Rakesh Varre’s Maya Lady Set for a Grand Worldwide Theatrical

Harish Shankar Praises Naa Wife Missing
The aha OTT platform, known for bringing engaging content to its subscribers, has unveiled another interesting original, Naa Wife Missing, starring Varun Sandesh and Swetha Basu Prasad in the lead roles. The film is now streaming on aha in both Telugu and Tamil. Produced by Siva Kanthamneni under the Lighthouse Cine Magic banner, the film is directed by Swathi Prakash Mantripragada. The makers held a grand premiere and press meet in Hyderabad, with popular director Harish Shankar attending as the chief guest.
Speaking at the event, cinematographer N.S. Satish Kumar expressed his happiness at continuing his association with aha and working on the project. aha Content Head Kavitha said Naa Wife Missing was a special project for the platform and revealed that Varun Sandesh and Swetha Basu Prasad were considered for the lead roles during the scripting stage itself. Actress Satya Sri, who plays a constable, thanked the director for taking care of every detail. Music director Sai Karthik said the combination of Varun and Swetha made the project even more exciting and expressed hope that audiences would enjoy the film.
Director Swathi Prakash Mantripragada thanked the producers and aha for trusting her with the project. She revealed that the premiere received such an enthusiastic response that there were not enough seats for the team to sit comfortably. Senior actor Murali Mohan appreciated the film’s title and praised the growing presence of women directors in the industry. Producer Siva Kanthamneni said the project was completed within the planned schedule and thanked the cast, crew and aha team for their support. Swetha Basu Prasad described the role of Swapna as an exciting opportunity and expressed happiness at reuniting with Varun Sandesh after several years.
Varun Sandesh said he agreed to the film because of his trust in director Swathi and was delighted to work with Swetha again. He also highlighted the importance of mutual trust in relationships, which forms a key theme of the film. Harish Shankar praised the team, saying Naa Wife Missing was a film that audiences across different age groups could watch and enjoy together. He also expressed confidence in Swathi Prakash’s directorial abilities and announced that he planned to produce an OTT project with her as director, with further details to be revealed later. He encouraged audiences to watch and enjoy Naa Wife Missing on aha.
Cast: Varun Sandesh, Swetha Basu Prasad, Praveen, Satya Sri and others.
Technical Crew:
* Director: Swathi Prakash Mantripragada
* Story: Umarji Anuradha
* Created By: Srinivas Mandala
* Cinematography: N.S. Satish Kumar
* Music: Sai Karthik
* Editor: Sai Babu Talari
* Producer: Siva Kanthamneni
* Banner: Lighthouse Cine Magic
* PRO: Suresh (SK Media)
“నా వైఫ్ మిస్సింగ్” సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఈ సినిమా డైరెక్టర్ స్వాతిప్రకాష్ తో ఒక ఓటీటీ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేస్తాను – ప్రీమియర్ ప్రెస్ మీట్ లో పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్
ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్” నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులోకి వచ్చింది. “నా వైఫ్ మిస్సింగ్” సిరీస్ ను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. ఈ రోజు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ అతిథిగా ఈ చిత్ర ప్రీమియర్, ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డీవోపీ సతీష్ మాట్లాడుతూ – ఆహా ఓటీటీతో నా అసోసియేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. వరుణ్ సందేశ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. శ్వేత సింగిల్ టేక్ ఆర్టిస్ట్. బ్యూటిఫుల్ విజువల్స్ ను ఈ సినిమాలో చూస్తారు. నాకు సపోర్ట్ అందించిన మా డీవోపీ టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ – “నా వైఫ్ మిస్సింగ్” మూవీ మా ఆహాకు ఎంతో స్పెషల్ ప్రాజెక్ట్. ఈ సినిమా చూశాక మనమంతా ఇంకా బాలు, స్వప్న ఎమోషన్స్ లోనే ఉండిపోయాం. ఈ సినిమా స్క్రిప్ట్ సమయంలోనే వరుణ్, శ్వేత లీడ్ రోల్స్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. కొత్త బంగారులోకం మనందరికీ స్పెషల్. ఆ జంటను ఈ సినిమాతో మరోసారి మీ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. అన్నారు.
