
Solo Boy about a middle-class boy’s journey from age 17 -Producer Seven Hills Satish
Under Seven Hills Productions, Solo Boy is all set for a theatrical release on July 4. The film stars Bigg Boss fame Gautham Krishna alongside Ramya Pasupuleti and Shwetha Avasthi, directed by P. Naveen Kumar and produced by Satish. With Thrilok Siddu as DOP and Praveen Pudi as editor, the youthful drama is building buzz. Ahead of the release, producer Satish sat down with the media for an insightful conversation.
How did the idea of Solo Boy come about?
Gautham Krishna, a close friend, pitched me this concept. The story—about a middle-class boy’s journey from age 17, facing life’s challenges until he finally finds stability—struck a deep chord with me. It felt real, relatable, and worth telling.
What precautions did you take during production?
We were careful with our budget and avoided unnecessary spending. Our team was young and passionate—they worked for lower pay but gave their full support. I plan to share profits with them post-release.
Thoughts on the current cinema market?
My previous film Battala Ramakrishna was an experimental success. I learned a lot from it and applied that experience here. Today, big star films dominate screen space even before release. Single screens are still not fully balanced.
How long is the film and how wide is the release?
The final runtime is 2 hours 10 minutes, certified U/A. We are planning a release across 120–150 theatres in Andhra and Telangana.
How big of an asset is Gautham Krishna’s Bigg Boss fame?
Huge! He’s putting his heart into promotions. Having appeared in two Bigg Boss seasons, his visibility definitely adds to the film’s reach.
What kind of audience response are you expecting?
I made this film with honesty and clarity, within a limited budget. I believe audiences will connect with the content and support us.
Were there changes in the script after Gautham’s Bigg Boss stint?
Most of the film was shot before Bigg Boss. We only had a few scenes left, and we polished them with more care based on the evolving perception of his on-screen image.
As a producer, what has the industry taught you?
Ups and downs are part of the game. But with the right intent and team, good cinema will always find its place.
You began as a director, took a break, and returned as a producer. Why the shift?
I initially worked as an assistant director. Later, I moved into real estate to gain financial stability and returned with enough backing to produce my own film.
Do you have strong connections in the film industry?
Yes. I’m friends with directors like Venky Atluri, Sagar Chandra, Sampath Nandi, and Balagam Venu. I’ve also worked with Nandini Reddy, Machha Ravi, and even with Natural Star Nani in the direction department.
Were you involved creatively in Solo Boy’s script?
Yes, I had creative input in shaping the story. I’m also working on a new script. If things fall into place, I’d like to direct it myself.
Was the film completed within budget?
Surprisingly, yes! We even wrapped it below the initial budget estimate.
What’s your stance on reviews?
If the content is strong, it will reach the audience regardless of reviews. I welcome reviews but ask for support in the first three days to build momentum.
Why did you launch the trailer with martyr Murali Naik’s family?
Gautham came up with the idea. Instead of a regular celebrity launch, we wanted to honour a true hero. We invited Murali Naik’s family, launched the trailer through them, and donated ₹1 lakh as a token of respect. It was a heartfelt moment.
You’re very selective with your films. Why?
A film is watched by lakhs of people—it must satisfy them. Story selection requires intense care. For me, cinema is not just passion—it’s an obsession.
How would you describe Solo Boy in one line?
It’s a film for everyone who’s ever struggled to stand on their own feet. A story about ambition, grit, and survival—Solo Boy reflects the inner journey of today’s youth.
How do you maintain bonding with your team?
I treat every technician and actor like family. That personal touch keeps the energy high. They work with me as brothers.
What’s your next project?
I’m teaming up with Narne Nithin for a thriller. The script is locked.
సోలో బాయ్ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తృప్తిపరుస్తుంది : నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నవీన్ కుమార్ దర్శకత్వంలో సతీష్ నిర్మాతగా జూలై 4వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. త్రిలోక్ సుద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. సోలో బాయ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో చిత్ర నిర్మాత సతీష్ మీడియా వారితో ఇంటర్వ్యూలో పాల్గొని మీడియావారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది.
సోలో బాయ్ చిత్ర ప్రస్థానం ఎలా మొదలైంది?
సోలో బాయ్ చిత్ర హీరో గౌతమ్ కృష్ణ నాకు చాలా మంచి స్నేహితుడు. అతను ఈ సినిమా లైన్ చెప్పినప్పుడు మధ్యతరగతి కుటుంబంలోని 17 సంవత్సరాల నుండి సెటిల్ అవ్వడానికి పడే కష్టం తాలూకా పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది.
ప్రొడక్షన్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?
అనవసరమైన ఖర్చులు ఎక్కడ పెట్టకుండా ప్రతి విషయంలో జాగ్రత్తపడి ఖర్చు పెట్టాము. చిత్రానికి పనిచేసిన యంగ్ టీం అంతా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా విడుదల తర్వాత వారికి లాభాల నుండి తగ్గ డబ్బును ఇస్తాను.
ప్రస్తుత సినిమాలపై, బయట మార్కెట్ పై మీ ఉద్దేశం ఏంటి?
గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాము. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.
సినిమా రన్ టైమ్ ఎంత? ఎన్ని థియేటర్లలో విడుదల కానుంది?
ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునేప్పటికీ రెండు గంటల పది నిమిషాలు ఫైనల్ అవుట్ పుట్ వచ్చింది. U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారు 120 నుండి 150 స్క్రీన్స్ మధ్యలో విడుదల కానుంది.
గౌతమ్ కృష్ణ బిగ్బాస్ ఫేమ్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుంది?
గౌతమ్ ఈ సినిమా ప్రమోషన్లలో 100% మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండు సీజన్లో ఉండటం వల్ల అతని ఫేమ్ ఈ సినిమాకు మరింత తోడ్పడుతుంది అనుకుంటున్నాను.
సినిమాలో ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారు అనుకుంటున్నారు?
నాకు ఉన్న బడ్జెట్లో నాకు ఉన్న సర్కిల్లో నేను మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేశాను. అది కచ్చితంగా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాను.
గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కథలో మార్పులు ఏమైనా చేశారా?
గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ కు వెళ్లే ముందు సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కొన్ని సీన్లు మాత్రం చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుని ఇంకా బాగా వచ్చేలా జాగ్రత్త పడ్డాం.
ఒక నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో గ్రహించింది ఏంటి?
సాధారణంగా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని తెలిసే వస్తాము. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఆశయంతో నిర్మాతగా వచ్చాను.
మీరు చిత్ర పరిశ్రమకు డైరెక్టర్ కావడానికి వచ్చి తర్వాత బ్రేక్ తీసుకొని ఇప్పుడు నిర్మాతగా వచ్చారు. బ్రైట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి?
ముందుగా వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని చిత్రాలకు పని చేశాను. ఆ తర్వాత డబ్బు సంపాదించుకున్న వద్దామని రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొంత డబ్బులు సంపాదించి ఆ తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను.
మీకు చిత్ర పరిశ్రమలో ఉన్న పరిచయాలు ఎటువంటివి?
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపద నంది, బలగం వేణు నాకు మంచి స్నేహితులు. అలాగే నేను సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా వేరే ప్రొడక్షన్స్ లో పనిచేశాను. ఆ సమయంలో నందినీ రెడ్డి, మచ్చ రవి నాచురల్ స్టార్ నానితో కూడా కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను.
మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చారు. ఈ కథలో మీరేమైనా ఇన్వాల్వ్ అయ్యారా? భవిష్యత్తులో డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా?
ఈ చిత్ర కథలు నా ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము. నా మిత్రులు ఎవరైనా నిర్మాతలుగా ఆ కథకు నేను దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను.
సోలో బాయ్ సినిమాను అనుకొన్న బడ్జెట్ లోనే పూర్తి చేశారా?
అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాము.
రివ్యూస్ పై మీ ఒపీనియన్ ఏంటి?
మన సినిమాలో విషయం ఉంటే జనాల్లోకి వెళుతుంది. రివ్యూస్ ఎలా ఉన్నా కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే సినిమా విడుదలైన మూడు రోజులపాటు అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులతో ట్రైలర్ లాంచ్ చేయడానికి గల కారణం ఏంటి?
చిత్ర పరిశ్రమలో ఎంతోమంది తెలిసినప్పటికీ దేశం కోసం ప్రాణాలు నడిపించిన మురళి నాయక్ వంటి వీరులని గుర్తించి వారి కుటుంబ సభ్యుల చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ చేపిద్దామని గౌతమ్ నాతో అన్నారు. వెంటనే మేము అంతా సరే అని వారి చేతుల మీదగా ట్రైలర్ నుంచి చూపించి వారి కుటుంబానికి మా వంతుగా లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి సపోర్టుగా నిలవడం జరిగింది. మురళి నాయక్ రియల్ హీరో.
సినిమాలు చాలా సెలెక్టివ్ గా తీస్తున్నారు. కారణం ఏంటి?
ఎన్నో వేలమంది, లక్షలమంది చూసి ఆదరించే సినిమా వారిని సంతృప్తి పరిచే విధంగా ఉండాలంటే కథ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. నేను అటువంటి జాగ్రత్తలే తీసుకుని సినిమాలు తీస్తున్నాను. అలాగే సినిమాలు చేయాలంటే ఇష్టం కాదు, పిచ్చి ఉండాలి. నాకు సినిమాలు అంటే అటువంటి పిచ్చి ఉంది.
సోలో బాయ్ సినిమాను ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు?
సోలో బాయ్ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను నుంచోవాలి అనుకుని ఆలోచనతో సాగే సినిమా. ప్రతి ఒక్కరిలో కనిపించే క్యారెక్టర్ సోలో బాయ్.
మీరు చిత్ర బృందంతో ఎలా ఉంటారు?
నేను గతంలో చేసిన సినిమాల నుండి ఈ సినిమా వరకు ప్రతి ఒక్కరిని ఎంతో దగ్గరగా నా కుటుంబ సభ్యుల పలకరిస్తూ ఎంతో ప్రేమగా ఉంటాను. వారు కూడా నాతో అన్నదమ్ములు లాగా కలిసి పనిచేస్తారు.
మీ తర్వాత సినిమాలు ఏంటి?
నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది.
ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యు!