Vijay Shankar, Siri Chowdary and Khayyum Starrer Mr Deyyam Launched

Team Kalki 2898 AD Sequel Wishes Rebel Star Prabhas – Welcoming Bhairava Back To The Sets
Following the phenomenal success of Rebel Star Prabhas-starrer Kalki 2898 AD, expectations are sky-high for its sequel, which promises to take the futuristic mythological universe to an even grander level. Helmed by visionary filmmaker Nag Ashwin, the ambitious project is being produced by Ashwini Dutt under the prestigious Vyjayanthi Movies banner.
Celebrating the charisma of The Superhero Of Indian Cinema and Darling Of Every Generation – Prabhas, the makers of the movie have unveiled a special behind-the-scenes glimpse, offering fans and movie buffs a sneak peek into the film’s sets and the much-awaited return of Bhairava.
The video captures the team gearing up for the shoot, with the production crew making the necessary arrangements before Prabhas steps onto the sets in his character’s distinctive look. The moment director Nag Ashwin calls “Action” marks the exciting return of Prabhas as Bhairava, bringing back the character that audiences embraced in the blockbuster first instalment.
Amitabh Bachchan and Kamal Haasan play prominent roles in this much-anticipated sequel. The original film not only emerged as a massive box-office success but also earned widespread appreciation and two National Awards, further strengthening the franchise’s legacy.
With extensive groundwork underway, the sequel is gearing up to enter its regular shooting phase.
With Nag Ashwin preparing to expand the scale and scope of this cinematic universe, the next chapter of Kalki 2898 AD is shaping up to be one of the most eagerly awaited Indian film spectacles. The latest BTS glimpse has further heightened the excitement surrounding the project.
ఇండియన్ సినిమా సూపర్‌హీరో, ప్రతి జనరేషన్‌కు డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ టీమ్ బర్త్‌డే విషెస్.. భైరవగా సెట్స్‌లో అడుగుపెట్టిన ప్రభాస్- స్పెషల్ బీటీఎస్ గ్లింప్స్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యూచర్, పురాణాల కలయికతో రూపొందిన ఈ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేలా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. విజనరీ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇండియన్ సినిమా సూపర్‌హీరో, ప్రతి జనరేషన్‌కు డార్లింగ్ అయిన ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేకమైన బీటీఎస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా సెట్స్‌లోని వాతావరణాన్ని, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భైరవ పాత్రలో ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెట్టిన మూమెంట్స్ చూపించారు.
షూటింగ్‌కు చిత్రబృందం సిద్ధమవుతున్న విజువల్స్ తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ప్రభాస్ తన ప్రత్యేకమైన భైరవ లుక్‌లో సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి ముందు ప్రొడక్షన్ టీమ్ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ‘యాక్షన్’ అని చెప్పగానే భైరవగా ప్రభాస్ కెమెరా ముందుకు వస్తారు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మొదటి భాగంలో ప్రేక్షకుల ఆదరణ పొందిన భైరవ పాత్రను మరోసారి వెండితెరపై చూసేందుకు ఈ గ్లింప్స్ అంచనాలు పెంచుతోంది.
ఈ భారీ సీక్వెల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుని ‘కల్కి 2898 ఏడీ’ ఫ్రాంచైజీ ప్రత్యేకతను మరింత పెంచింది.
సీక్వెల్ కోసం భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
నాగ్ అశ్విన్ ఈ సినిమాటిక్ యూనివర్స్ స్కేల్, స్థాయిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతుండటంతో ‘కల్కి 2′ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన బీటీఎస్ గ్లింప్స్‌తో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి.
