K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Actor Vijay Deverakonda stands as a pillar of support and confidence for the Little Hearts team
Vijay Deverakonda has always been at the forefront when it comes to encouraging young talent entering the industry with passion for cinema. Having risen to stardom from small films himself, Vijay understands the struggles that new teams go through. He knows how even a small gesture of support from a star can greatly boost their confidence.
That’s why he attended the success event of the recent small-budget blockbuster Little Hearts as the chief guest and congratulated the team. Speaking at the event, Vijay said that the success of one small film can inspire countless young and new talents. He emphasized that the success of newcomers ignites a fire in those who are trying to enter the industry without any background. His speech at the Little Hearts event was truly inspiring and well-received by everyone.
Vijay Deverakonda said, “The Little Hearts team includes many outsiders who achieved success without any backing. They will become an inspiration for many newcomers. When one person succeeds, it positively impacts many others. It sparks a belief in young talent that they too can succeed. That’s why I felt like supporting them. My congratulations to this young team. Usually, when I meet a film team, I talk for just a few minutes. But with the Little Hearts team, I spent three hours in conversation. For me, my parents come first, and cinema comes next. Mouli, stay the way you are. There’s no need to follow everyone’s advice. Just make sure your parents are happy. Learn to balance your life and career.”
“లిటిల్ హార్ట్స్” టీమ్ కు సపోర్ట్ గా నిలిచి కాన్ఫిడెన్స్ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ
సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో విజయ్ దేవరకొండ. చిన్న సినిమాల నుంచే స్టార్ గా ఎదిగిన విజయ్ కు కొత్త టీమ్ పడే కష్టాలు తెలుసు. స్టార్స్ ఇచ్చే చిన్న సపోర్ట్ వారిలో ఎంత కాన్ఫిడెంట్ పెంచుతుందో తెలుసు. అందుకే చిన్న చిత్రాల రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై వారికి కంగ్రాట్స్ చెప్పారు విజయ్. ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే ఇంకెంతోమంది యంగ్ అండ్ న్యూ టాలెంట్ ను ఇన్స్ పైర్ చేస్తుందని విజయ్ ఈ ఈవెంట్ లో చెప్పారు. కొత్తవారి సక్సెస్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నించేవారిలో ఫైర్ నింపుతుందని ఆయన అన్నారు. లిటిల్ హార్ట్స్ ఈవెంట్ లో విజయ్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – లిటిల్ హార్ట్స్ టీమ్ లో చాలా మంది ఔట్ సైడర్స్. ఏ సపోర్ట్ లేకుండా సక్సెస్ అందుకున్నారు. వీళ్లు మరెంతో మంది కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఒకరు సక్సెస్ అయితే అది ఎంతోమందికి మంచి చేస్తుంది. మనమూ సక్సెస్ అందుకోవచ్చనే ఒక ఫైర్ న్యూ టాలెంట్ లో కలుగుతుంది. అందుకే వీళ్లకు సపోర్ట్ చేయాలని అనిపించింది. ఈ యంగ్ టీమ్ కు నా కంగ్రాట్స్ చెబుతున్నా. నేను ఏ మూవీ టీమ్ ను కలిసినా కాసేపే మాట్లాడతాను. కానీ లిటిల్ హార్ట్స్ టీమ్ తో మూడు గంటలు మాట్లాడాను. నాకు మా పేరెంట్స్ ఫస్ట్, సినిమా నెక్ట్స్. మౌళి నీలాగే నువ్వు ఉండు. ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు. పేరెంట్స్ హ్యాపీగా ఉండేలా చూసుకో. లైఫ్ ను, కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకో. అన్నారు.