
Gowri Movie Song Recording started
గౌరి, ఓ కనుపాప కథ Song Recording Started
మరో బాలల చిత్రం దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి శిష్యుడు శ్రీ K మోహన్ గారు J. D. S. Creations Banner పై నిర్మిస్తున్న చిత్రం గౌరి, ఓ కనుపాప కథ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు “పరాభవ ఉగాది” నామ సంవత్సర ప్రారంభ దినమున ( 19/3/2026) ఎల్లారెడ్డి గూడలోని రాగా స్టూడియోలో జరిగినాయి. Song recording జరిగినది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TFDA అధ్యక్షులు ప్రముఖదర్శకులు శ్రీ VN ఆదిత్య గారు హాజరైనారు. చిత్ర బృందానికి శ్రీ ఆదిత్య శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్ర కథ ఒక గ్రామంలో ప్రారంభమై నగర ప్రాంతానికి వస్తుంది చిత్రంలో ముఖ్యపాత్ర గౌరి పాత్రదే.. తమ్ముడు గోపి పాత్ర చాలా కీలకమైనది అక్క తమ్ముళ్ల మధ్య జరిగే ఈ కథ చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది ఎన్నో ఆసక్తికరమైన సంఘటనల మేళవింపు ఈ కథ గౌరి Background song ఈరోజు recordingజరుపుకోవడం విశేషం. ఈ చిత్రం ద్వారా శ్రీ సువర్ణ మధుసూదన రావు గారు సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారని శ్రీ మోహన్ గారు తెలియజేశారు ” నేత్రదానం” ప్రధానమైన అంశముగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటీనటులు కొత్త పాతల కలయికగా ఉంటారని దర్శకులు తెలియజేశారు 15/4/2026 shooting ప్రారంభించబడి పాఠశాలలు పున ప్రారంభించే నాటికి అనగా 15/6/2026 నాటికి ఈ చిత్రం యొక్క చిత్రీకరణ పూర్తవుతుందని 28/8/2026 రక్షాబంధన్ పండుగనాటికి విడుదలకు సిద్ధమవుతుందని దర్శకుడు శ్రీ కె మోహన్ స్పష్టపరిచారు. మంచి కథాంశంతో చక్కటి నటీనటుల బృందముతో బాలలకు స్ఫూర్తిదాయకముగా సమాజానికి సందేశాత్మంగా ఈ చిత్రం ఉంటుందని బాలల చిత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే దర్శకులు శ్రీ k మోహన్ తెలియజేశారు.

