స్టైలిష్ అండ్ మోడరన్ అవతార్‌లో నందమూరి మోక్షజ్ఞ
నందమూరి కుటుంబ ప్రతిష్టాత్మక వారసత్వాన్ని కొనసాగిస్తూ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మనవడు, నటసింహ నందమూరి బాలకృష్ణ గారి తనయుడు నందమూరి మోక్షజ్ఞ, సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్ విజయంతో దూసుకుపోతున్న క్రియేటివ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోస్ట్ ఎవైటెడ్ డెబ్యు చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగమైన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్‌పై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. అద్భుతమైన కథనంతో మన ఇతిహాసాలు ఆధారంగా రూపొందించబడే ఈ చిత్రాన్ని మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
మోక్షజ్ఞను కథానాయకుడిగా పరిచయం చేయడానికి బాలకృష్ణ, కుటుంబం సరైన ప్రాజెక్ట్, దర్శకుడి కోసం చూశారు. లార్జర్ దెన్ లైఫ్, విజువల్స్ వండర్స్ చిత్రాలను రూపొందించడంలో ప్రశాంత్ వర్మ తన సత్తా చాటారు. ప్రశాంత్ వర్మ ట్రాక్ రికార్డ్, రీసెంట్ బ్లాక్‌బస్టర్ హనుమాన్, చెప్పుకోదగ్గ పాన్ ఇండియా విజయాన్ని సాధించడంతో, ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ లాంచ్‌ప్యాడ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలిచారు.
సోషియో-ఫాంటసీ కోసం ప్రశాంత్ వర్మతో కలిసి పని చేయాలనే నిర్ణయం, బాలకృష్ణ విజన్ కి అనుగుణంగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చిరస్మరణీయంగా, మైల్ స్టోన్ గా వుంటుంది.
మోక్షజ్ఞ తన అరంగేట్రం కోసం, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించడానికి శిక్షణ తీసుకున్నారు. నందమూరి అభిమానులను, ప్రేక్షకులని అలరించడానికి నటన, ఫైట్లు, డ్యాన్స్ లో ఎక్స్ టెన్సీవ్ ట్రైనింగ్ తీసుకున్నారు.
మోక్షజ్ఞ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ మోక్షజ్ఞ ని స్టైలిష్ అండ్ మోడరన్ అవతార్‌లో ప్రజెంట్ చేసే బ్రాండ్ న్యూ స్టిల్ విడుదల చేశారు. తన మెస్మరైజింగ్ ప్రజెన్స్, ఆకర్షణీయమైన చిరునవ్వుతో కనిపించిన మోక్షజ్ఞ లుక్ అదిరిపోయింది. ఈ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా వైరల్ అవుతోంది.
ప్రశాంత్ వర్మ తన హీరోలను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో దిట్ట. ఈ లుక్ చూస్తుంటే మోక్షజ్ఞ ని అభిమానులు కొరుకునే విధంగా ప్రజెంట్ చేయబోతున్నారని అర్ధమౌతోంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘మోక్షజ్ఞను పరిచయం చేయడం గొప్ప గౌరవం, అలాగే పెద్ద బాధ్యత. బాలకృష్ణ గారు నాపై, నా కథపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. ఈ స్క్రిప్ట్ మన ఇతిహాసాల నుండి స్ఫూర్తి పొందింది, ఇది చెప్పవలసిన అద్భుతమైన కథల బంగారు గని. ఇది కూడా PVCUలో ఒక భాగం, యునివర్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తుంది.’ అన్నారు
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. ”మోక్షజ్ఞ సినిమాను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది, ఎస్ఎల్వి సినిమాస్‌లో మాకు ఈ సువర్ణావకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. మోక్షజ్ఞ తన అరంగేట్రానికి సరిగ్గా సరిపోయే అద్భుతమైన స్క్రిప్ట్‌తో ప్రశాంత్ వర్మ ముందుకు వచ్చారు. ఈ సినిమా పట్ల మేమంతా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం” అన్నారు.
మోక్షజ్ఞ మోస్ట్ ఎవెయిటెడ్ డెబ్యు ఫిలింకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: నందమూరి మోక్షజ్ఞ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
పీఆర్వో: వంశీ-శేఖర్