ప్యారడైజ్ సూపర్ డూపర్ హిట్ అయింది. నాని చాలా కష్టపడ్డాడు. జడలు వేసుకొని

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి – ఫహాద్ ఫాజిల్
ఫహాద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం ఫహాద్ ఫాజిల్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలివే..
- ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా చేయటానికి కారణమేంటి?
- కార్తికేయ నాకు ఫోన్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ గురించి చెప్పారు. శశాంక్ వచ్చి కథ చెప్పారు. నా జీవితంలో అసలు ఇలాంటి ఓ కథను వినలేదు. విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని ఎలా అయినా సరే చేయాలని ఫిక్స్ అయ్యాను.
- సినిమాలో మ్యాజిక్ అనేది కీలకంగా ఉంటుందా?
- ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే చిత్రంలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యాజిక్ అనే పార్ట్ ఒక అంశం మాత్రమే. ఈ సినిమాలో లోతైన అంశాలు, భావోద్వేగాలెన్నో ఉన్నాయి. చాలా మందికి చాలా విషయాల్ని అర్థమయ్యేలా చెప్పే చిత్రం అవుతుంది.
- ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా చేసే క్రమంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు?
- మలయాళంలో కథను అర్థం చేసుకుని, డైలాగ్స్ నేర్చుకుని.. ఇంగ్లీష్‌లోకి మార్చుకుని.. తెలుగులో నటించడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. కాస్త కష్టంగానే అనిపించినా ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది.
- సినిమాను చాలా వరకు రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయటం ఎలా అనిపించింది?
- నాకు రియల్ లొకేషన్లో షూటింగ్ చేయడం అంటేనే ఇష్టం. కానీ ‘పుష్ప’ సినిమాకి మాత్రం అలా చేయడం కుదరలేదు. ఈ సినిమాని చాలా వరకు రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం.
- విభిన్నమైన సినిమాల్లో నటిస్తుంటారు.. రైటర్స్‌కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్పండి?
- ఆర్టిస్టుల కంటే రచయిత, దర్శకులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది నా అభిప్రాయం. శశాంక్ ఈ మూవీకి రైటర్, డైరెక్టర్. కథ బాగుంటేనే సినిమా బాగుంటుంది. తెలుగు ఇండస్ట్రీ వల్లే మన సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లింది.
- చిన్నపాప సారాతో నటించటం ఎలా అనిపించింది?
- సారా అద్భుతమైన నటి. కెమెరా ముందు ఎంతో ఆర్గానిక్‌గా నటిస్తుంది. పేపర్ మీదున్న దాని కంటే ఎక్కువగా ఇంప్రవైజ్ చేస్తుంది. ఎంతో యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా యాక్ట్ చేసింది.
- ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
- నేను చేసే ప్రతీ పనిలో నా బెస్ట్ ఇవ్వాలని, నా వర్క్ పట్ల నేను నిజాయతీగా ఉండాలని అనుకుంటాను. ఇందులోని నా పాత్ర అద్భుతంగా ఉంటుంది. నా కారెక్టర్లోని జర్నీ కొత్తగా ఉంటుంది. చెడు నుంచి మంచిగా మారే ఆ జర్నీ అందరికీ నచ్చుతుంది.
- తెలుగు మాట్లాడటం నేర్చుకున్నారా?
- నేను గత ఏడాదిన్నరగా ఇక్కడే ఉంటున్నాను. ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు. తెలుగు కొంచెం కొంచెం వచ్చింది. నెక్ట్స్ టైం పూర్తిగా మాట్లాడతాను. అయితే ఈ సినిమాలో నా పాత్రకు నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాను.
- కాలభైరవ సంగీతం గురించి చెప్పండి?
- కాల భైరవ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. ఆయన మ్యూజిక్ ఈ మూవీలో ఒక కారెక్టర్‌లా ఉంటుంది. ఆయన బీజీఎం యాడ్ అయ్యాక సినిమా నెక్ట్స్ లెవెల్లో అనిపించింది. నిజానికి షూటింగ్ స్టార్ట్ కావటానికి కంటే ముందే తను మ్యూజిక్‌ను అందించారు.
- ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టైటిల్ ఓ డైలాగ్ నుంచి పెట్టారని తెలుసా..
- తెలుసు.. బాలకృష్ణగారి సినిమాలోని డైలాగ్. ఈ సినిమా కోసం టైటిల్ పెట్టే క్రమంలో బాలయ్య బాబుని కలిశాం. ఆయన మా అందరినీ ఎంతో సాదరంగా స్వాగతించారు. తెలుగు పరిశ్రమలోకి నాకు స్వాగతం పలికారు. మా సినిమాలోని కొన్ని సీన్స్ చూపించాం. ఆయన చాలా ఎంజాయ్ చేశారు. చిన్నప్పటి నుంచి ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను.
- ఈ మూవీలో సూరి పాత్ర గురించి చెప్పండి?
- సూరి కారెక్టర్ని ఆడియెన్స్ ఇష్టపడతారు. నేను నా రియల్ లైఫ్‌లో సూరి పాత్రలా ఉండను. కానీ సూరి లాంటి కారెక్టర్స్ని నేను నా జీవితంలో చాలా మందిని చూశాను. స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు అనేది నాకు నచ్చదు. కానీ కచ్చితంగా అవసరం అని అనిపిస్తే మాత్రం టీంతో కలిసి చర్చిస్తాను. అయితే మంచి ఆరంభం, ఇంటర్వెల్, క్లైమాక్స్ లేకపోతే సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్లను. అవి మూడు సరిగ్గా సెట్ అయితే మిగతా అంతా ఆటోమేటిక్‌గా కుదురుతుంది.
- ఈ జర్నీ స్టార్ట్ అయ్యి 24 ఏళ్లవుతుంది.. దాని గురించి చెప్పండి!
- ఇంజనీరింగ్ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యాను. నా మొదటి సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత యు.ఎస్ వెళ్లాను. అక్కడే ఉండిపోతానేమో అనుకున్నా.. అయితే అక్కడ వరల్డ్ సినిమాకు సంబంధించి కొందరినీ కలిశాను. బుక్స్ చదివాను. ఆరేళ్లు అలా అక్కడే ఉండిపోయాను. అయితే ఒకసారి ఇండియాకు వచ్చి ఒక్క సినిమా చేసి మళ్లీ తిరిగి వెళ్లి పోవాలనుకున్నాను. అలా ఒక్క సినిమా నుంచి ఇప్పుడు 66 సినిమాలు అయ్యాయి.
- రాజమౌళిగారిని కలిశారా?
- రాజమౌళి గారు మా సినిమాలోని కొన్ని సీన్స్ చూసి సలహాలు ఇచ్చారు. ఫైనల్ ప్రొడక్ట్ చూసి ఆయన హ్యాపీగా ఫీలయ్యారు.
- ఆర్కామీడియాలో మరో సినిమా చేస్తున్నారా?
- ఆర్కా బ్యానర్లోనే మరొక సినిమా చేస్తున్నాను. వచ్చే ఏడాదిలో ఆ ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తారు.
