Lopalliki Ra Cheptha 4th Single Tik Tok Chedama.. Released by

Sanjay Dutt completes dubbing for Double Ismart
‘డబుల్ ఇస్మార్ట్’ డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంత్ రోల్ పోషిస్తున్నారు. సంజయ్ దత్ తన వాయిస్ ని అందించడం ద్వారా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారు. సంజయ్ దత్ తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావస్తుండగా, ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో రెండు పాటలు, టీజర్ భారీ అంచనాలు నెలకోల్పాయి.
ఈ సినిమాలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు.
డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా