
National Award-Winning DOP Tirru Joins #RAPO23
That seems to be the question around #RAPO23 ever since the film was announced on his birthday. After surprising audiences with the first glimpse of his character Veera, Ram Pothineni is now taking the excitement a notch higher with National Award-winning cinematographer Thirunavukarasu, popularly known as Tirru, officially coming on board as the Director of Photography.
#RAPO23 marks Ram’s debut as writer-director, while also featuring him in the lead role. Produced by Krishna Pothineni under the newly launched banner Rapo Cinematics, the film is being mounted on a huge scale as a psychological action thriller in a Neo-noir and emotionally charged world built around the tagline, “The Story of a Lone Wolf.”
Known for constantly pushing himself into new creative spaces, Ram is said to be approaching this film as more than just another milestone. From writing and direction to performance and world-building, #RAPO23 is being shaped as a deeply personal and ambitious cinematic experience.
The announcement poster, which introduced him as Veera, sparked curiosity with its striking visual tone and the phrase “The Story of a Lone Wolf.” With Tirru now joining the project, the makers seem to be assembling a strong technical team to bring this intense world to life.
Tirru, known for his visually rich and atmospheric work across Indian cinema, has collaborated on films that span scale, style, and strong storytelling. His National Award-winning body of work and distinctive command over mood, light, and cinematic texture make his association with #RAPO23 a significant addition to the film’s creative force.
With RAPO stepping behind the camera for the first time and Tirru taking charge of the visuals, #RAPO23 is shaping up to be one of the most intriguing projects to watch out for.
More details about the cast and crew are expected to be announced soon.
రామ్ పోతినేని- కృష్ణ పోతినేని, రాపో సినిమాటిక్స్ #RAPO23 కి డీవోపీగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లో మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. #RAPO23 చిత్రంతో ఆయన దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాలు, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ‘వీర’ ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిరు) ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా జాయిన్ అయ్యారు.
#RAPO23 చిత్రంతో రామ్ రచయిత-దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, అలాగే ఇందులో ఆయనే హీరో పాత్రలో నటిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రం “The Story of a Lone Wolf” అనే ట్యాగ్‌లైన్‌తో నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతోంది.
ఎప్పుడూ కొత్త సవాళ్లను స్వీకరిస్తూ తనను తాను కొత్త కోణాల్లో ఆవిష్కరించుకునే రామ్ పోతినేని, #RAPO23ను కూడా తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. కథ, దర్శకత్వం, నటనతో పాటు సినిమా వరల్డ్ బిల్డింగ్ వరకు ప్రతి అంశంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన విజువల్ స్టైల్, ఫ్రేమింగ్, లైటింగ్, కథనానికి ప్రాణం పోసే సినిమాటోగ్రఫీతో తిరు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. జాతీయ అవార్డు అందుకున్న ఆయన అనుభవం, మూడ్, లైట్, సినీమాటిక్ టెక్స్చర్పై ఉన్న పట్టు #RAPO23కి మరింత బలాన్ని చేకూర్చనుంది.
తొలిసారి దర్శకత్వం వహిస్తున్న రామ్ పోతినేని, డీవోపీ తిరు కాంబినేషన్ తో #RAPO23 అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది.
ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
