
CHITRALAYAM STUDIOS RAMAM MOVIE INVITES ASPIRING ACTORS THROUGH A SPECIAL CASTING CALL
Presented by Donepudi Chakrapani and produced by Venu Donepudi under the Chitralayam Studios banner, the prestigious pan-India film “Ramam” is being directed by Lokamanya. With the tagline “The Rise of Akira,” the movie is being made with international standards and top-notch technical values.
The makers have now announced a Casting Call for aspiring actors and actresses.
People of all age groups who dream of making a mark in the film industry and showcasing their acting talent can participate in the auditions. Auditions will be held on June 25, 26, 27, and 28, from 11:00 AM to 6:00 PM.
Interested candidates can send their recent photograph, biodata, and a 1–2 minute self-introduction video via WhatsApp to 9949814280 or email them to CONNECT@CHITRALAYAM.COM. Aspiring actors can also apply by scanning
ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న చిత్రాలయం స్టూడియోస్ “రామం” మూవీ
దోనేపూడి చక్రపాణి సమర్పణలో, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రామం”. ది రైజ్ ఆఫ్ అకిరా అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో “రామం” సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతూ మేకర్స్ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు.
చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందాలని, నటీనటులుగా ప్రతిభ చాటాలని ఆశిస్తున్న అన్ని వయసుల వారు ఈ సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ నెల 25, 26, 27, 28వ తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహిస్తారు. మీ రీసెంట్ ఫొటో, బయోడేటా, ఒకటి రెండు నిమిషాల నిడివి గల మీ షార్ట్ ఇంట్రడక్షన్ వీడియోను 9949814280 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు లేదా CONNECT@CHITRALAYAM.COM ఐడీకి మెయిల్ చేయవచ్చు. ఈ కాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ పై ఇచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఔత్సాహిక నటీనటులు అప్లై చేసుకోవచ్చు.
