Queen Anushka Shetty Pan India Film Ghaati spine-chilling Glimpse out
స్వయంసేవకుడు “జితేందర్ రెడ్డి” పోరాటం మెప్పిస్తుంది
జితేందర్ రెడ్డి మూవీ రివ్య్వూ
చిత్రం – జితేందర్ రెడ్డినటీనటులు – రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులుసినిమాటోగ్రఫీ – వి. ఎస్. జ్ఞాన శేఖర్
సంగీతం – గోపి సుందర్ఎడిటర్ – రామకృష్ణ అర్రం
సహ నిర్మాత – ఉమ రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వాణిశ్రీ పొడుగు
నిర్మాత – ముదుగంటి రవీందర్ రెడ్డి
దర్శకత్వం – విరించి వర్మ
ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల గురించి అందరికీ తెలిసిన విషయమే. వారికి సంబంధించిన కథతో సినిమా తెరకెక్కితే, ఆ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశం కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా పనిచేసే స్వయంసేవకుల బయోపిక్స్ తెరకెక్కడం చాలా అరుదు. మన మాజీ తాజా ప్రధాన మంత్రులైన అటల్ బిహారి వాజ్ పేయ్, నరేంద్ మోడీ లు కూడా స్వయంసేవకులుగా ప్రస్థానం మొదలుపెట్టి దేశ అత్యున్నత పదవులు అందుకున్నారు. ఇలాంటి వాళ్లు పదవులు అందుకోవడంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల పాత్ర మరవలేనది. అలాంటి స్వయంసేవకుడి కథే జితేంద్ర రెడ్డి చిత్రం కథ. మరి ఈయన ఎవరు… ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ
జితేందర్ రెడ్డి కథ విషయానికొస్తే.. జితేందర్ రెడ్డి 1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల లో జరిగిన యధార్ధ గాథ. జితేందర్ రెడ్డి కుటుంబం ముందు నుంచి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు. దేశం కోసం, ధర్మం కోసం అహోరాత్రులు పనిచేసే కుటుంబం. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నపుడే ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. అంతేకాదు దేశం కోసం, ప్రజలు కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటాడు. జితేందర్ రెడ్డి చిన్నపుడు నిండా 18 యేళ్లు లేని కుర్రాడిని అన్యాయంగా నక్సలైట్స్ హత్య చేస్తారు. ఆ ఊర్లో ఉండే పౌర హక్కుల నేత ప్రోద్బలంతో ఆ పిల్లాడు దళంలో చేరుతాడు. కానీ నక్సలైట్స్ నుంచి పారిపోయి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్ ఈ పిల్లాడిని దారుణంగా హత్య చేస్తారు. ఈ సంఘటనతో కామ్రేడ్స్ పై రగిలిపోతాడు జితేందర్ రెడ్డి. భూమి కోసం, పీడిత ప్రజల బాగు కోసం గన్నులు చేత పట్టినట్టు చెప్పుకునే నక్సలైట్స్ దారితప్పినట్టు తెలుసుకుంటాడు. ఆ తర్వాత కామ్రేడ్స్ పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగు తెరపై ఎపుడు కామ్రేడ్స్ ను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తెరకెక్కాయి. మన దగ్గర అన్ని వ్యవస్థల్లో పాతుకుపోయినా.. లెఫ్ట్, లిబరల్ ఏకో సిస్టం కారణంగా వారిని కథానాయకులుగా చూపిస్తూ వచ్చారు దర్శకులు. కానీ ఈ మధ్య నక్సలిజంలోని చీకటి కోణాలను వివరిస్తూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా ఈ యేడాది విడులైన అదా శర్మ ‘బస్తర్’ సినిమాలో కూడా ఛత్తీస్ గడ్ నక్సలైట్స్ చేస్తున్న అరాచకాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. మన దేశంలో భారత్, పాకిస్థాన్ యుద్ధంలో చనిపోయిన సైనికులు, పోలీసులు, సామాన్య ప్రజల కంటే ఎక్కువ మంది నక్సల్స్ చేతిలో చనిపోయారు. ఇలాంటి కథలను తెరకెక్కిండం అంటే మాములు విషయం కాదు.
సొమ్ములు ఉంటే సరిపోదు దాన్ని నిర్మించే గట్స్ ఉండాలి. దాన్ని తెరకెక్కించే దమ్ము, ధైర్యం ఉండాలి. తెలుగు తెరపై ఇప్పటి వరకు నక్సలైట్స్ పై పాజిటివ్ దృక్పథంతోనే సినిమాలు తెరకెక్కాయి. ఇక నక్సలిజంలోని చీకటి కోణాలను ఆవిష్కరించారు. ఒకపుడు పీడిత వర్గాల కోసం కన్నులు పట్టిన అన్నలు.. ఆ పీడిత వర్గాలను ఎదగకుండా చేసారు. అంతేకాదు ప్రభుత్వం చేపట్టే ప్రగతికి అడ్డుగా నిలుస్తున్నారు. ఆ విషయాన్ని దర్శకుడు విరించి వర్మ.. తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.
నటన, నక్సలైట్ లీడర్ గా ఛత్రపతి శేఖర్ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
కథ, కథనం ఈ సినిమాకి ప్లస్. సినిమాని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్ ఆడియన్స్ మనసులను హత్తుకుంటుంది.
పెద్ద స్టార్స్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్. సాంగ్స్ మైనస్.
ఫైనల్ గా … జితేందర్ రెడ్డి… కామ్రేడ్స్ అరాచకాలపై పోరాడిన స్వయంసేవకుడి కథ
రేటింగ్: 3.25/5