15 దేశాల్లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా బాల 369 – విజయ్ కుమార్

15 దేశాల్లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా బాల 369 – విజయ్ కుమార్ కలివరపు
‘జయమ్మ పంచాయితీ’ ఫేం విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఆర్విన్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఆర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్‌ను మీడియా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 15 దేశాల్లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇది. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. తెలుగు సాహిత్యంలో ఉన్న ఒక పద్యాన్ని ఆధారంగా చేసుకుని కథను రాశాను. సినిమా చూసిన తర్వాత మీరు గొప్ప అనుభూతిని పొందుతారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి నా టీమ్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. మీడియా వారికి ముందుగానే ఈ సినిమా ప్రీమియర్ వేస్తాము. కచ్చితంగా మీరందరూ సినిమాను ఇష్టపడతారు. మేము ఈ సినిమా కోసం ప్రతి దేశం తిరిగాం. ఎక్కడా కూడా VFX ఉపయోగించలేదు. కథ ప్రకారం బిలీవబుల్‌గా ఉండడానికి అన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఈ సినిమా కంటెంట్ నచ్చి వైవా హర్ష గారు ప్రజెంట్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో వైవా హర్ష గారు చాలా మంచి పాత్ర కూడా చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్‌కు థాంక్యూ.
హీరో ఆర్విన్ తేజ్ మాట్లాడుతూ.. “ఫస్ట్ టైమ్ హీరోగా చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు తీయగలను. ‘బాల 369’ చాలా మంచి సినిమా. హర్ష గారు ప్రజెంట్ చేయడం మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. నటీనటులందరికీ, టెక్నీషియన్స్‌కి థాంక్యూ. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా ద్వారా నటుడిగా నాకు మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను.”
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భవన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాని అన్ని రియల్ లొకేషన్స్‌లో తీశాం. విజయ్ గారు ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ‘జయమ్మ పంచాయితీ’ని ఎంత అద్భుతంగా తీశారో మనందరికీ తెలుసు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్మకం ఉంది.”
లైన్ ప్రొడ్యూసర్ జితేంద్ర మాట్లాడుతూ.. “ఆలీ గారి ‘యమలీల’ సినిమా ఎంత క్లాసిక్ అయిందో, ఇప్పుడు ‘బాల 369’ కూడా అంత క్లాసిక్ సినిమా కాబోతోంది. నవంబర్ 27న అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.”
నటుడు త్రినాధ్ మాట్లాడుతూ.. “చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా ఉంది. విజయ్ గారు ‘జయమ్మ పంచాయితీ’తో ఎంత మంచి సినిమాను అందించారో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా దానికి పూర్తి భిన్నంగా ఉండబోతుంది. ఈ సినిమాకు కథే బలం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా విజయ్ గారికి, అందరికీ థాంక్యూ సో మచ్.”
నటి హిమ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. చాలా మంచి ఫన్ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ‘జయమ్మ పంచాయితీ’ తీసిన డైరెక్టర్ గారు ఈ సినిమాను కూడా అద్భుతంగా తీశారు. కచ్చితంగా మీరందరూ నవంబర్ 27న థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.”
నటీనటులు: ఆర్విన్ తేజ్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సమీరా భరద్వాజ్ జీవన్, మిర్చి కిరణ్, స్నేహల్ కామత్, గణేష్ యాదవ్, మీశాల తనూజ, తెనాలి శకుంతల.
రచన, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు
బ్యానర్: ఆర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్: విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య
డీవోపీ: అనుష్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్: డా. శాండీ సి. ఆనంద్
ఎడిటర్: కార్తికేయన్ రోహిణి
