
SEETHA PRAYANAM KRISHNA THO MOVIE REVIEW
సీత ప్రయాణం కృష్ణతో మూవీ రివ్యూ
చిత్రం : సీత ప్రయాణం కృష్ణ తో …
బ్యానర్: ఖుషి టాకీస్
నటి నటులు : హీరోయిన్ డా.రోజా భారతి, హీరోయిన్ రాఖి శర్మ, దినేష్, సుమంత్, అనుపమ
సినిమాటోగ్రఫీ : రవీంద్ర
సంగీతం: శరవణ వాసుదేవన్
కో డైరెక్టర్: రాజేంద్ర
పోస్ట్ ప్రొడక్షన్: పిక్సెల్ ప్యారెట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చెర్రీ
సమర్పణ : ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ డా. రాజీవ్
నిర్మాత : రోజా భారతి
డైరెక్టర్: దేవేందర్
ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్ ఖుషి టాకీస్ పై రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ నటీ, నటులుగా దేవేందర్ దర్శకత్వంలో డా. రాజీవ్, డా. రోజా భారతి లు నిర్మించిన చిత్రం ‘ సీత ప్రయాణం కృష్ణతో’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల ’14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ సీత ప్రయాణం కృష్ణతో” చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..
కథ
ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ బేస్ చేసుకొని చేసిన సినిమా. ఒక హస్బెండ్ తన వైఫ్ కు కావలసినంత టైం ఇవ్వకుంటే, తిరిగి అదే పని తన వైఫ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందనేదే సినిమా కథ.
సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ అయిన క్రిష్ ( దినేష్), సీత (డాక్టర్ రోజా భారతి) ని చూసిన తొలిచూపులోనే ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. ఆ తరువాత ఉద్యోగ రిత్యా
సిటీ కి వస్తారు. ఆ తరువాత క్రిష్ ఆఫీస్ పనిచేసే రాధిక (రాకేష్ శర్మ) పరిచయం అవుతుంది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. రాధికా మాయలో పడిన క్రిష్ తన భార్య సీత తో టైం స్పెండ్ చేయకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. దీంతో వీరిద్దరి మనస్పర్థలు వస్తాయి. దాంతో క్రిష్ కు తెలియకుండా సీత ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తో వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి. క్రిష్ రాధిక కు దగ్గరవుతాడా, సీత కు దగ్గరవుతాడా అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి సీత ప్రయాణం కృష్ణ తో సినిమా చూడాల్సిందే..
నటీ నటుల పనితీరు
హీరో గా క్రిష్ పాత్రలో నటించిన దినేష్ తనకిది మొదటి సినిమా అయినా ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్ లో ఇలా అన్ని పాత్రలలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లా చాలా బాగా నటించాడు.హీరోయిన్ గా సీత పాత్రలో నటించిన డాక్టర్ రోజా భారతి ఆన్ స్క్రీన్ మీద ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే ఎక్కువగా నటించడమే కాకుండా తన అందంతో, ఆ భినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్ హీరోయిన్ గా రాధిక పాత్రలో నటించిన రాకేష్ శర్మ కొత్త అమ్మాయి అయినా చాలా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ గా నటించిన సుమంత్ తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు.ఇంకా ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలలో నటించి మెప్పించారని చెప్పచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు
సినిమా చూస్తుంటే మీ మీ లైఫ్ లో జరిగిన మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగిన చిన్న చిన్న సంఘటనలన్నీ మీకు గుర్తొస్తాయి. మీరు చేసిన ఏ చిన్న మిస్టేక్ ఉన్నా మీరు స్క్రీన్ మీద మీకు మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉండడమే కాకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే నవ్వుకుంటారు. సంగీత దర్శకుడు శర్వణ వాసుదేవన్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. డిఓపి రవీంద్ర కెమెరా వర్క్ వర్క్ విషయానికి వస్తే స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా చూపించారు. విశ్వనాథ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది.ఖుషి టాకీస్ పై డా. రాజీవ్, డా. రోజా భారతి లు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా సీత ప్రయాణం కృష్ణ తో సినిమాను నమ్మి థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని కచ్చితంగా చెప్పచ్చు.
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం, సంగీతం, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్ :
విజువల్ క్వాలిటీ, డబ్బింగ్.
రేటింగ్ :3/5
