
Chillara Song From Mugguru Kothulu Released by Attitude Star Chandrahas
Presented by GSR Creations and co-presented by Sky Flare Networks, ‘Mugguru Kothulu’ is being produced by Shobha Rani Garimella and directed by Kartik Garimella . The film features Teja Kondapally, Ganesh Bodda and Devansh in key roles, while Varshika Pasam plays the female lead. The film’s first-look poster and the ‘Mugguru Kothulu’ title song, along with the promotional content released so far, have created good interest among the audience. As part of the musical promotions, the songs released so far have received a positive response.
Recently, the ‘Chillara Song’ from the film was launched by Attitude Star Chandrahas. On the occasion, he conveyed his best wishes to the entire team of ‘Mugguru Kothulu’ and wished the film great success.
The song, titled ‘Chillara Song’, features catchy lyrics, vocals and composition by S. Suhas. Written jointly by Ganesh Bodda and S. Suhas, the song is sure to appeal to audiences. The lyrical video, featuring the three lead actors having fun and chilling together, is a special attraction.
S. Suhas is composing the music for the film, while Raj Nomula is the cinematographer and Zameer Shaik is the editor. The team is gearing up to entertain audiences with more interesting updates in the coming days.
*Cast:*
Teja Kondapally, Ganesh Bodda, Devansh, Varshika Pasam and others
*Technical Team:*
Presented by: GSR Creations Co-Presented by: Sky Flare Networks Producer: Shobha Rani Garimella
Director: Kartik Garimella Cinematography: Raj Nomula
Music: S. Suhas
Editing: Zameer Shaik
PRO: Sai Satish
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు చిల్లర సాంగ్ విడుదల
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ ఇలా వరుసగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ చిత్రంలోని **‘చిల్లర సాంగ్’**ను యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ముగ్గురు కోతులు’ చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
‘చిల్లర సాంగ్’ అంటూ సాగే ఈ పాటకు ఎస్. సుహాస్ అందించిన సాహిత్యం, గాత్రం, బాణీ ఎంతో క్యాచీగా ఉన్నాయి. గణేష్ బొడ్డ, సుహాస్ ఎస్ సంయుక్తంగా రాసిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ లిరికల్ వీడియోలో ముగ్గురు హీరోలు సరదాగా చిల్ అవుతున్న సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్తో ప్రేక్షకులను అలరించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
*నటీనటులు:*
తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు
*సాంకేతిక బృందం:*
సమర్పణ : జీఎస్ఆర్ క్రియేషన్స్
సహ సమర్పణ : స్కై ఫ్లేర్ నెట్వర్క్స్
నిర్మాత : శోభారాణి గరిమెల్ల
దర్శకుడు : కార్తీక్ గరిమెల్ల
కెమెరా : రాజ్ నోముల
సంగీతం : ఎస్. సుహాస్
ఎడిటింగ్ : జమీర్ షేక్
పీఆర్వో : సాయి సతీష్
