Ram Gopal Varma Launches First Glimpse Of Jangaa… Unveiling A

Dear Astronaut Felt Very Refreshing – Sekhar Kammula
Sensible director Sekhar Kammula has praised the upcoming film ‘Dear Astronaut’, stating that i
The recently released song ‘Aare Aare’, composed by music director Karthik B. Kodakandla, has received a great response. Backed by soulful music and a strong narrative, the film is scheduled for a worldwide theatrical release on November 20.
Technical Team:
Banners: Yuvan Krishna Entertainments & Manaswini Bhagyaraja
Written & Directed by: Karthik Bhagyaraj
Music: Karthik B. Kodakandla
Editor: Marthand K. Venkatesh
PRO: T. Pavan Kumar
Digital PRO: Vamsi Krishna (Cine Digital)
డియర్ ఆస్ట్రోనాట్ సినిమా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది, ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుంది – సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
యువన్కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రంలో సౌమిత్, శ్రేయసి సేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇటీవల సంగీత దర్శకుడు కార్తీక్ బి కొడకండ్ల కంపోజ్ చేసిన ఆరె ఆరె పాట విడుదలై మంచి స్పందన లభించింది. అద్భుతమైన పాటలు, మంచి కథ, కథనం తో నిర్మించబడిన ఈ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల వీక్షించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో..
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమా చూశాను. ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. చాలా రోజులకు మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఈ చిత్రంలో పాప జర్నీ అందరికీ స్ఫూర్తిలా ఉంటుంది. డైరక్టర్ కార్తీక్ గొప్పగా తెరకెక్కించారు. మూవీలో పాప జర్నీలా డైరక్టర్ కార్తీక్ జర్నీ అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ అందరికీ నచ్చుతుందని, ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
నటీనటులు : సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు
టెక్నికల్ టీం
బ్యానర్స్ : యువన్కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ & మనస్విని భాగ్యరాజా
రచన & దర్శకత్వం: కార్తీక్ భాగ్యరాజా
మ్యూజిక్ : కార్తీక్ బి కొడకండ్ల
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పి ఆర్ ఓ : టి పవన్ కుమార్
డిజిటల్ పి ఆర్ ఓ – వంశి కృష్ణ (సినీ డిజిటల్ )
