K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

వయనాడ్ బాధితులకు 10 లక్షల విరాళం ప్రకటించిన రశ్మిక మందన్న
బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాన్ ఇండియా క్వీన్ గా పేరు తెచ్చుకుంది రశ్మిక మందన్న. సోషల్ ఇష్యూస్ పై స్పందించే రశ్మిక పలు సందర్భాల్లో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఆమె మరోసారి తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్ లో ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాధం పట్ల రశ్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.
ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. రశ్మిక మందన్న ప్రస్తుతం “పుష్ప 2” ది రూల్ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ “సికిందర్” లో నటిస్తోంది. ఆమె ఖాతాలో “ది గర్ల్ ఫ్రెండ్” అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఉంది.