
Little Hearts promises a relatable story for everyone -Aditya Hasan & Sai Krishna
Starring Mauli Tanuj of “90s Middle Class Biopic” fame and Shivani Nagaram of “Ambajipeta Marriage Band” fame, the upcoming film “Little Hearts” is directed by Sai Marthand under the banner of ETV Win Originals. Produced by director Aditya Hasan along with Sai Krishna, the film is being presented theatrically by Bunny Vas and Vamsi Nandipati. Little Hearts is gearing up for a grand theatrical release on September 5.
Producer Aditya Hasan said: “When I first heard the story of Little Hearts, I immediately felt it was the kind of narrative I connect with. It’s a story everyone can relate to. There are two types of stories, those that show what we aspire to do, and those that reflect what we have actually experienced. Little Hearts belongs to the latter category. While watching, the audience will recall their own lives and smile, saying ‘this is exactly how it happened with me.’
It’s a fun teenage love story, not a serious or twist-heavy one. It portrays the immaturity of young love, in a pleasant and entertaining way. There’s no message-driven agenda here. To me, cinema should make people forget their struggles for a few hours and walk out happy, just like sleep gives us peace.
The songs and dialogues are designed to feel natural, just like the way we speak in real life. Even abroad in the UK and US, I’ve heard families say they watched 90s Middle Class Biopic together after Baahubali. I believe Little Hearts will connect with them the same way, reminding them of what they’ve missed in life.
Though comparisons with 90s Middle Class Biopic might arise, we aren’t worried if anything, it will boost openings. My involvement here was purely as a producer, while Sai Marthand handled writing, casting and direction. I only gave inputs in the editing stage, choosing what works best theatrically. A longer cut will also be available on OTT.
This is the kind of film that shows our nativity in an authentic way, like how we enjoy Malayalam originals when dubbed. That’s why I was convinced it should be made as a theatrical as well as OTT film.”
Producer Sai Krishna said “90s Middle Class Biopic broke the trend that only web series of a certain kind work. It proved that if you make a good, relatable family entertainer, audiences will embrace it. We strongly believe Little Hearts will succeed in the same way.
From the beginning, we planned this as a theatrical film. Especially after COVID, we’ve seen that quality content-driven movies get strong theatrical response. That’s why we’re happy to back Little Hearts under ETV Win. We are choosing projects based on where they fit best some for OTT, some for theatres. In fact, six more films are coming from ETV Win soon.
The story here is about an illiterate boy and girl, and the humorous, heartwarming situations that arise between them. Bunny Vas and Vamsi Nandipati are releasing the film across nearly 200 theatres. We are also hosting free shows on September 3 for intermediate students in three centers, followed by paid premieres on September 4. We hope audiences shower their support and love.”
ప్రేక్షకులంతా రిలేట్ అయ్యే కథా కథనాలతో “లిటిల్ హార్ట్స్” ఆకట్టుకుంటుంది – నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ.
