
ఆకాశంలో ఒక తార మోడర్న్ క్లాసిక్ మూవీగా నిలిచిపోతుంది – మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ ఏడాది వరుసగా విజయాలు అందుకోవడం ఎలా అనిపిస్తోంది?
– ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. అలాగే ‘ఇరుముడి’ జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో వస్తున్నాం. ఇది చాలా బ్యూటిఫుల్ సినిమా. ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. ఇదొక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్.
– ‘లక్కీ భాస్కర్’ తర్వాత దుల్కర్ ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. కచ్చితంగా ఈ సినిమాకు చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయని నమ్ముతున్నాను. కమర్షియల్గానూ అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది. ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు సినిమాలో ఒక గొప్ప సినిమాగా నిలుస్తుందని నాకు నమ్మకం ఉంది.
ఈ సినిమా కోసం మ్యూజిక్ ఎలా ఉండబోతుంది?
– ఇది ఎమోషనల్ ఫిల్మ్. అలాగే చాలా మోటివేషనల్గా ఉంటుంది. ఈ సినిమాకు ఒక స్పెషల్ మ్యూజికల్ టచ్ కావాలని ప్రత్యేకంగా మ్యూజిక్ చేశాం. ఈ సినిమా మ్యూజిక్ చాలా ఐకానిక్‌గా ఉండబోతోంది.
– హాలీవుడ్లో చాలా ఇన్స్పిరేషనల్ సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ పరంగా ఎలాంటి భావోద్వేగం కలుగుతుందో, మన ఇండియన్ మ్యూజిక్‌లోనే అలాంటి ఫీల్ తీసుకొచ్చేలా ఈ సినిమా కోసం మ్యూజిక్ చేశాను. ఇందులో కొన్ని స్పెషల్ సింథసైజర్స్ను ఉపయోగించాం. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సౌండ్‌ను క్రియేట్ చేశాం. దీనికి ఒక స్పెషల్ సౌండ్ జోన్ ఉంది. అది ఈ కథకు, సినిమాకు చాలా యూనిక్‌గా ఉండబోతోంది.
సాంగ్స్‌కు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఎంత ప్రాధాన్యత ఉంది?
– ఈ సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి . ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శ్రుతి హాసన్‌తో ఒక పాట పాడించాం. అది త్వరలోనే రిలీజ్ కాబోతోంది. తను అద్భుతంగా పాడారు.
మ్యూజిక్, నటన.. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
– నేను రెండు నెలల ముందే మొత్తం ప్లాన్ చేసుకుంటాను. నెలలో 15 రోజులు మ్యూజిక్కు, మరో 15 రోజులు నటనకు కేటాయిస్తాను. నా షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఒక సినిమాకు మ్యూజిక్ చేస్తున్నప్పుడు పూర్తిగా ఆ సినిమా మ్యూజిక్‌పైనే నా దృష్టి ఉంటుంది. రెండు నెలల ముందే ఈ ప్లానింగ్ అంతా జరిగిపోతుంది.
జనవరి 12న విడుదల సినిమా రికార్డింగ్ ఇప్పటికే మొదలుపెట్టేశాను. సినిమా విషయంలో, అవుట్‌పుట్ విషయంలో నా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనుకున్న సమయానికి నా వర్క్ పూర్తిచేసి ఇచ్చేస్తాను.
– ‘ఆకాశంలో ఒక తార’ రికార్డింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా మ్యూజిక్ చాలా క్వాలిటీతో ఉంటుంది.
‘ఆకాశంలో ఒక తార’ ఒక మోడరన్ క్లాసిక్ సినిమా. ప్రేక్షకులకు గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ఈ మధ్య మీరు ఎక్కువగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టుగా ఉంది?
– ప్రత్యేకంగా అలా ఏమీ లేదు. నేను చేస్తున్న తెలుగు సినిమాలన్నీ చాలా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ‘లక్కీ భాస్కర్’, ‘ఇరుముడి’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇలా వరుస విజయాలు రావడంతో ఆటోమేటిక్‌గా అవకాశాలు కూడా పెరుగుతాయి.
– తెలుగు పరిశ్రమ ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఇక్కడి దర్శకులు చాలా కొత్త జానర్స్‌ను ప్రయత్నిస్తున్నారు. ఇది సినిమాకు, పరిశ్రమకు రెండింటికీ చాలా మంచిది. దాని ద్వారా చాలా కొత్త మ్యూజిక్ వస్తోంది.
మీకు ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా?
– ‘ఇరుముడి’ లాంటి సినిమా చేయడం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ కూడా చాలా మంచి సంతృప్తిని ఇచ్చింది. నాకు మంచి కథ వస్తే చాలు.
‘ఆకాశంలో ఒక తార’ ఎలా ఉండబోతోంది?
– సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇది. ప్రతి మహిళ ఇష్టపడే సినిమా అవుతుంది.
నిర్మాతల గురించి?
– ఈ మ్యూజిక్ జర్నీలో స్వప్న గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఇది చాలా బ్యూటిఫుల్ సినిమా. ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇదొక మోడర్న్ డే క్లాసిక్ అవుతుంది.
నటుడిగా చేయబోతున్న సినిమాలు?
– ఫిబ్రవరిలో ఒక సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే సెల్వ రాఘవన్ గారి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను.
ప్రస్తుతం మ్యూజిక్ చేస్తున్న సినిమాలు?
– సిద్దు జొన్నలగడ్డ గారి సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాను. అలాగే అనిల్ రావిపూడి గారి ‘జనవరి 12’ సినిమాకు, దుల్కర్ గారి ‘శ్రీశ్రీ’ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నాను.
ఆల్ ది బెస్ట్!
– థాంక్యూ!
