ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
Prabhas Birthday Special – The Raja Saab Motion Poster Released
The highly anticipated movie “The Raja Saab” is directed by the talented Maruthi, featuring rebel star Prabhas in the lead role. Produced ambitiously by TG Vishwaprasad under the People Media Factory banner, this film is set to explore the romantic horror genre, a territory Prabhas has not ventured into before, generating significant curiosity among fans and movie lovers. On the occasion of Prabhas’s birthday today, the motion poster for “The Raja Saab” was released as a special tribute.
The motion poster is uniquely designed, showcasing a man walking through a forest to reach a grand building. There, Raja Saab is introduced, sitting on a throne-like chair. With a cigar in hand and a salt-and-pepper hairstyle, Prabhas’s character embodies a vintage look. The catchy theme song, composed by the music sensation Thaman, enhances the atmosphere. The makers have cleverly included the caption “Horror is the New Humor” at the end of the motion poster, indicating that “The Raja Saab” aims to set a new trend in the genre.
People Media Factory, known for its consecutive successes, is producing “The Raja Saab” with high production values and grand scale. Director Maruthi is crafting the film as a masterpiece that will resonate with audiences for years to come. “The Raja Saab” is scheduled to hit screens on April 10 next year, releasing in Tamil, Malayalam, Kannada, Hindi, and Telugu on a pan-India level. Currently, the shooting of “The Raja Saab” is in its final stages.
Cast: Prabhas, Nidhhi Aggarwal, Malavika Mohanan, Ridhi Kumar, and others.
Technical Team:
- Editing: Kotagiri Venkateswara Rao
- Cinematography: Karthik Palani
- Music: Thaman S
- Fight Masters: Ram Laxman, King Solomon
- VFX: R.C. KamalaKannan
- Production Designer: Rajeevan
- Creative Producer: SKN
- PRO: GSK Media (Suresh-Sreenivas), Vamsi Kaka
- Co-Producer: Vivek Kuchibhotla
- Executive Producer: Krithi Prasad
- Producer: TG Vishwaprasad
- Written and Directed by: Maruthi
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా “రాజా సాబ్” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్”. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. ఈ సినిమా నుంచి రెబెల్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ “రాజా సాబ్” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
“రాజా సాబ్” మోషన్ పోస్టర్ ను యూనిక్ గా డిజైన్ చేశారు. ఒక అడవిలో నడిచి వెళ్తున్న వ్యక్తి పెద్ద భవంతికి చేరుకుంటాడు. అక్కడ సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న రాజా సాబ్ ను మోషన్ పోస్టర్ లో పరిచయం చేశారు. చేతిలో సిగార్, సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ తో ప్రభాస్ రాజా సాబ్ క్యారెక్టర్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. మోషన్ పోస్టర్ కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ చేసిన రాజా సాబ్ థీమ్ సాంగ్ ఆకర్షణగా నిలుస్తోంది. హారర్ ఈజ్ ది న్యూ హ్యూమర్ అనే క్యాప్షన్ మోషన్ పోస్టర్ చివరలో వేయడం ద్వారా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే హారర్ ఫ్లస్ కామెడీ “రాజా సాబ్” లో ఉండబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు.
వరుస సక్సెస్ లు అందుకుంటున్న టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా నిర్మిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే మాస్టర్ పీస్ గా “రాజా సాబ్” సినిమాను తీర్చిదిద్దుతున్నారు. “రాజా సాబ్” పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం “రాజా సాబ్” చిత్రీకరణ తుది దశలో ఉంది.
నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
వీఎఎఫ్ఎక్స్ – ఆర్.సి. కమల్ కన్నన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా(సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కృతి ప్రసాద్
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి