
Gadadhari Hanuman Will Become A Blockbuster – Raj Kandukuri
The film Gadadhari Hanuman, produced under the banner of Virabh Studio by Renuka Prasad and Basavaraj Hurakadli, is being touted as one of the most ambitious mythological films. It stars Ravi Kiran in the lead role and is directed by Rohit Kolli. Shot in Telugu, Kannada, and Hindi, the teaser launch event was held on Friday with notable guests including producers C. Kalyan, Raj Kandukuri, and director Samudra.
The teaser sets the tone with an intriguing blend of mystery, the supernatural, and deep-rooted devotion. As it builds, the final frames, rich in devotional fervor, deliver a powerful goosebump-inducing climax. Introducing lead actors Ravi Kiran and Harshitha, the teaser showcases stunning visuals, elevated further by a gripping background score infused with electrifying chants of the Hanuman Chalisa. At the teaser launch event:
*Senior Producer C. Kalyan stated:* “I was the one who launched the film ‘Hanuman’. Director Prasanth Varma has a sentiment of beginning his projects with me. Just like Hanuman was a huge hit, I wish the same success for Gadadhari Hanuman. Anyone who believes in Hanuman is destined for success. The teaser looks fantastic. I hope this multilingual film becomes a major success across Telugu, Kannada, and Hindi.”
*Producer Raj Kandukuri said:* “The title Gadadhari Hanuman has a very positive vibe. I thank the director and producers for making a film with such a powerful title. Ravi Kiran had already narrated the story to me, the climax is going to be phenomenal. Films with strong content are performing well regardless of budget. I believe Ravi Kiran will become a superstar with this film. This will definitely be a blockbuster.”
*Director Samudra said:* “Thanks to everyone who attended the Gadadhari Hanuman event. Director Rohit is a close friend, and the teaser is impressive. I hope Ravi Kiran scores another major success with this film.”
*Lead actor Ravi Kiran expressed:* “Thanks to Raj Kandukuri garu for attending for our sake. Also, thanks to our producers Basavaraj and Renuka Prasad for mounting the film so grandly. Initially, we planned this as a small-scale project, but Hanuman’s blessings and strength allowed us to bring it to this scale. The climax is quite complex. The film’s music, BGM, and visuals are on the next level. I’m a huge fan of Chiranjeevi, who also has great admiration for Hanuman. I believe we have their blessings. The film includes all kinds of emotions. My previous film Tarakasura received great response in Kannada and Telugu, and I hope this one will be embraced similarly. The content is strong, which is why we’re releasing it in Telugu, Kannada, and Hindi. It will appeal to audiences of all ages.”
*Producer Renuka Prasad said:* “I produced Gadadhari Hanuman along with Basavaraj. Our director Rohit Kolli has crafted the film brilliantly. Thanks to Ravi Kiran for his support.”
*Producer Basavaraj Hurakadli afirmed:* “It was a pleasure to produce Gadadhari Hanuman along with Renuka Prasad. Director Rohit brought his vision to life beautifully. With Hanuman’s blessings, we made a fantastic film. It’s a family-oriented project. Ravi Kiran gave a stellar performance. The background score is next level, and visually, the film is a wonder. We’re happy with the outcome and will bring it to audiences soon. We hope everyone loves the teaser. Thanks to Raj Kandukuri garu for attending.”
*Director Rohit Koli stated:* “I’ve been on this Gadadhari Hanuman journey for three years. It began with Basava sir, and the initial concept was quite simple. But once Ravi garu joined, the scope expanded significantly. That’s why we’re now presenting it as a pan-India film. Ravi Kiran portrayed a wide range of emotions beautifully. Harshitha also performed well. Renuka Prasad garu never compromised at any stage. The teaser and glimpses focus a lot on the ‘gada’ (mace). There’s even a powerful sequence that highlights its strength. Thanks to Raj Kandukuri garu, C. Kalyan garu, and Samudra garu for attending. We believe our teaser has been well received and that the film will connect with everyone.”
