
Nenu Ready Team Released Birthday Special Poster for Hero Havish
నేను రెడీ – బర్త్ డే స్పెషల్ పోస్టర్లో స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్న హవిష్
కమర్షియల్ హిట్స్ అందించిన దర్శకుడు త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో, యంగ్ హీరో హవిష్ భారీ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’ కోసం సిద్ధమవుతున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ నటిస్తోంది. కామెడీ, వినోదం, మాస్ అంశాల కలయికతో ఈ సినిమా రూపొందుతోంది.
హవిష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో హవిష్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఒక వేర్‌హౌస్ సెట్టింగ్‌లో కూర్చుని ఉన్న హవిష్ తన ప్రజెన్స్ కట్టిపడేశాడు. అతని ట్రెండీ లుక్ అతని పాత్రపై ఆసక్తిని పెంచుతున్నాయి.
అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామరస్ నటనతో బాలీవుడ్లో సంచలనం సృష్టించిన నర్గీస్ ఫక్రి ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటతో తెలుగు తెరకు పరిచయం కానుంది.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, విటివి గణేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
‘నేను రెడీ’ చిత్రం అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులతో రూపొందుతోంది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీని, ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
మేకర్స్ త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది.
నటీనటులు: హవిష్, కావ్య థాపర్, నర్గీస్ ఫక్రి (స్పెషల్ సాంగ్), బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం సత్యనారాయణ, రోహన్ రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
డీవోపీ: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్