నిర్మాత ఆదిత్య హాసన్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమా కథ విన్నప్పుడు ఇది నా శైలి రచనతో ఉన్న కథ అనిపించింది. మనమంతా బాగా రిలేట్ అయ్యే కథ ఇది. ప్రేక్షకులు రెండు రకాల కథల్లో లీనమవుతారు. ఒకటి తాము చేయాలనుకున్నవి చూపించే కథలు, రెండు తాము చేసినవి చూపించే స్టోరీస్. ఇది రెండో తరహా మూవీ. ప్రేక్షకులు తమ లైఫ్ లో కూడా ఇలా జరిగిందే అని సినిమా చూస్తున్నంత సేపు రిలేట్ అవుతారు. కథ విన్నప్పుడు ఒక ప్రేక్షకుడిగా నేనూ ఎంజాయ్ చేశాను. బాగా రిలేట్ అయ్యాను. ఈ సినిమాకు రైటింగ్, ఆర్టిస్ట్ సెలెక్షన్, ఇతర అంతా సాయి మార్తాండ్ చూసుకున్నాడు. రైటింగ్ సైడ్ నా ఇన్వాల్వ్ మెంట్ ఏమీ లేదు. ప్రొడక్షన్ పరంగా నేను ఏ సపోర్ట్ చేయగలనో మాకున్న బడ్జెట్స్ లో చేశాను. నేను ప్రొడ్యూస్ చేస్తున్నాననే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇందులో సీరియస్ లవ్ స్టోరీ ఏం లేదు. టీనేజ్ లో ఉండే ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ చూపిస్తున్నాం. అది సరదాగా సాగుతుంది. ఈ ప్రేమకథలో పెద్ద ట్విస్ట్ లు ఏమీ ఉండవు. ఒకప్పుడు మనం ఇంత సిల్లీగా ఉన్నామా అనిపిస్తుంటుంది. ప్లెజెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తే అలా వెంటపడం, మెసేజ్ లు పంపము. ఆ పరిణితి మనలో వయసుతో పాటే ఏర్పడుతుంది. “లిటిల్ హార్ట్స్” సినిమాలో సందేశం ఏమీ ఉండదు. నా దృష్టిలో సినిమా అంటే మన కష్టాలను కాసేపు మరిపించి సంతోషపెట్టేది. మనం నిద్రపోతున్నప్పుడు ఎలా అన్ని బాధలు మర్చిపోతామో, అలా సినిమా చూస్తున్న రెండు, రెండున్నర గంటల సేపు ప్రేక్షకులు అన్ని ఇబ్బందులు మర్చిపోయి ప్రశాంతంగా బయటకు రావాలి. మూవీలో సాంగ్స్ కూడా ఇలా మనం ఈజీగా రిలేట్ అయ్యేలా డిజైన్ చేశాం. మనం మాట్లాడుకునే మాటలు, సందర్భానుసారం ఉపయోగించే పదాలే ఉంటాయి. నేను యూకేలో ఉన్నాను. ఇక్కడ చాలా మంది నన్ను కలిసి మేము బాహుబలి తర్వాత కుటుంబ సభ్యులం అంతా కలిసి “90s మిడిల్ క్లాస్ బయోపిక్” చూశామని చెబుతున్నారు. “లిటిల్ హార్ట్స్” కూడా యూఎస్ యూకేలోని వారికి బాగా నచ్చుతుంది. వారు లైఫ్ లో మిస్ అయినవి ఈ మూవీలో చూసి ఎంజాయ్ చేస్తారు. మౌళిని హీరోగా పెట్టుకోవడం వల్ల “90s మిడిల్ క్లాస్ బయోపిక్” తో పోలిక వస్తుందనే భయం లేదు. అలా పోల్చుకున్నా మాకు ఓపెనింగ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఈ సినిమాకు డైరెక్షన్ పరంగా నా సూపర్ విజన్ ఏం లేదు. ఎడిటింగ్ దగ్గర మాత్రం ఏ సీన్స్ బాగా వర్కవుట్ అవుతాయి, ఏవి థియేట్రికల్ గా వద్దు అనుకున్నవి సెలెక్ట్ చేశాం. ఓటీటీలో ఫుల్ వెర్షన్ వస్తుంది. కొన్ని నిమిషాల నిడివి ఓటీటీలో పెరగవచ్చు. ఓటీటీ అండ్ థియేట్రికల్ పరంగా చూస్తే స్టార్ కాస్టింగ్ కంటే ఈ కథకు ఎవరు బాగా సెట్ అవుతారో అనేది ఈటీవీ విన్ , మా డైరెక్టర్, మా టీమ్ సెలెక్ట్ చేసింది. మౌళి కథ విని నా దగ్గరకు తీసుకొచ్చాడు. నేను విన్నాక మా డైరెక్టర్ సాయి సేమ్ నాలాగే స్క్రిప్ట్ చేశాడు అనిపించింది. ఈ మూవీని చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇలాంటి మూవీస్ ను మలయాళం నుంచి డబ్ చేస్తే మనం ఎంజాయ్ చేస్తున్నాం. మన నేటివిటీ చూపించేలా మంచి మూవీ థియేట్రికల్ గా, ఓటీటీకి అవుతుంది అనిపించింది. అన్నారు.
నిర్మాత సాయి కృష్ణ మాట్లాడుతూ – వెబ్ సిరీస్ లు ఇలాగే ఉండాలనే ట్రెండ్ ను “90s మిడిల్ క్లాస్ బయోపిక్” బ్రేక్ చేసింది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథ, మనం రిలేట్ అయ్యేలా చేస్తే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ఆ వెబ్ సిరీస్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా అలాగే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ముందునుంచీ ఈ కథను థియేట్రికల్ మూవీ చేయాలనే ప్లాన్ చేశాం. మనకు కోవిడ్ తర్వాత చూస్తే. బాగున్న సినిమాలన్నీ థియేట్రికల్ గా బాగా ఆదరణ పొందాయి. ఈటీవీ విన్ నుంచి లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఫీలవుతున్నాం. కంటెంట్ ను బట్టి ఏది థియేటర్ కు బాగుంటుంది, ఏది ఓటీటీకి బాగుంటుంది అనేది సెలెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈటీవీ విన్ నుంచి మరో ఆరు సినిమాలు రాబోతున్నాయి. మూవీలో హీరో హీరోయిన్స్ కు చదువురాదు. చదువు రాని అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ఫన్నీ స్టోరీ ఇది. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 200 థియేటర్స్ లో మా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 3న మూడు సెంటర్స్ లో ఫ్రీ షోస్ ఇంటర్ విద్యార్థుల కోసం వేస్తున్నాం. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. అన్నారు.