Rebel Star Prabhas Unveiled Glimpse Of Romeo Juliet – Theatrical

3rd Single Released from Srinivasa Mangapuram
జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి శ్రీనివాస మంగపురం థర్డ్ సింగిల్ గుండెపేలిపోతోందే జూన్ 16న రిలీజ్
ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగపురం’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు.
ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జివి ప్రకాష్ కుమార్ అందించిన రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి.
ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. గుండెపేలిపోతోందే సాంగ్ జూన్ 16న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ ఫీల్ గుడ్ వైబ్‌ను ఇస్తోంది.
టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో హీరో-హీరోయిన్ లుక్స్ “గుండె పేలిపోతోందే” అనే టైటిల్‌కి తగ్గట్టుగా ప్రేమలోని అందమైన ఎమోషన్స్ ని పోస్టర్ ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రానికి జయకృష్ణ ISC డీవోపీ, మాధవ్ కుమార్ గుల్లపల్లి ఎడిటర్, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్, రియల్ సతీష్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
నటీనటులు: జయకృష్ణ ఘట్టమనేని, రాషా తాడాని, మోహన్ బాబు
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్
PRO: వంశీ-శేఖర్
