
#Jailer2 Trailer (Telugu) Released
The wait is over! The much-awaited trailer of Superstar Rajinikanth’s #Jailer2 is out now in Telugu, promising a high-voltage theatrical experience packed with action, attitude, humour and Nelson Dilipkumar’s trademark quirky world.
Directed by Nelson Dilipkumar, Jailer 2 brings back Rajinikanth as the iconic Muthuvel Pandian, whose larger-than-life presence and unmistakable style once again take centre stage. The trailer hints at a fresh conflict, bigger stakes and a world that looks even more expansive than its predecessor, while retaining the humour and madness that made Jailer a blockbuster.
Joining Superstar Rajinikanth is a stellar ensemble featuring S. J. Suryah, Vidya Balan, Shivarajkumar, Mohanlal, Ramya Krishnan, Yogi Babu, Suraj Venjaramoodu, Mirnaa and others. The film promises a powerful mix of action, entertainment and memorable characters, with Nelson bringing his unique flavour to this much-awaited sequel.
The technical team includes Anirudh Ravichander as the music director, Vijay Kartik Kannan as cinematographer and R. Nirmal as editor. Produced by Kalanithi Maran under Sun Pictures, Jailer 2 is gearing up for a massive worldwide theatrical release.
The excitement around Jailer 2 gets bigger in the Telugu states as Sithara Entertainments brings the film to audiences across Andhra Pradesh & Telangana in Telugu Language.
With Superstar Rajinikanth’s unmatched screen presence, Nelson Dilipkumar’s distinctive brand of entertainment and the promise of a bigger Jailer universe.
GRAND RELEASE ON OCTOBER 15TH JAILER 2’
ముత్తువేల్ పాండియన్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ రిటర్న్.. మరింత భారీగా, మరింత వైల్డ్‌గా ‘జైలర్ 2’ యాక్షన్ స్పెక్టాకిల్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ ట్రైలర్ విడుదలైంది. తెలుగులోనూ విడుదలైన ఈ ట్రైలర్ హై-వోల్టేజ్ యాక్షన్, రజనీకాంత్ స్టైల్, కామెడీ, యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన క్విర్కీ ఎంటర్టైన్మెంట్తో ‘జైలర్’ ప్రపంచాన్ని మరింత పెద్దదిగా, మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
‘జైలర్’లో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఐకానిక్ క్యారెక్టర్ ముత్తువేల్ పాండియన్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తనదైన స్టైల్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించనున్నారు. సీక్వెల్లో మరింత పెద్ద సంఘర్షణ, భారీ స్థాయి సవాళ్లు, విస్తృతమైన ప్రపంచాన్ని ట్రైలర్ పరిచయం చేస్తోంది. అదే సమయంలో ‘జైలర్’ను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టిన హ్యూమర్, మ్యాడ్నెస్, ఎంటర్టైన్మెంట్ను కూడా కొనసాగిస్తూ ‘జైలర్ 2’పై మరింత ఆసక్తిని పెంచుతోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఎస్.జె. సూర్య, విద్యా బాలన్, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, యోగిబాబు, సూరజ్ వెంజారమూడు, మిర్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్, వినోదం, గుర్తుండిపోయే పాత్రలతో ‘జైలర్ 2’ ఒక భారీ ఎంటర్టైనింగ్ యాక్షన్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఆర్. నిర్మల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్ 2’ను సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్మ్యాచ్డ్ స్క్రీన్ ప్రెజెన్స్, నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్, ‘జైలర్’ యూనివర్స్‌ను మరింత విస్తరించిన విధానం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!
