ఈఎన్ఈ రిపీట్ తరుణ్ ప్రాణం పెట్టి చేశారు.. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో కన్నీళ్లు

ఈఎన్ఈ రిపీట్ తరుణ్ ప్రాణం పెట్టి చేశారు.. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో కన్నీళ్లు పెడతారు – హీరో విశ్వక్ సేన్
ఈ నగరానికి ఏమైంది’ సినిమాలోని క్రేజీ గ్యాంగ్ మళ్లీ కలుసుకోబోతున్న సమయం ఆసన్నమైయింది. ఈ కల్ట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఈఎన్ఈ రిపీట్’ నవంబర్ 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ ధాస్యం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి కలిసి నటిస్తున్నారు. ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
మొదటి పార్ట్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ కథ మొదలవుతుంది. వివేక్, తన స్నేహితుల గ్యాంగ్‌తో కలిసి ఒక వైల్డ్ సర్వైవల్ ఫిల్మ్ తీయడానికి బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో ఆ గ్యాంగ్‌కు వరుసగా ఎన్నో క్రేజీ, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. గందరగోళం, ఉత్సాహంతో నిండిన ఒక ఎంటర్టైనింగ్ జర్నీని ఈ సినిమా అందించబోతోందనే హింట్ ఇచ్చింది.
తరుణ్ భాస్కర్ ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. కథనాన్ని చాలా ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా ప్రజెంట్ చేశారు. ఫన్, మ్యాడ్నెస్, థ్రిల్స్‌తో పాటు తరుణ్ భాస్కర్ మార్క్ క్విర్కీ డైలాగ్స్ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
ఈ సినిమాలో అందరికీ ఎంతో ఇష్టమైన ENE గ్యాంగ్ తిరిగి రావడం బిగ్గెస్ట్ హైలైట్. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్, కౌశిక్‌గా అభినవ్ గోమఠం, ఉప్పుగా వెంకటేష్ కాకుమాను, కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి మరోసారి కనిపించనున్నారు. ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నీ మళ్లీ ఒక్కచోట చేరి తమ మధ్య ఉన్న స్నేహాన్ని, కామెడీని తెరపై పంచుకోవడం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. ట్రైలర్లో అనీషా అంబ్రోస్ కూడా కనిపించారు.
సీక్వెల్లో మరింత ఆసక్తిని పెంచేందుకు కొన్ని కొత్త పాత్రలను కూడా పరిచయం చేస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్, ప్రియదర్శిని రామ్ కొత్తగా ఈ సినిమాలో చేరారు. వీరి పాత్రలు కథకు మరింత కొత్తదనాన్ని తీసుకురానున్నాయి. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
టెక్నికల్‌గా సినిమాటోగ్రాఫర్ ఏజే ఆరోన్ తన అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అదిరిపోయే, ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కథలోని మ్యాడ్నెస్ను మరింత పెంచేలా ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మొత్తంగా ‘ENE Repeat’ ఒరిజినల్ సినిమాలోని స్పిరిట్‌ను తిరిగి తీసుకొస్తూనే, కొత్త తరహా మ్యాడ్నెస్, నోస్టాల్జియా, డ్రామా, ప్రేక్షకులు మొదటి పార్ట్‌లో ఇష్టపడిన అన్ని అంశాలతో రూపొందిన మంచి ఎంటర్టైనర్లా కనిపిస్తోంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా ఒరిజినల్ సినిమాను ఇష్టపడే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ENE Repeat’ ఒకటిగా నిలవనుంది.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు విజయం తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నా చుట్టూ ఎప్పుడూ నలుగురు స్నేహితులు నన్ను అంటిపెట్టుకుని ఉండేవారు. అలాంటి ఫ్రెండ్షిప్ గురించి సినిమా చేస్తే బాగుంటుందని చేసిన సినిమానే ఈ నగరానికి ఏమైంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నప్పుడు కూడా మా కాంపిటీషన్ మళ్లీ ఆడియన్సే. ప్రేక్షకుల అంచనాల గురించే నాకు భయం ఉంది. దీనికి ఎలాంటి ట్రైలర్ కట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఒక ఎపిక్ వెర్షన్‌లా ఉండాలని రూపొందించిన ట్రైలర్ ఇది. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో చేసిన సినిమా ఇది. ఆ పాజిటివ్ ఎనర్జీ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. మీరందరూ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా రండి. థియేటర్లలో చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికి వెళ్లినా సరే, ఈ నగరానికి ఏమైంది 2 ఎప్పుడు వస్తుందని అడుగుతుండేవారు. మీ అందరికీ ఆ ప్రేమను తిరిగి ఇవ్వడానికి వచ్చాను. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. కచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టైమ్ ఎంత బాగుందంటే, స్క్రీన్ నంబర్ 2లో నా సినిమా నడుస్తోంది. స్క్రీన్ నంబర్ 4లో నా నెక్స్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ అవుతోంది. ఈ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా ఒక అద్భుతంలా అనిపించింది. నవంబర్ 19న నా సినిమా రిలీజ్ అవుతుంది. చాలా గర్వంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పుకునే సినిమా ఇది. తరుణ్ ప్రాణం పెట్టి సినిమా చేశారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో ఏడుస్తారు. సినిమాలో చాలా జరుగుతాయి. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు.
శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాన్‌స్టాప్‌గా గూస్బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నగరానికి ఏమైంది సినిమా చూసినప్పుడు ఒక నటుడిగా కచ్చితంగా ఇలాంటి సినిమాల్లో భాగం కావాలనిపించింది. ఇందులో భాగం కావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది.కచ్చితంగా ఇది ఒక మంచి ఫన్ రైడ్. ఈ సినిమా కోసం నన్ను రిఫర్ చేసిన విశ్వక్ గారికి కృతజ్ఞతలు. తరుణ్ భాస్కర్ గారు నన్ను ఎంతగానో నమ్మారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నవంబర్ 19న థియేటర్స్‌లో కలుద్దాం.
అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ఈ సినిమాను మీ అందరి ప్రేమ కోసం చేశాం. ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆ సినిమా తర్వాత ఎంతగానో అభిమానించారు. మీ అందరి ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ నగరానికి ఏమైంది ఫ్యాన్స్‌ను మరొకసారి మెప్పించడం అంత ఈజీ కాదు. తరుణ్ చాలా అద్భుతమైన కథ రాశారు. చాలా నిజాయితీగా తీశారు. మీ అందరి ఎదురుచూపులకు తగిన సినిమా వస్తోంది. మీరందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.
వెంకటేష్ కాకుమాను మాట్లాడుతూ.. ఈ నగరానికి ఏమైంది సినిమాకు మీరు ఎంతో ప్రేమను చూపించారు. అదే ఇంటెన్షన్‌తో ఇప్పుడు ఈ సినిమాకు పని చేశాను. మరొకసారి అందరితో కలిసి నటించడం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నవంబర్ 19న అందరం థియేటర్స్‌లో కలుద్దాం.
అనిషా మాట్లాడుతూ.. మనందరికీ సినిమా అనేది ఒక ఎమోషన్. ఈ నగరానికి ఏమైంది కూడా మనందరిలో ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది. తప్పకుండా ఈ పార్ట్ 2 కూడా మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
శివాత్మిక మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్ గారికి చాలా థ్యాంక్స్. ఆయనకు నేను అభిమానిని. నాకు ఈ నగరానికి ఏమైంది సినిమా చాలా ఇష్టం. ఇప్పుడు పార్ట్ 2లో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.
నిర్మాత సృజన మాట్లాడుతూ…ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ఈసారి మీరు మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మీ పేరెంట్స్‌ను కూడా థియేటర్స్‌కు తీసుకొస్తారు. అది నా గ్యారెంటీ. ఇది తరుణ్ భాస్కర్ సినిమాకి ఫ్రెండ్షిప్ కు రాసిన ఒక లవ్ లెటర్. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
నటీనటులు: విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను
టెక్నికల్ :
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి
ప్రొడక్షన్ హౌసెస్: ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
కో-డైరెక్టర్: ఉపేంద్ర వర్మ
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సౌమిత్రి ఎన్
లైన్ ప్రొడ్యూసర్: శ్రీను ఇర్ల
మార్కెటింగ్ & మోషన్ పోస్టర్: వాల్స్ & ట్రెండ్స్
పీఆర్ఓ: వంశీ-శేఖర్
