
డైమండ్ డెకాయిట్ మూవీ రివ్యూ
కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన “డైమండ్ డెకాయిట్” చిత్రం ఈ రోజు (శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదలైంది. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? చిత్రయూనిట్ ముందే చెప్పినట్టు క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుతో ఒక అనుభూతి ప్రధాన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారా? ఇంతకీ ఈ సినిమా హిట్టా? పట్టా? ఇవాల్టీ రివ్యూ రిపోర్ట్‌లో తెలుసుకుందాం.
కథ
ఒక మనిషిని రక్షించేందుకు ప్రయత్నించిన గోపాల్ కుటుంబం చిన్నాభిన్నాం అవుతుంది. భయంకర డెకాయిట్‌గా పేరు తెచ్చుకున్న మునుస్వామి నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎదుగుతాడు. జైలు నుంచి విడుదలైన గోపాల్ అతని గ్యాంగ్‌లో చేరుతాడు. అయితే బయటకు అతను మునుస్వామి నాయుడికి నమ్మకస్తుడిగా కనిపించినా, లోపల మాత్రం అమాయకులను రక్షిస్తూ డబుల్ లైఫ్ గడుపుతుంటాడు.
గోపాల్ గతంలో ఎందుకు జైలుకు వెళ్లాడు? అతని అసలు లక్ష్యం ఏమిటి? వరుస హత్యలు, మరో హత్యా యత్నం వెనుక ఉన్న నిజం ఏమిటి? గోపాల్ ఎందుకు బండిపోటుగా మారుతాడు? చివరకు బయటపడే నిజాలు కథకు కీలకం అవుతాయి.
నటీనటుల పనితీరు
పర్ధ గోపాల్: ఈ సినిమాకు ఆయనే ప్రధాన బలం. అటు నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ అందించడమే కాకుండా, హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ, ఎమోషనల్ సీన్లలోనూ తన ప్రతిభతో సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు.
మేఘన: హీరోయిన్ మేఘన తన క్యూట్ లుక్స్‌తో అలరించడమే కాకుండా, కీలక సన్నివేశాల్లో మెప్పించే నటన కనబరిచింది.
మిగిలిన నటీనటులు తమ పరిధి మేర చక్కగా నటించారు.
సాంకేతిక విభాగం
దర్శకుడు సూర్య జి. యాదవ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలతో సినిమాను భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు. ఆయన టాలెంట్ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
పర్ధ గోపాల్ నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు. సాయి రాజు రాసిన డైలాగ్స్ సహజంగా ఉండి కథకు బలం చేకూర్చాయి.
సినిమాటోగ్రఫీ శివ అచంట విజువల్స్ సినిమాకు హైలైట్. కడప జిల్లాలోని 60కి పైగా అందమైన, సహజమైన లొకేషన్లను ఎంతో రిచ్‌గా చూపించారు.
PR అందించిన నేపథ్య సంగీతం (BGM) ప్రతి ఎమోషనల్ సీన్‌ను ఎలివేట్ చేసింది. పాటలు కూడా బాగున్నాయి. గోపాల్ కుటుంబం ఊరి నుంచి వెళ్లిపోయే పాట ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. అలాగే నాన్నపై పాట గుండెను తాకుతుంది.
విశ్లేషణ
మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ‘మాతృదేవోభవ’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ అంతటి లోతైన భావోద్వేగాలను, కుటుంబ అనుబంధాలను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం “డైమండ్ డెకాయిట్”. యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా అంతర్లీనంగా ఒక హృద్యమైన ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. కుటుంబ బంధాలు, త్యాగం, ప్రేమ, బాధ వంటి అంశాలను కథలో సహజంగా మేళవించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయి.
దర్శకుడు సూర్య జి. యాదవ్ కథను నడిపించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల గుండెలను పిండేస్తాయి. ప్రతి సామాన్య కుటుంబం కనెక్ట్ అయ్యేలా త్యాగం, అనుబంధాలను వెండితెరపై చక్కగా ఆవిష్కరించారు.
కడప జిల్లా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సహజ సౌందర్యాన్ని తెరపై అందంగా ఆవిష్కరించింది. 60కి పైగా లొకేషన్లలో చిత్రీకరణ జరపడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్స్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలోకి లాగుతాయి.
క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ కలయికతో రూపొందిన కథనం కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా సాగుతుంది.
భావోద్వేగపూరిత క్లైమాక్స్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, పర్ధ గోపాల్ నటన, సహజమైన లొకేషన్లు, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.
కుటుంబ బంధాలు, త్యాగం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు “డైమండ్ డెకాయిట్” మంచి అనుభూతిని అందించే చిత్రం. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకుల మనసులను తాకేలా ఉంటుంది. చాలా కాలం తర్వాత కుటుంబంతో కలిసి చూడదగిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా నిలుస్తుంది.
రేటింగ్ – 3/5
