
డార్క్ చాక్లెట్ సినిమా గురించి కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు – విశ్వదేవ్ రాచకొండ
రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘డార్క్ చాక్లెట్’ చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ చేశారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ. ‘కల్లో కల్లోలం’ పాట ఈ సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో వస్తుంది. ఈ సాంగ్ సినిమాకు చాలా ఇంపార్టెంట్. వివేక్ సాగర్ చాలా అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. ఇందులో లిరిక్స్ కూడా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. మా డైరెక్టర్ కూడా సాంగ్స్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. అనురాగ్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ పాట ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. ఇది చాలా కొత్త తరహా సినిమా. ఈ సినిమా గురించి ఆడియన్స్ కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. దర్శకుడు రాసింది రాసినట్టుగా తెరకెక్కించారు. వివేక్ సాగర్ ఈ కథను చాలా అద్భుతంగా అర్థం చేసుకుని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ చాలా అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మరోసారి చూడటానికి కూడా ఎదురుచూస్తున్నారు. రానా గారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా గురించి ఆయన కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా ఒక పెద్ద బ్యాంగర్ అవుతుంది. . బిందు మాధవి గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. కచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం.
డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ‘కల్లో కల్లోలం’ పాటలో ఈ సినిమా కథంతా నిక్షిప్తమై ఉంది. కాకపోతే అది అంత ఈజీగా పట్టుకోలేం. చాలా ఇంట్రెస్టింగ్ సిట్యువేషన్లో ఈ పాట వస్తుంది. ఈ పాటకు వివేక్ సాగర్ తప్ప మరొకరు మ్యూజిక్ చేయలేరనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. బాలాదిత్యలో చాలా మంచి లిరిసిస్ట్ ఉన్నారు. ఈ పాటకు చాలా చక్కని లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు. మూవీలో ఇది నా ఫేవరెట్ సాంగ్. ట్రైలర్ చూస్తే సినిమా అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇది చాలా కొత్త రకం డార్క్ కామెడీ సినిమా. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు.
బిందు మాధవి మాట్లాడుతూ.. నాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈరోజు ఆయన చేసిన మ్యూజిక్‌లో నేను వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘డార్క్ చాక్లెట్’లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి సినిమా. మా డైరెక్టర్ గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. డార్క్ కామెడీ మూవీగా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు.
డైరెక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇందులో విశ్వదేవ్ వర్సటాలిటీ కనిపిస్తుంది. వివేక్ సాగర్ ‘కల్లోలం’ సృష్టించారు. వివేక్ సాగర్ లాంటి న్యూజ్ ఇండస్ట్రీకి ఒక బ్లెస్సింగ్. ‘డార్క్ చాక్లెట్’ కూడా ఆయన కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ అవుతుంది.
వివేక్ సాగర్ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏదైనా సరే కథతోనే మ్యూజిక్ వస్తుంది. శశాంక్ చాలా అద్భుతమైన ఐడియాతో వచ్చారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బాలాజీ చాలా చక్కగా రాశారు.
అనురాగ్ కులకర్ణి మాట్లాడుతూ.. ఈ పాటకు నన్ను ఎంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా కొత్త రకం పాట. వివేక్ సాగర్ గారి మ్యూజిక్‌లో పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం: విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: శశాంక్ శ్రీవాస్తవయ
సమర్పణ: రానా దగ్గుబాటి
నిర్మాతలు: స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
సౌండ్ మిక్స్: అజిత్ అబ్రహం జార్జ్
పీఆర్వో: వంశీ-శేఖర్
