కామ్రేడ్ కళ్యాణ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది – హీరో

కామ్రేడ్ కళ్యాణ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది – హీరో శ్రీ విష్ణు
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ కామ్రేడ్ కళ్యాణ్. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం..
ఇది ఒక మాస్ కామెడీ సినిమా. ఇప్పటివరకు నేను లవ్ కామెడీ ఎంటర్టైనర్స్ లాంటి జోనర్స్ చేశాను. మొదటిసారి ఈ జానర్‌ను ఎంచుకోవడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనుకునేవాడిని. కానీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కోన గారు ఈ కథ చెప్పినప్పుడే ఇది ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ అవుతుందని అనుకున్నాం. మా నమ్మకం నిజమైంది. అందరూ నన్ను ‘కామ్రేడ్’ అంటున్నారు. కానీ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ నిజమైన కామ్రేడ్లే. ఇది పక్కా దసరా పండుగ సినిమా. థియేటర్లలో జరిగే సెలబ్రేషన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ సినిమాలో నవ్వులే నవ్వులు. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను ఒక నవ్వుల పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ దసరాకు కుటుంబ సభ్యులందరూ కలిసి థియేటర్లలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్.
ప్రొడ్యూసర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ..
“అమెరికాలోని మా ఫ్రెండ్స్ నుంచి ఇటు గుంటూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం వరకు ఎక్కడ చూసినా సినిమా చాలా బాగుందని టాక్ వస్తోంది. ఈ దసరాకు శ్రీ విష్ణు గారు, కోన గారి నుంచి ప్రేక్షకులకు అందిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ సినిమా.
ప్రెజెంటర్ కోన వెంకట్ మాట్లాడుతూ..
ఈ రోజు మార్నింగ్ షో నుంచే మా ‘కామ్రేడ్ కళ్యాణ్’ జనజీవన స్రవంతిలో కలిసిపోయి ‘కామెడీ కళ్యాణ్’గా మారిపోయాడు. సినిమా చూసిన ప్రేక్షకులు ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమానా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే శ్రీ విష్ణు చేతిలో గన్స్, గ్రీన్ డ్రెస్ చూసి యాక్షన్ సినిమా అనుకున్నారు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులు చాలా ఆస్వాదిస్తున్నారు. రవితేజతో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, మహేష్ బాబుతో ‘దూకుడు’, ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’.. ఇలా నేను ఏ హీరోతో మొదటిసారి పనిచేసినా ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడం ఒక పరిపాటిగా మారింది. అదే సెంటిమెంట్ మరోసారి శ్రీ విష్ణు సినిమాతో రిపీట్ అయింది.ఇది నిజంగా పండుగ సినిమా. పండుగలాంటి సినిమా.
డైరెక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ..
“నిన్న మొన్నటి వరకు సినిమా ఎలా ఉంటుందో, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కొంత భయం ఉండేది. కానీ ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ భయం పోయింది. ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన ఎంతో ఆనందాన్నిస్తోంది. సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు”