గదాధారి హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది – రాజ్ కందుకూరి
మైథలాజికల్ జానర్లో అత్యంత భారీ చిత్రంగా విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రవి కిరణ్ హీరోగా నటించారు. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో
*సి. కళ్యాణ్ మాట్లాడుతూ* .. ‘‘హనుమాన్’ సినిమాను నేనే ప్రారంభించాను. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో.. ఈ ‘గదాధారి హనుమాన్’ కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హనుమాన్ను నమ్ముకున్న వారంతా విజయాన్ని సాధిస్తారు. టీజర్ అద్భుతంగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*రాజ్ కందుకూరి మాట్లాడుతూ* .. ‘‘గదాధారి హనుమాన్’ టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. ఇలాంటి ఓ టైటిల్‌ను పెట్టుకుని సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రవి కిరణ్ ఇది వరకే నాకు కథ చెప్పారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతోంది. ఇలాంటి చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా ఆడుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నదా? పెద్దదా? అన్న తేడాని ఆడియెన్స్ చూడటం లేదు. రవి కిరణ్ ఈ మూవీతో సూపర్ స్టార్ అవుతారనిపిస్తోంది. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని అన్నారు.
*దర్శకుడు సముద్ర మాట్లాడుతూ* .. ‘‘గదాధారి హనుమాన్’ ఈవెంట్‌కు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. దర్శకుడు రోహిత్ నాకు మంచి మిత్రుడు. టీజర్ బాగుంది. రవి కిరణ్ ఈ చిత్రంతో మరోసారి పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*హీరో రవి కిరణ్ మాట్లాడుతూ* .. ‘మా కోసం వచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మా నిర్మాతలు బసవరాజ్, రేణుకా ప్రసాద్ గారికి థాంక్స్. మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ఆ హనుమాన్ ఇచ్చిన సపోర్ట్, శక్తి వల్లే ఈ సినిమాను ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మా చిత్రంలో మ్యూజిక్, బీజీఎం, విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. తారకాసుర చిత్రానికి కన్నడ, తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాను అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే ఈ మూవీని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
*నిర్మాత రేణుకా ప్రసాద్ మాట్లాడుతూ* .. ‘‘గదాధారి హనుమాన్’ సినిమాను బసవరాజ్‌తో కలిసి నిర్మించాను. మా దర్శకుడు రోహిత్ కొల్లి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మాకు సపోర్ట్ చేసిన రవి కిరణ్‌కు థాంక్స్’ అని అన్నారు.
*నిర్మాత బసవరాజ్ హురకడ్లి మాట్లాడుతూ* .. ‘‘గదాధారి హనుమాన్’ మూవీని రేణుకా ప్రసాద్ గారితో కలిసి నిర్మించడం ఆనందంగా ఉంది. మా దర్శకుడు రోహిత్ గారి విజన్‌కు తగ్గట్టుగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఆ హనుమంతుడి ఆశీస్సులతో ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాం. కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. రవి కిరణ్ అద్భుతంగా నటించారు. బీజీఎం నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా పట్ల మేం సంతోషంగా ఉన్నాం. ఆడియెన్స్ ముందుకు ఈ చిత్రాన్ని త్వరలోనే తీసుకు వస్తాం. మా టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం వచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్’ అని అన్నారు.
*దర్శకుడు రోహిత్ కొల్లి మాట్లాడుతూ* .. ‘‘గదాధారి హనుమాన్’ సినిమాతో నేను మూడేళ్లు ప్రయాణం చేశాను. బసవ సర్‌తో ఈ జర్నీ ప్రారంభమైంది. అప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో మూవీ అనుకున్నాం. కానీ మా రవి గారు జాయిన్ అవ్వడంతో స్పాన్ మారిపోయింది. అందుకే ఇప్పుడు ఇలా పాన్ ఇండియా స్థాయిలో మూవీని తీసుకు వస్తున్నాం. రవి కిరణ్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. హర్షిత చక్కగా నటించారు. రేణుకా ప్రసాద్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ ఫుల్ అన్న దానిపై ఓ సీక్వెన్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా కోసం వచ్చిన రాజ్ కందుకూరి గారికి, సి. కళ్యాణ్ గారికి, సముద్ర గారికి థాంక్స్. మా టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాం. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.