
Makers of Mirzapur – The Movie Unveil First-Look Character Posters
Ahead of the teaser launch tomorrow, the makers have unveiled a series of first-look character posters featuring the iconic Gaddi, Munna Bhaiya, Guddu Bhaiya and Kaleen Bhaiya. Carrying the message, “Gaddi Hai Toh Hum Hain,” the posters revisit the power, legacy and rivalries that have defined the Mirzapur universe, instantly sparking excitement among fans.
The reveal has already generated buzz online, with audiences revisiting the world of Mirzapur and speculating about what awaits in its big-screen chapter. With the teaser arriving tomorrow, anticipation is only set to grow.
Presented by Amazon MGM Studios and Excel Entertainment, Mirzapur: The Movie is directed by Gurmeet Singh, written by Puneet Krishna, and produced by Ritesh Sidhwani and Farhan Akhtar under the banner of Excel Entertainment. The film is co-produced by Kassim Jagmagia and Vishal Ramchandani, film is all set to release in Hindi and Telugu language and is slated for a worldwide theatrical release on 4 September 2026.
‘మిర్జాపూర్: ది మూవీ’ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు విడుదల
మిర్జాపూర్: ది మూవీ టీజర్ విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. మిర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన ‘గద్దీ’, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “గద్దీ హై తో హమ్ హై” అనే శక్తివంతమైన సందేశంతో విడుదలైన ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్‌లోని అధికారం, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.
ఈ పోస్టర్ల విడుదలతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మిర్జాపూర్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది.
అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ మరియు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న మిర్జాపూర్: ది మూవీ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా, పునీత్ కృష్ణ కథను అందించారు. రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాసిమ్ జగ్మాగియా, విశాల్ రామ్‌చందానీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు భాషలోనూ విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
