ఇట్లు అర్జున లో యూత్‌ఫుల్ క్యారెక్టర్ చేశాను. ప్రతి అమ్మాయి కీర్తి క్యారెక్టర్‌కు

ఇట్లు అర్జున లో యూత్‌ఫుల్ క్యారెక్టర్ చేశాను. ప్రతి అమ్మాయి కీర్తి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది – అనస్వర రాజన్
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇట్లు అర్జున్ మీరు తెలుగులో సైన్ చేసిన ఫస్ట్ సినిమా అని విన్నాం. ఇందులో కీర్తి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-తెలుగులో నేను ఫస్ట్ సైన్ చేసిన సినిమా ‘ఇట్లు అర్జున’. కాకపోతే ‘ఛాంపియన్’ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది.
– ఇట్లు అర్జున్ లో చేసిన కీర్తి క్యారెక్టర్ చాలా యూత్‌ఫుల్ అండ్ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. ప్రతి అమ్మాయి కీర్తి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కథ విన్నప్పుడు కూడా నేను కీర్తి క్యారెక్టర్‌తో చాలా కనెక్ట్ అయ్యాను. ఈ క్యారెక్టర్‌ను ప్లే చేయడంలో చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
ఇందులో హీరోకి మాటలు ఉండవు కదా! మీరు కలిసి నటించేటప్పుడు ఎలా ఉండేది?
-నాకు కథలో ఆకర్షించిన విషయాల్లో అది ఒకటి. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా కోసం నేను, అనీష్ కలిసి వర్క్ షాప్స్ చేశాం. సీన్స్ సీన్స్ ను చాలా ప్రాక్టీస్ చేశాం. మా ఇద్దరి క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చాయి.
ఇందులో ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుందని విన్నాను?
‘ఇట్లు అర్జున’లో మెయిన్ కోర్ ప్రేమకథ. ఇందులో అర్జున్ క్యారెక్టర్‌కు మాటలు రావు. తను ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అర్జున్, కీర్తి పాత్రని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు.
డైరెక్టర్ గురించి చెప్పండి?
ఈ సినిమా చేయడానికి ఒక కారణం డైరెక్టర్ మహేష్ గారు. ఆయన విజన్ నాకు చాలా నచ్చింది. అర్జున్, కీర్తి క్యారెక్టర్స్‌ను అద్భుతంగా రాసుకున్నారు. అది నాకు చాలా నచ్చింది. కీర్తి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది. ఆయన ఏం చెప్తే అది ఫాలో అయిపోయాను. చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశాం.
అనీష్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-హీరోగా అనీష్‌కు ఇది ఫస్ట్ సినిమా. తొలి సినిమాకే ఒక మూగవాడి పాత్ర చేయడం చాలా డేరింగ్ అండ్ రిస్కీ. ఈ విషయంలో తనని అభినందిస్తున్నాను. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కచ్చితంగా ఆడియన్స్ తనని ఇష్టపడతారు. ఇది చాలా కొత్త కథ, ఫ్రెష్ క్యారెక్టర్. ఆ పాత్రకు అనీష్ పూర్తి న్యాయం చేశాడు. తను యాక్షన్, డ్యాన్స్ కూడా అద్భుతంగా చేశాడు.
నాగార్జున గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయడం ఎలా అనిపించింది?
-నాగార్జున గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది నేను తెలుగులో సైన్ చేసిన తొలి సినిమా. అలాగే అనీష్ హీరోగా చేస్తున్న తొలి సినిమా. వెంకీ గారు నిర్మాతగా నిర్మిస్తున్న తొలి సినిమా. నాగార్జున గారు ప్రజెంట్ చేయడం అనేది మా అందరికీ చాలా మెమొరబుల్. మాకు మరింత నమ్మకాన్ని ఇచ్చింది.
వెంకీ కుడుముల గారి గురించి?
వెంకీ గారు స్వయంగా ఒక దర్శకుడు. ఆయన ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. చాలా మంచి వ్యక్తి. ఆయన నిర్మిస్తున్న తొలి సినిమా ఇది. మాకు చాలా మంచి సపోర్ట్ చేశారు.
తమన్ మ్యూజిక్ గురించి?
-తమన్ గారు చాలా హ్యాపీ పర్సన్. ఆయనతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రమోషన్స్‌లో కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇందులో మూడు పాటలకు కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన మ్యూజిక్ సినిమాకి మరింత బూస్ట్ ఇచ్చింది. ఆయనతో కలిసి వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
తెలుగులో వరుసగా పెద్ద అవకాశాలు రావడం ఎలా అనిపిస్తుంది?
-చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి ‘కాకా’, రవితేజ గారి ‘తులాభారం’, అలాగే సంగీత్ శోభన్ సినిమాలో నటిస్తున్నాను. అన్నీ కూడా చాలా అద్భుతమైన కథలు, పాత్రలు. ఇలాంటి మంచి సినిమాల్లో భాగం కావడం ఆనందంగా ఉంది. నాకు మంచి కథలు చేయడం పైనే దృష్టి ఉంటుంది.
-కాకాలో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ప్రౌడ్‌గా ఉంది. చిరంజీవి గారు వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ యాక్టర్. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
‘ఇట్లు అర్జున’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?
-ఇందులో చాలా ఎమోషన్స్ ఉంటాయి. యాక్షన్, లవ్ స్టోరీ, సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాని అందరూ ఇష్టపడతారని నమ్ముతున్నాను. దీపావళిని ఇట్లు అర్జున్ సక్సెస్ తో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ
