
Mr Romeo Teaser Launched
రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్
శ్రీ లక్ష్మీ ఆర్ట్స్, మీడియా 9 క్రియేషన్స్ బ్యానర్ పై నేతి శ్యామ్ సుందర్ నిర్మాతగా మనోజ్ కుమార్ కటోకర్ దర్శకత్వం వహించిన మ్యూజికల్ ఫిలిం మిస్టర్ రోమియో. ఏ రీల్ లైఫ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ తో రూపొందించారు. గురుచరణ్ నేతి, జుహీ భట్, అమిషి రాఘవ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఎస్ కే ఖాదర్, నవనీత్ బన్సాలి, కుల్దీప్ రాజ్ పురోహిత్ ముఖ్య పాత్రల్లో నటించారు. చైతన్య గరికిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ప్రజ్వల్ క్రిష్
సంగీతం అందించారు.
గురువారం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరోయిన్ శ్రియా శరణ్ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గురు చరణ్ నేతి మాట్లాడుతూ.. ” ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. మనోజ్ కుమార్ గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారు. యువతను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్యాషనేట్ టీం తో చేసిన ఈ ఫిలిం అందరికీ నచ్చేలా ఉంటుంది. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రియ గారికి, కరుణ కుమార్ గారికి ధన్యవాదాలు” అని చెప్పారు.
దర్శకుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ..”ఇది చిన్న సినిమా అయినా విజువల్ గా మాత్రం పెద్ద సినిమా చూసిన అనుభవం కలుగుతుంది. సినిమా మొత్తం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ప్రస్తుతం ఆర్ఆర్ వర్క్ జరుగుతుంది. మరో నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. గురు చరణ్ ను సినిమాల్లో లాంచ్ చేయడానికి ముందుగా ఇలాంటి మ్యూజికల్ ఫిలిం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకున్నాం. వారి తండ్రి శ్యామ్ సుందర్ గారు చాలా సపోర్ట్ చేశారు. గురు చరణ్ చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. తన పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చేలా ఉంటుంది. తను తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. తనలో టాలెంట్ చాలా ఉంది. అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. విజువల్ గా మేం ఊహించిన దానికంటే డబుల్ రిజల్ట్ ను అందించాడు సినిమాటోగ్రాఫర్ చందు. తను భవిష్యత్తులో బెస్ట్ టెక్నీషియన్ గా ఎదుగుతాడు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ.. “సినిమాల్లో చిన్నది పెద్దది అని తేడా ఉండదు. అది క్రియేట్ చేసే వండర్స్ ను బట్టి అది లెక్కలోకి వస్తుంది. మనోజ్ గారితో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. యంగ్ జనరేషన్ కి నచ్చేలా ఈ ఫిలిం ను రూపొందించారు.
ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా ఆయనకున్న అనుభవాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమా చాలా బాగుండటమే కాదు కొత్త ఒరవడిని సృష్టించబోతుంది. గురు చరణ్ కి మొదటి సినిమా అయినా చాలా బాగా నటించారు. తను భవిష్యత్తులో మరింత పెద్ద హీరో అవుతాడని ఆశిస్తున్నా” అని అన్నారు.
శ్రియా శరణ్ మాట్లాడుతూ..”టీజర్ చాలా బాగుంది. మూవీ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గురు చరణ్ అద్భుతంగా నటించారు. తనలో మంచి నటుడు ఉన్నాడు. టీజర్ లో కార్తీక్ గా కనిపించిన చరణ్ నటన బాగుంది. ‘నాకు రియల్ లవ్ కావాలి. రీల్స్ లవ్ కాదు’ అని చరణ్ చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. హీరోగా తను మరిన్ని సినిమాలు తీయాలని కోరుతూ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ మనోజ్ తో ఎప్పుడు మాట్లాడిన సినిమాలు, కథలు గురించే చెబుతారు. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తీశారు. ఈ కథ యూత్ ని మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. యంగ్ టీమ్ అంతా కలిసి చేసిన ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఇందులో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్” అని చెప్పారు.
షార్ట్ ఫిల్మ్ : మిస్టర్ రోమియో
నటీనటులు : గురుచరణ్ నేతి, జుహీ భట్, అమిషి రాఘవ్, ఎస్ కే ఖాదర్, నవనీత్ బన్సాలి, కుల్దీప్ రాజ్ పురోహిత్.
స్టోరీ, డైరెక్షన్ : మనోజ్ కుమార్ కటోకర్
నిర్మాత : నేతి శ్యాంసుందర్, శ్రీ లక్ష్మీ ఆర్ట్స్
డిఓపి : చందు సి ఎస్ ఆర్
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రజ్వల్ క్రిష్
స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ : చైతన్య గరికిన
ఎడిటింగ్ : ఎండి నాగూర్ వలి
కాస్ట్యూమ్స్ అండ్ స్టైలింగ్ : నవనీత్ బన్సాలి.
పి ఆర్ ఓ : జీకే మీడియా (గణేష్, కుమార్).