మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
చెలరేగిపోయిన ‘దే’వర
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన సినిమా “దేవర”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు (27.9.2024) విడుదలయ్యింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చుతుందా… అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుందా అనే అనుమానం అందరిలో ఉంది.
సినిమా విడుదల తర్వాత… చాలా బాగుంది… యావరేజ్… అబౌవ్ యావరేజ్… ఒకసారి సినిమాని చూసి ఆస్వాదించవచ్చు… ఎన్టీఆర్ ఇరగదీసాడు… అనే టాక్ వినబడుతోంది. ఏదేమైనా…
సినిమా చూసిన తర్వాత మాత్రం యునానిమస్ గా దేవర గా, వర గా ఎన్టీఆర్ చెలరేగిపోయాడు. మరోసారి తన విశ్వరూపాన్ని వెండితెరపై ఆవిష్కరించాడు అని చెప్పక తప్పదు. కొరటాల శివ తనదైన శైలిలో ఈ సినిమాని చక్కగా తెరకెక్కించారు. చిన్న మెసేజ్ ఇస్తూనే, దేవర పాత్రను మలిచిన విధానం సూపర్బ్ అని చెప్పాలి. ఈ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయిన వైనం ప్రతి ఒక్కరి చేత వావ్ అనిపిస్తుంది. భైరవ గా సైఫ్ అలీఖాన్ నటన బాగుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పాత్రలు బాగున్నాయి. హీరోయిన్ గా జాన్వి కపూర్ బాగుంది. అయితే స్ర్కీన్ స్పేస్ చాలా తక్కువ. రెండు, మూడు సీన్లు… పాటలకు మాత్రమే పరిమితమవ్వడం నిరాశపరుస్తుంది.
ఇక మ్యూజిక్ సమకూర్చిన అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడని చెప్పాల్సిందే. ప్రతి సీన్ ఎలివేట్ అవ్వడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యింది. ఎమోషన్ సీన్స్ ని బాగా ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వర్క్ చాలా బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా, సింఫుల్ గా చాలా బాగున్నాయి.
ఓవరాల్ గా “దేవర” ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు… ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.