నా మాటల్ని అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాను – నిర్మాత శిరీష్ రెడ్డి

Vijay Antony Thanks Telugu Audience for Making Maargan a Huge Success
Actor and producer Vijay Antony’s latest film, Maargan, directed by Leo John Paul, has turned out to be a success, especially in the Telugu states. The film also marks the debut of Vijay Antony’s nephew, Ajay Dhishan, as an actor. Produced under the Vijay Antony Film Corporation banner, with proud presentation by J. Ramanjaneyaulu of Sarvanth Ram Creations, the Telugu version, was released on June 27 by Suresh Babu. Since its release last Friday, the film has received a strong response from Telugu audiences. To celebrate this, the film’s team held a Thank You Meet on Wednesday.
*Speaking at the event, Vijay Antony said:*
“Suresh Babu garu and Ram Anjaneyulu garu gave Maargan a grand Telugu release. Suresh Babu garu has even promised to release all my future films in Telugu. I’m thankful to Leo John Paul for giving me such a good film. I feel very happy to have launched Ajay with this project. Ajay has received appreciation both in Tamil and Telugu. Going forward, I hope he continues to do quality content films and keeps winning audience love. Ajay also worked as an assistant director on Bichagadu 2 and Romeo. I’m now planning to produce straight Telugu films along with Ajay. Currently, I’m working on seven films in Tamil, and I will take extra care with their Telugu dubbing. Soon, my next film, Bhadrakali, will release. It’s a political action thriller. I sincerely thank the Telugu audience for making Maargan such a big success.”
*Ajay Dhishan said:* “I honestly didn’t expect Maargan to become such a hit in Telugu. Though it’s a Tamil film, the Telugu audience has given us huge success. I thank Vijay Antony sir and Fatima Vijay Antony madam for giving me this opportunity. Also, my heartfelt thanks to Leo John Paul sir for his support. Special thanks to Suresh Babu sir, Rana sir, and Ram Anjaneyulu garu for releasing our film so well in Telugu.”
*Director Leo John Paul stated:* “Without Vijay Antony sir, this film wouldn’t have turned out the way it did. It was produced on a large scale with high technical standards. Even during the dubbing process, he paid great attention to detail. It’s my fortune to have worked with him. Ajay delivered a brilliant performance. I also thank Suresh Babu garu and Ram Anjaneyulu garu for releasing the film on such a big scale in Telugu.”
*Lyricist and dialogue writer Bhashyasree said:*
“Right from start to finish, Maargan kept the audience on the edge of their seats as a true thriller. I wrote the dialogues and songs for this film. I sincerely thank Vijay Antony sir for trusting me with this opportunity.”
Stills
Leo John Paul, vijay antony, Ajay Dhishan
*‘మార్గన్’ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కు థాంక్స్.. థాంక్యూ మీట్లో విజయ్ ఆంటోని*
విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో తన మేనల్లుడు అయిన అజయ్ ధీషన్‌ను విజయ్ ఆంటోని తెరకు పరిచయం చేశారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పించారు. ఈ సినిమాను జూన్ 27న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేశారు. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలో బుధవారం నాడు చిత్రయూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
*విజయ్ ఆంటోని మాట్లాడుతూ* .. ‘‘మార్గన్’ సినిమాను సురేష్ బాబు గారు, రామాంజనేయులు గారు చాలా గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్ చేశారు. ఇకపై నా సినిమాల్ని తెలుగులో రిలీజ్ చేస్తానని సురేష్ బాబు గారు అన్నారు. నాకు ఇంత మంచి మూవీని ఇచ్చిన లియో జాన్ పాల్‌కు థాంక్స్. అజయ్‌ను ఇంత బాగా లాంచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు, తమిళంలో అజయ్‌కు మంచి పేరు వచ్చింది. అజయ్ ఇకపై ఇలానే మంచి కంటెంట్ చిత్రాల్ని చేస్తూ ఆడియెన్స్ నుంచి ప్రేమను సంపాదిస్తూనే ఉండాలి. బిచ్చగాడు 2, రోమియో చిత్రాలకు అజయ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. అజయ్‌తో కలిసి నేను ఇక స్ట్రెయిట్ తెలుగు సినిమాల్ని నిర్మిస్తాను. తమిళంలో ప్రస్తుతం ఏడు చిత్రాల్ని చేస్తున్నాను. అందులో తెలుగు డబ్బింగ్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. త్వరలోనే ‘భద్రకాళి’ రానుంది. అదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ‘మార్గన్’ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
*అజయ్ ధీషన్ మాట్లాడుతూ* .. ‘‘మార్గన్’ సినిమాకు తెలుగులో ఇంత సక్సెస్ వస్తుందని అనుకోలేదు. ఇది తమిళ చిత్రం అయినా కూడా తెలుగు ఆడియెన్స్ పెద్ద విజయాన్ని అందించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ గారికి, ఫాతిమా విజయ్ ఆంటోని గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన లియో జాన్ పాల్ గారికి థాంక్స్. మా మూవీని తెలుగులో ఇంత బాగా రిలీజ్ చేసిన సురేష్ బాబు గారు, రానా గారు, రామాజంనేయులు గారికి థాంక్స్’ అని అన్నారు.
*లియో జాన్ పాల్ మాట్లాడుతూ* .. ‘విజయ్ ఆంటోనీ గారు లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు. ఇది హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో భారీ ఎత్తున నిర్మించిన చిత్రం. డబ్బింగ్ విషయంలోనూ ఆయన ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. అజయ్ అద్భుతంగా నటించారు. తెలుగులో ఇంత పెద్దగా రిలీజ్ చేసిన సురేష్ బాబు గారు, రామాజంనేయులు గారికి థాంక్స్’ అని అన్నారు.
*భాష్య శ్రీ మాట్లాడుతూ* .. ‘‘మార్గన్’ మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆడియెన్స్ అలా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఫీల్ అయ్యారు. ఈ చిత్రానికి నేను మాటలు, పాటలు రాశాను. నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి థాంక్స్’ అని అన్నారు.