100 crore club.
One of the major highlights of the film is the character “Black Sword,” played by Rocking Star Manchu Manoj. Following the grand success of “Mirai,” the team of Manoj’s upcoming film “David Reddy” extended their congratulations to him. They released a special poster celebrating Manchu Manoj’s entry into the ₹100 crore club with “Mirai.”
Directed by Hanuma Reddy Yakkanti and produced under the Velvet Soul Motion Pictures and True Radix banners, “David Reddy” is being made as a high-budget pan-India film. Set against the backdrop of British-era India, it promises to be an intense action drama.
రూ.వంద కోట్ల గ్రాసర్ గా “మిరాయ్” రికార్డ్ – రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కు కంగ్రాట్స్ చెప్పిన “డేవిడ్ రెడ్డి” టీమ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ “మిరాయ్” చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఆయన చేసిన బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. “మిరాయ్” పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. తాజాగా ఈ మూవీ వంద కోట్ల రూపాయల గ్రాసర్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. “మిరాయ్” ఘన విజయం నేపథ్యంలో మంచు మనోజ్ కు శుభాకాంక్షలు చెప్పింది ఆయన నెక్ట్స్ మూవీ “డేవిడ్ రెడ్డి” టీమ్.
మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ గా నటించిన “మిరాయ్” సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరినందుకు కంగ్రాట్స్ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు “డేవిడ్ రెడ్డి” టీమ్. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా “డేవిడ్ రెడ్డి” సినిమా తెరకెక్కనుంది.