నటి సత్య శ్రీ మాట్లాడుతూ – “నా వైఫ్ మిస్సింగ్” సినిమాలో నేను కానిస్టేబుల్ క్యారెక్టర్ లో నటించాను. నా క్యారెక్టర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ స్వాతి ప్రతి విషయంలో కేర్ తీసుకుని ఈ మూవీని మీ అందరికీ నచ్చేలా రూపొందించారు. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ – ఆహాలో నా మొదటి ప్రాజెక్ట్ ఇది. వరుణ్, శ్వేత జోడి అనగానే మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమాలో బాలుకు మళ్లీ స్వప్న మిస్ అవుతుంది. కొత్తబంగారు లోకంలో ప్రేమికురాలు అయితే ఈ సారి భార్య. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ స్వాతికి కంగ్రాట్స్. ఆహాలో మీరంతా చూడండి. ఈ సినిమాకు మంచి రిటర్స్న్ రావాలి. మరిన్ని ప్రాజెక్ట్స్ ఆహాకు మేమంతా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ – ఈ బ్యానర్ తో మాకు మంచి అనుబంధం ఉంది. వాళ్లు ఏ ప్రాజెక్ట్ చేసినా నేను ఉంటాను. ఈ ఈవెంట్ గురించి చెప్పగానే వచ్చాను. నేను సినిమా చూడకున్నా, చూసిన వాళ్లు చాలా బాగుందని చెబుతున్నారు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
డైరక్టర్ స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ మాట్లాడుతూ – ఈ రోజు మా “నా వైఫ్ మిస్సింగ్” సినిమా ప్రీమియర్ వేస్తే మాకే కూర్చోవడానికి సీట్లు లేవు. మా సినిమా పట్ల అందరూ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అనేందుకు ఇదే ప్రూఫ్. నేను ఈ సినిమాకు దర్శకత్వం వహించగలను అని నమ్మిన మా ప్రొడ్యూసర్స్ కు, అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్. వరుణ్ తో నేను చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. శ్వేత ఎంతో కోపరేట్ చేసింది. మా టీమ్ అందరి సపోర్ట్ తో ఈ సినిమా చేయగలిగాను. ఈ జర్నీలో నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ మర్చిపోలేను. ఆహాలో ఫ్యామిలీ అంతా కలిసి మా సినిమా చూడండి. అన్నారు.
సీనియర్ యాక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ – నా వైఫ్ మిస్సింగ్ సినిమా టైటిల్ తోనే ఆసక్తి కలుగుతోంది. కొత్త బంగారులోకం సినిమా జంట వరుణ్, శ్వేతా మళ్లీ ఈ సినిమాలో నటించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే సినిమా పరిశ్రమలో డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకుంటున్నారు. స్వాతిప్రకాష్ కూడా అలాగే మంచి పేరు తెచ్చుకోవాలి. శివ కంఠంనేని నా మిత్రులు. ఆయన చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ శివ కంఠంనేని మాట్లాడుతూ – నేను హీరోగా, ప్రొడ్యూసర్ గా నిర్మించిన అమరావతికి ఆహ్వానం అనే సినిమాను ఆహాలో రిలీజ్ చేశాం. అప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. నేను ప్రొడక్షన్ పరంగా బాగా చేస్తానని నమ్మి ఈ స్క్రిప్ట్ ఆహా నాకు అందించారు. వరుణ్, శ్వేతాలతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. మంచి టీమ్ మాకు కుదిరారు. వరుణ్ చాలా కోపరేట్ చేశాడు. శ్వేత సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సాయి కార్తీక్ తన మ్యూజిక్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లారు. మా స్వాతి చాలా టాలెంటెడ్, డెడికేటెడ్ డైరెక్టర్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న టైమ్ లోనే, డేస్ లోనే కంప్లీట్ చేశాం. ఈ సినిమాను మీరంతా ఆహాలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. అన్నారు.
హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మాట్లాడుతూ – “నా వైఫ్ మిస్సింగ్” సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు స్వప్న అనే క్యారెక్టర్ కు మంచి ఆర్క్ ఉంది అనిపించింది. ఇది నాకు గ్రేట్ కంబ్యాక్ అని ఫీల్ అవుతున్నా. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. స్వాతి లాంటి డెడికేటెడ్ డైరెక్టర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం నాకు కల్పించిన ఆహాకు థ్యాంక్స్ చెబుతున్నా. వరుణ్ నా సోల్ మేట్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తిరిగి రావడం నా ఇంటికి వచ్చిన ఫీల్ కలిగిస్తోంది. ఈ సినిమాను మీరు బాగా ఇష్టపడతారని నమ్ముతున్నా. అన్నారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – హరీశ్ శంకర్ గారిని కలిసి పదేళ్లవుతోంది. ఆయన ఈ రోజు మా ఈవెంట్ కు వచ్చి నా పర్ పార్మెన్స్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. మన కష్టానికి గుర్తింపు వస్తోంది అనే నమ్మకం కలుగుతోంది. స్వాతితో నేను గతంలో నయనం అనే ప్రాజెక్ట్ చేశాను. ఆమె మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా ఒప్పుకున్నాను. శ్వేతాబసుతో ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె మంచి పర్ ఫార్మర్. చిన్నప్పటి నుంచి నటిస్తోంది. నేషనల్ అవార్డ్ పొందింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏ రిలేషన్ లో అయినా పరస్పరం నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకమే బంధాన్ని నిలబెడుతుంది. సాయి కార్తీక్ తో మూడో సినిమా ఇది. మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా ప్రొడ్యూసర్ శివ కంఠంనేని మా మూవీని రాజీపడకుండా ప్రొడ్యూస్ చేశారు. ఈ అవకాశం కల్పించిన ఆహా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ – “నా వైఫ్ మిస్సింగ్” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే సినిమా. వరుణ్ సందేశ్ పర్ ఫార్మెన్స్ నాకు ఇష్టం. ఆయన గతంలో వరుసగా హిట్స్ కొట్టాడు. ఈ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. శ్వేతా బసు మరిన్ని మంచి మూవీస్ చేయాలి. ఆహాను ఒప్పించి ఒక ప్రాజెక్ట్ చేయడం కష్టం. ఈ విషయంలో “నా వైఫ్ మిస్సింగ్” టీమ్ ను అభినందిస్తున్నా. డైరెక్టర్ స్వాతి చాలా బాగా ఈ మూవీ చేసిందని విన్నాను. నేను ప్రొడ్యూసర్ గా ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేయబోతున్నా. ఆ ప్రాజెక్ట్ కు స్వాతిని డైరెక్టర్ గా తీసుకుంటాను. ఆ వివరాలు తర్వాత చెబుతా. “నా వైఫ్ మిస్సింగ్” సినిమాను నేను ఈ రోజు చూడలేకపోయా. ఖచ్చితంగా చూస్తాను. మీరు కూడా ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
నటీనటులు – వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్, ప్రవీణ్, సత్య శ్రీ, తదితరులు
టెక్నీషియన్స్
———————
ఎడిటర్ – సాయిబాబు తలారి
డీవోపీ – ఎన్.ఎస్. సతీష్ కుమార్
మ్యూజిక్ – సాయి కార్తీక్
స్టోరీ – ఉమర్జీ అనురాధ
క్రియేటెడ్ బై – శ్రీనివాస్ మండల
బ్యానర్ – లైట్ హౌస్ సినీ మ్యాజిక్
ప్రొడ్యూసర్ – శివ కంఠంనేని
డైరెక్టర్ – స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ
